Where is our code..?
ఫ్యాషన్ ... ఓ రంగుల ప్రపంచం. యవనులకైతే .. ఊహలకందని వింత లోకం. డిజైన్ పేరుతో ఆరంబించి డ్రెస్ కోడ్ ని మార్చివేసింది. ఈ మద్య ఫ్యాషన్ అంటూ మెలికలు తిరుగుతూ స్టయిల్ గా చెప్పటం మామూలైపోయింది. రొటీన్ అనే పదానికి రవ్వంతైనా చోటు లేదు. రెడీమేడ్ దుస్తువులతో రొమాంటిక్ గా కనిపించటం కామన్ గా మారింది. అబ్బాయిలు షార్ట్ లెంత్ మేతటిరియల్ తో కేరింతలు కొడుతుంటే .. స్లీవ్ లెస్ డ్రెస్ లతో అమ్మాయిలు హంగామా సృష్టిస్తున్నారు. నాటి మనుషులు నిండు వస్త్రాలతో శరీరాలను కప్పుకుంటే, నేటి మనుషులు జానెడు దుస్తులతో అందమైన శరీరాలను అంగడి సరుకుగా మారుస్తున్నారు. రోజు రోజుకి వస్త్రాల సైజు తగ్గుతూ వుంటే .. లో దుస్తువులతో జీవించే రోజులు దగ్గరే ఉన్నాయని అన్పిస్తుంది. రాబోయే రోజుల్లో ఆదిమానవుల్లా బట్టలు లేకుండా జీవించినా ...? ఆశ్చర్య పోవటమే మనవంతవుతుంది.
ఆనాటి మనుషులు అజ్ఞానంతో చెట్టు ఆకులతో నగ్నత్వాన్ని కప్పుకున్నారు.. ఆధునిక మనుషులు జ్ఞానమనే చెట్టుని నరికి నగ్నత్వం వైపు ప్రయాణిస్తున్నారు. చూడటానికి ఎంతో అవమాన కరంగా , అనుకరించడానికి అయోగ్యంగా ఉన్నా ..సిగ్గు పడాల్సిన మనుషులు గర్విస్తూ ఉంటే ,ఈ తరం మనుషుల గూర్చి మీ అభిప్రాయమేమిటని రవిజకరియ గారిని ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు .. ఈ తరం మనుషులు సిగ్గు పడాల్సిన వాటి విషయంలో గర్విస్తున్నారు .. గర్వించాల్సిన వాటి విషయంలో సిగ్గు పడుతున్నారు అని ముక్కు సూటిగా జవాబు చెప్పాడట. అందుకే ఎవరు అనాగారికులో , ఎవరు ఆధునికులో అర్థంకాక తలలు పట్టుకుంటున్నారు మేధావులు. శరీర వంపు సొంపులను ఉచితంగానే చూయిస్తూ బజారులోనే సినిమాను తలపిస్తున్నారు. సినిమాల మూలంగా ఈవిధంగా తయరయ్యారో, వీరిని చూసే సినిమాలు తీస్తున్నారో నాకిప్పటికి అర్థం కావట్లేదు. సినిమాల మూలంగానే సమాజం చెడి పోయిందని అనేక పరిశోధన పత్రాలు నిరూపించినా .. తీసేవారు ఆలోచించట్లేదు, చూసేవారు ఆగట్లేదు .. ప్రభుత్వ నియమాలు కటినంగా లేకపోవడం వల్ల దిగజారిన సంస్కృతి దిన దినం పెరుగుతూనే ఉంది. ఏది ఏమైనా .. ఇద్దరి పాత్ర సమానంగానే ఉందనేది అందరు అంగికరించాల్సిన సత్యం.
పూర్వ కాలంలో స్త్రీలు మాత్రమే జడలు అల్లుకునేవారు. చెవికి పోగులు, ముక్కుకి పుల్లలు, కాళ్ళకు పట్టీలు, చేతులకు గాజులు ధరించేవారు. నవతరం స్త్రీలు జడలు అల్లుకోవటానికి బదులు.. విరబోసుకుని తిరగటం, టీ షర్ట్లు , జీన్ పాన్టులతో హంగామా సృష్టించటం నయా ట్రెండ్ గా మారింది. అర్ధ రాత్రి ఇంట్లో ఉండాల్సిన ఆడ పిల్లలు .. క్లబ్బుల్లో పురుషులతో కలిసి తాగుతూ గంతులు వేయటం మామూలై పోయింది. ఇదిలా వుండగా .. యువకులు జడలు వేసుకోవటం, రిబ్బన్లు పెట్టుకోవటం , చెవికి కమ్మలు పోగులు ధరించటం, చేతికి కడియాలు, మెడలో రక రకాల హారాలు ధరించటం మన చుట్టూ పెరుగుతున్న నీచ సంప్రదాయం. వీళ్ళని పురుషులనాలో లేదా ఆడంగులని పిలువాలో అర్థం కావటం లేదు. ఇలాంటి పరిస్తితులను ముందుగానే తెలిసిన దేవుడు సరైన కట్టుబాట్లను వేల సంవత్సరాల పూర్వమే బైబిల్ గ్రంధంలో హెచ్చరించాడు. క్రైస్తవ యువకులని చెప్పుకుంటున్న యువతీ యువకులు సహితం సిగ్గుపడక పోవటం అత్యంత ప్రమాదకర విషయం.
నియాన్ లైట్ల వెలుతురు .. నక్షత్రాలను తలపించే బల్బులు, వెరైటి కలర్స్ తో నిండిన హాల్లు .. వింత డిజైన్లతో బార్లు, మైమరిపించే సంగీతం .. మారు మోగే కేకలు, మురిపించే జంటలు .. ఉద్రేకాన్ని పుట్టించే స్టెప్పులు, స్వేచ్చా వాయువుల కోసం .. సుకమయ జీవనం కోసం, అందరు నిద్ర పోయాక .. ఆర్ద్ర రాత్రి దాటాక, అరువు తెచ్చుకున్న భామలతో .. అర్ధ నగ్న దృశ్యాలతో, మనిషిలో మొదలైన తపన .. మేధస్సుకే హద్దులు చెరిపేసిన ఘటన, మత్తులో మునిగి పోయి .. మైకంతో కళ్ళు ముసుకు పోయి, మదమెక్కిన పశువుల వలె .. గుంపులు గుంపులుగా కుప్పి గంతులు వేస్తుంటే .. ఆధునికులా లేక ఆటవికులా అనే ప్రశ్న నేటితరం మేధావులకు రాకమానదు. వీకెండ్ దగ్గర పడుతుంటే .. తేదీలు మారుతూ వుంటే .. గడియారం గిర్రున తిరుగుతూ వుంటే .. క్షణాలు కదులుతూ వుంటే .. గప్‌చుప్ గా గేటు దాటేస్తారు. పబ్ లో వాలి పోయి ... వన్ .. టూ .. త్రీ .. అంటూ రాళ్ళు పగిలే రాక్ హోరు .. దమ్ము దుమ్ము లేపుతుంది .. గిటారు గగ్గోలు పుట్టిస్తూ .. ఒకాల్ సముద్రమై ఎగిసిపడుతుంది .. అంతలోనే తెల్లారుతుంది .. కాలేజికి బంక్ .. ఆఫీస్ కి డుమ్మా .. నో బాయ్ .. నో చాయ్ .. ఓన్లీ రాక ఫాస్ట్ .. వీళ్ళింతే .. వీళ్ళ లైఫ్ ఇంతే .. వీళ్ళ ప్రపంచం ఇంతే .. iam ready gonna, change the world, gonna turn the phase, gonna say what you feel, i was not born to follow వీళ్ళకు మూస ఇష్టం లేదు, మూసగా ఆలోచించరు, మూసగా బతుకరు, నచ్చితే అనుకరిస్తారు లేదంటే చచ్చినా ఎవర్ని అనుసరించరు .. ఇవి నేటి తరం యొక్క వింతైన సంగతులు.
మనుషులు తప్పుగా వాడుతున్న ఏకైక పధం ఏంటని ప్రశ్నిస్తే .. స్వేచ్చ అని జవాబిస్తాను నేను. ఏనాడు లేనంత విస్తృత ప్రచారం ఈ పదానికి ఎందుకు కల్పించారో నేటి తరపు మహానుభావులు చెప్పాల్సి ఉంది. వివరణలు మారాయి. విపరీత అర్థాలు మన గ్రందాల్లోకి వచ్చి చేరాయి. నిక్కచ్చిగా చెప్పే నిర్వచనాలు ఎప్పుడో కనుమరుగై పోయాయి. హద్దులు లేని హక్కులనే వికృత వివరణకు దారి తీసాయి. మాటల్లో, మూటల్లో, చేతల్లో, చూపుల్లో ఈ భావమే ప్రస్పుటంగా కన్పిస్తుంది. నిజానికి స్వేచ్చకు హద్దులు లేవా? అని అడిగే ముందు మనిషి పరిమితుడా అపరిమితుడా? అనే ప్రశ్నకు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. సత్యమేమిటంటే మనిషి పరిమితుడని, పరిమితమైనవాడికి అపరిమితమైన స్వేచ్చా స్వాతంత్రాలు ఉండే అవకాశం లేదని శాస్త్రం ఖండిస్తుంది.
నేటి తరంలోని సమస్యలన్నిటికీ ప్రధాన కారణం స్వేచ్చా అనే పదాన్ని తప్పుగా అర్థం చేసుకోవటమేనని నా బలమైన వాదన. ఆశకు అత్యాశకు మధ్య ఉన్న బేధాన్ని గమనించక పోవటమేనని తెలివిపరుల ఆవేదన. యుగం మారింది .. నిర్వచనం లేకుండా పోయింది .. ఎవరి ఇష్టం వారిదే అనే పంథా నేటి కాలంలో చలామణి అవుతుంది. ఏమైనా మాట్లాడవచ్చు .. ఏదైనా చేయవచ్చు .. అందినంత దోచుకోవచ్చు .. అడ్డమస్తే చంపేయచ్చు .. చుట్టూ మనుషులు తరచూ చెప్పే డైలాగులు ఇవి. కుటుంబ విలువలు , సామాజిక కట్టుబాట్లు , మనకు కాదనే పొగరుతో కూడిన కామెంట్లు. ఇవన్ని అంతులేని స్వేచ్చకు , సుఖవలయం పేరుతో ఆడుతున్న ఆటకు ప్రత్యక్ష సాక్షాలే. ప్రతి పదానికి రెండు వైపులా పదును ఉంటుంది. ఓ వైపు పరిరక్షణ కోరుకుంటే ,మరో వైపు ప్రమాదాన్ని సూచిస్తుంది. దేవుడు మానవాళికి నియమించిన నైతిక నియమాలను మరిచిపోయి ఇస్టాను సారంగా బ్రతుకుతున్న ఈతరం గురించి ప్రముఖ చరిత్రాకారుడు తన జీవిత చివరి దశలో .. "నైతిక విలువలను కాల రాసిన ఏ తరం చరిత్రలో నిలువలేదు .. అభివృద్ధి చెందామని చెబుతున్న ఈ తరం అంతమయ్యే రోజులు ఎంతో దూరంలో లేవని" తన డైరీలో రాసుకున్నాడు.
Where is the safety for women..?
ఏ దేశంలో స్త్రీలు పూజింప బడతారో ఆ నేల సుఖ శాంతులతో పరిడవిల్లుతుందని పాత కాలపు నానుడి.ధరిత్రిని భూదేవతగా ఆరాధించే భరత భూమిలో ఆడపిల్లలు అరాచకాలకు బలిఅవుతున్నరనేది అందరికి తెలిసిన సత్యం.ఆలనా పాలన చూసే తల్లిగా, అనుబంధాన్ని పెనవేసుకున్న చెల్లిగా,అనురాగాలను పంచే అక్కగా,అందరిని విడిచి అల్లుకున్న అర్ధాంగిగా ,ఆడది అనేక రూపాల్లో తన భాద్యతను నిర్వర్తిస్తుంది.అన్ని రంగాల్లో మగవారితో సమానంగా రాణిస్తున్నా మరోవైపు నెత్తుటి చారలు ఆడవారి బతుకులో భయాన్ని రేపుతున్నాయి.విద్యార్థి దశలోనే కాదు ముక్కు పచ్చలారని చిన్నారులపై కూడా మృగరాయుల్లు అత్యాచారాలకు పాల్పడుతున్నారు.ఇంట్లో బంధువులతో,తరగతి గదిలో ఉపాద్యాయులతో,బస్సులో తోటి ప్రయాణికులతో,ఆఫీసులో అధికారులతో,గుడిలో, బడిలో మానసికంగా శారీరకంగా ... ఏదో రకంగా లైంగిక దాడులకు గురవుతున్నారు.ఎవరికీ చెప్పుకోవాలో తెలియని దశ బాల్యమైతే,ఎవరికైనా చెబితే పరువు పోతుందని...ఇంకేదో చేస్తారని..చంపేస్తారేమోనని కుమిలిపోయే దశ యవ్వనం.ఒక సర్వే ప్రకారం 97% అమ్మాయిలు తెలిసిన వారిచేతనే అత్యాచారాలకు గురవుతున్నారని నివేదికలు చెబుతున్న సాక్షం.అందులో బంధువులు,స్నేహితులే ప్రధాన పాత్ర పోషిస్తున్నారనేది మింగుడు పడని విషయం.వరుసకు బావనవుతానని ఒకరు,మామయ్యనవుతానని మరొకరు,దూరపు బంధువునైతానని ఇంకొకరు కామం తలకెక్కి అత్యంత కీచకులుగా ప్రవర్తిస్తున్నారు.కన్నవారి శవాల పక్కనే పిల్లలకు కడుపు చేసి,కనికరం లేకుండా బజారులో వదిలేసే ఈ తరం మగాళ్ళను bastard అని పిలవాలో, బరితెగించిన పశువులనాలో అర్థం కావడం లేదు.సెల్ ఫోన్లో ఫోటోలను మార్ఫింగ్ చేసి అందరికి చూపెడతామని బయపెడుతూ,పడక గదిలో బ్లూ ఫిలిం తీసి .. ఎవరికైనా చెబితే అశ్లీల వెబ్ సైట్లో అప్లోడ్ చేస్తామని బెదిరిస్తూ .. బ్లాక్ మెయిల్ చేస్తూ..లోపరుచుకుంటూ.. పశువులకంటే హీనంగా రోజులతరబడి శరీరాలను కుళ్ళపొడుస్తున్నారు.
ఆనాటి మనుషులు అజ్ఞానంతో చెట్టు ఆకులతో నగ్నత్వాన్ని కప్పుకున్నారు.. ఆధునిక మనుషులు జ్ఞానమనే చెట్టుని నరికి నగ్నత్వం వైపు ప్రయాణిస్తున్నారు. చూడటానికి ఎంతో అవమాన కరంగా , అనుకరించడానికి అయోగ్యంగా ఉన్నా ..సిగ్గు పడాల్సిన మనుషులు గర్విస్తూ ఉంటే ,ఈ తరం మనుషుల గూర్చి మీ అభిప్రాయమేమిటని రవిజకరియ గారిని ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు .. ఈ తరం మనుషులు సిగ్గు పడాల్సిన వాటి విషయంలో గర్విస్తున్నారు .. గర్వించాల్సిన వాటి విషయంలో సిగ్గు పడుతున్నారు అని ముక్కు సూటిగా జవాబు చెప్పాడట. అందుకే ఎవరు అనాగారికులో , ఎవరు ఆధునికులో అర్థంకాక తలలు పట్టుకుంటున్నారు మేధావులు. శరీర వంపు సొంపులను ఉచితంగానే చూయిస్తూ బజారులోనే సినిమాను తలపిస్తున్నారు. సినిమాల మూలంగా ఈవిధంగా తయరయ్యారో, వీరిని చూసే సినిమాలు తీస్తున్నారో నాకిప్పటికి అర్థం కావట్లేదు. సినిమాల మూలంగానే సమాజం చెడి పోయిందని అనేక పరిశోధన పత్రాలు నిరూపించినా .. తీసేవారు ఆలోచించట్లేదు, చూసేవారు ఆగట్లేదు .. ప్రభుత్వ నియమాలు కటినంగా లేకపోవడం వల్ల దిగజారిన సంస్కృతి దిన దినం పెరుగుతూనే ఉంది. ఏది ఏమైనా .. ఇద్దరి పాత్ర సమానంగానే ఉందనేది అందరు అంగికరించాల్సిన సత్యం.
నియాన్ లైట్ల వెలుతురు .. నక్షత్రాలను తలపించే బల్బులు, వెరైటి కలర్స్ తో నిండిన హాల్లు .. వింత డిజైన్లతో బార్లు, మైమరిపించే సంగీతం .. మారు మోగే కేకలు, మురిపించే జంటలు .. ఉద్రేకాన్ని పుట్టించే స్టెప్పులు, స్వేచ్చా వాయువుల కోసం .. సుకమయ జీవనం కోసం, అందరు నిద్ర పోయాక .. ఆర్ద్ర రాత్రి దాటాక, అరువు తెచ్చుకున్న భామలతో .. అర్ధ నగ్న దృశ్యాలతో, మనిషిలో మొదలైన తపన .. మేధస్సుకే హద్దులు చెరిపేసిన ఘటన, మత్తులో మునిగి పోయి .. మైకంతో కళ్ళు ముసుకు పోయి, మదమెక్కిన పశువుల వలె .. గుంపులు గుంపులుగా కుప్పి గంతులు వేస్తుంటే .. ఆధునికులా లేక ఆటవికులా అనే ప్రశ్న నేటితరం మేధావులకు రాకమానదు. వీకెండ్ దగ్గర పడుతుంటే .. తేదీలు మారుతూ వుంటే .. గడియారం గిర్రున తిరుగుతూ వుంటే .. క్షణాలు కదులుతూ వుంటే .. గప్‌చుప్ గా గేటు దాటేస్తారు. పబ్ లో వాలి పోయి ... వన్ .. టూ .. త్రీ .. అంటూ రాళ్ళు పగిలే రాక్ హోరు .. దమ్ము దుమ్ము లేపుతుంది .. గిటారు గగ్గోలు పుట్టిస్తూ .. ఒకాల్ సముద్రమై ఎగిసిపడుతుంది .. అంతలోనే తెల్లారుతుంది .. కాలేజికి బంక్ .. ఆఫీస్ కి డుమ్మా .. నో బాయ్ .. నో చాయ్ .. ఓన్లీ రాక ఫాస్ట్ .. వీళ్ళింతే .. వీళ్ళ లైఫ్ ఇంతే .. వీళ్ళ ప్రపంచం ఇంతే .. iam ready gonna, change the world, gonna turn the phase, gonna say what you feel, i was not born to follow వీళ్ళకు మూస ఇష్టం లేదు, మూసగా ఆలోచించరు, మూసగా బతుకరు, నచ్చితే అనుకరిస్తారు లేదంటే చచ్చినా ఎవర్ని అనుసరించరు .. ఇవి నేటి తరం యొక్క వింతైన సంగతులు.
మనుషులు తప్పుగా వాడుతున్న ఏకైక పధం ఏంటని ప్రశ్నిస్తే .. స్వేచ్చ అని జవాబిస్తాను నేను. ఏనాడు లేనంత విస్తృత ప్రచారం ఈ పదానికి ఎందుకు కల్పించారో నేటి తరపు మహానుభావులు చెప్పాల్సి ఉంది. వివరణలు మారాయి. విపరీత అర్థాలు మన గ్రందాల్లోకి వచ్చి చేరాయి. నిక్కచ్చిగా చెప్పే నిర్వచనాలు ఎప్పుడో కనుమరుగై పోయాయి. హద్దులు లేని హక్కులనే వికృత వివరణకు దారి తీసాయి. మాటల్లో, మూటల్లో, చేతల్లో, చూపుల్లో ఈ భావమే ప్రస్పుటంగా కన్పిస్తుంది. నిజానికి స్వేచ్చకు హద్దులు లేవా? అని అడిగే ముందు మనిషి పరిమితుడా అపరిమితుడా? అనే ప్రశ్నకు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. సత్యమేమిటంటే మనిషి పరిమితుడని, పరిమితమైనవాడికి అపరిమితమైన స్వేచ్చా స్వాతంత్రాలు ఉండే అవకాశం లేదని శాస్త్రం ఖండిస్తుంది.
నేటి తరంలోని సమస్యలన్నిటికీ ప్రధాన కారణం స్వేచ్చా అనే పదాన్ని తప్పుగా అర్థం చేసుకోవటమేనని నా బలమైన వాదన. ఆశకు అత్యాశకు మధ్య ఉన్న బేధాన్ని గమనించక పోవటమేనని తెలివిపరుల ఆవేదన. యుగం మారింది .. నిర్వచనం లేకుండా పోయింది .. ఎవరి ఇష్టం వారిదే అనే పంథా నేటి కాలంలో చలామణి అవుతుంది. ఏమైనా మాట్లాడవచ్చు .. ఏదైనా చేయవచ్చు .. అందినంత దోచుకోవచ్చు .. అడ్డమస్తే చంపేయచ్చు .. చుట్టూ మనుషులు తరచూ చెప్పే డైలాగులు ఇవి. కుటుంబ విలువలు , సామాజిక కట్టుబాట్లు , మనకు కాదనే పొగరుతో కూడిన కామెంట్లు. ఇవన్ని అంతులేని స్వేచ్చకు , సుఖవలయం పేరుతో ఆడుతున్న ఆటకు ప్రత్యక్ష సాక్షాలే. ప్రతి పదానికి రెండు వైపులా పదును ఉంటుంది. ఓ వైపు పరిరక్షణ కోరుకుంటే ,మరో వైపు ప్రమాదాన్ని సూచిస్తుంది. దేవుడు మానవాళికి నియమించిన నైతిక నియమాలను మరిచిపోయి ఇస్టాను సారంగా బ్రతుకుతున్న ఈతరం గురించి ప్రముఖ చరిత్రాకారుడు తన జీవిత చివరి దశలో .. "నైతిక విలువలను కాల రాసిన ఏ తరం చరిత్రలో నిలువలేదు .. అభివృద్ధి చెందామని చెబుతున్న ఈ తరం అంతమయ్యే రోజులు ఎంతో దూరంలో లేవని" తన డైరీలో రాసుకున్నాడు.
ఫంకీ టీషర్ట్ కుర్రాడు
స్లీవ్ లెస్ ధరించిన చిన్నది.
పిల్లి గడ్డం బాబాయి
చింపిరి జుట్టు అమ్మాయి.
సిగ్గును విడిచి
విలువలను మరిచి
బజారులో రొమాన్స్ చేస్తుంటే..?
ఎలా మౌనంగా ఉండ మంటావ్...?
మనుషులమని తెలిసి
మేధస్సు గలవారమని మరిచి
స్వేచ్చకు హద్దులే లేవని చెబుతుండగా
పరమాత్ముడే ...!
పరిమితులు నియమించగా
పవిత్రంగా బతకాలని కోరుతున్నా ...!
ఏ దేశంలో స్త్రీలు పూజింప బడతారో ఆ నేల సుఖ శాంతులతో పరిడవిల్లుతుందని పాత కాలపు నానుడి.ధరిత్రిని భూదేవతగా ఆరాధించే భరత భూమిలో ఆడపిల్లలు అరాచకాలకు బలిఅవుతున్నరనేది అందరికి తెలిసిన సత్యం.ఆలనా పాలన చూసే తల్లిగా, అనుబంధాన్ని పెనవేసుకున్న చెల్లిగా,అనురాగాలను పంచే అక్కగా,అందరిని విడిచి అల్లుకున్న అర్ధాంగిగా ,ఆడది అనేక రూపాల్లో తన భాద్యతను నిర్వర్తిస్తుంది.అన్ని రంగాల్లో మగవారితో సమానంగా రాణిస్తున్నా మరోవైపు నెత్తుటి చారలు ఆడవారి బతుకులో భయాన్ని రేపుతున్నాయి.విద్యార్థి దశలోనే కాదు ముక్కు పచ్చలారని చిన్నారులపై కూడా మృగరాయుల్లు అత్యాచారాలకు పాల్పడుతున్నారు.ఇంట్లో బంధువులతో,తరగతి గదిలో ఉపాద్యాయులతో,బస్సులో తోటి ప్రయాణికులతో,ఆఫీసులో అధికారులతో,గుడిలో, బడిలో మానసికంగా శారీరకంగా ... ఏదో రకంగా లైంగిక దాడులకు గురవుతున్నారు.ఎవరికీ చెప్పుకోవాలో తెలియని దశ బాల్యమైతే,ఎవరికైనా చెబితే పరువు పోతుందని...ఇంకేదో చేస్తారని..చంపేస్తారేమోనని కుమిలిపోయే దశ యవ్వనం.ఒక సర్వే ప్రకారం 97% అమ్మాయిలు తెలిసిన వారిచేతనే అత్యాచారాలకు గురవుతున్నారని నివేదికలు చెబుతున్న సాక్షం.అందులో బంధువులు,స్నేహితులే ప్రధాన పాత్ర పోషిస్తున్నారనేది మింగుడు పడని విషయం.వరుసకు బావనవుతానని ఒకరు,మామయ్యనవుతానని మరొకరు,దూరపు బంధువునైతానని ఇంకొకరు కామం తలకెక్కి అత్యంత కీచకులుగా ప్రవర్తిస్తున్నారు.కన్నవారి శవాల పక్కనే పిల్లలకు కడుపు చేసి,కనికరం లేకుండా బజారులో వదిలేసే ఈ తరం మగాళ్ళను bastard అని పిలవాలో, బరితెగించిన పశువులనాలో అర్థం కావడం లేదు.సెల్ ఫోన్లో ఫోటోలను మార్ఫింగ్ చేసి అందరికి చూపెడతామని బయపెడుతూ,పడక గదిలో బ్లూ ఫిలిం తీసి .. ఎవరికైనా చెబితే అశ్లీల వెబ్ సైట్లో అప్లోడ్ చేస్తామని బెదిరిస్తూ .. బ్లాక్ మెయిల్ చేస్తూ..లోపరుచుకుంటూ.. పశువులకంటే హీనంగా రోజులతరబడి శరీరాలను కుళ్ళపొడుస్తున్నారు.
ఐక్యరాజ్య సమితి సర్వే ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా 70% మహిళలు మానసికంగా,శారీరకంగా లైంగిక హింసలకు బలవుతున్నారు.మూడింట రెండు వంతుల స్త్రీలు భర్తల నుండి లైంగిక వేధింపులకు లోనవుతున్నారు.పుట్టినింట్లో అమ్మాయిగా క్షోభను అనుభవిస్తూ మెట్టినింట్లో భర్త చేతిలో బందీయై .. వంటగదికి, పడకగదికే పరిమితమైన ఆడవారిని చూస్తె జాలేస్తుంది.అందరు ఆడుకునే అందమైన ఆటబొమ్మగా మారిపోయింది నేటి తరం ఆధునిక స్త్రీ. కట్టుబాట్ల పేరుతో అమ్మాయిలతో క్రూరంగా ప్రవర్తించే మనువాదులను తప్పు పట్టాలో, ఆడవారి అంగాలను అంగడి సరుకుగా మార్చి రేటింగ్ కోసమని ప్రకటనల్లో చూయించే మీడియాను నిందించాలో అర్థం కావటం లేదు.రుజువులను తారుమారు చేస్తూ నిందితులను రక్షించే న్యాయవాదులు,చట్టంలోని లోపాల సహాయంతో కీచకులను నిరపదారులుగా తీర్పునిస్తున్న న్యాయముర్తులనాలో పాలు పోవటం లేదు.తమకు దక్కనిది ఎవరికీ దక్క కూడదనే అక్కసుతో ఆసిడ్ దాడులకు దిగేవారు కొందరైతే,అడ్డంగా నరికి రక్తపాతాన్ని సృష్టించేవారు మదమెక్కిన హంతకులు.ఎవరిని నమ్మాలో...ఎవరిని నమ్మకూడదో తెలియని ప్రమాదకరమైన పరిస్తితి ఈ తరం స్త్రీలకు సవాలుగా మారింది.ఎపుడు..ఎక్కడ..ఏం జరుగుతుందోనన్న భయంతో జీవితాన్ని గడపాల్సి వస్తుంది.ఈ పరిస్తితినంతటిని గమనించినపుడు అర్ద్ర రాత్రి ఆడది స్వేచ్చగా నిర్బయంగా తిరిగిన రోజు భారత దేశానికి స్వాతంత్రం వచ్చినట్టని అప్పట్లో గాంధి గారు చెప్పిన మాట గుర్తొచ్చింది. అర్ధ రాత్రి ఏమోగాని పట్టపగలే ఆడవాళ్ళు స్వేచ్చగా తిరిగే పరిస్తితి మన దేశంలో లేదని అందరికి అర్థమైపోయింది.ఈ రోగం యొక్క మూలాలను కనుక్కోవడానికి ప్రతి ఒక్కరు చిత్తశుద్దితో వ్యవహరించాల్సిన సమయం ఆసన్నమైంది.కోర్టు హెచ్చరించినా కటినంగా తీర్పు చెప్పినా అత్యాచారాలు హత్యలు అదుపులోకి రాకపోవటానికి ప్రధాన కారణం పార్టీలు,ప్రభుత్వాలు అభయ,నిర్భయ అంటూ మోసపూరిత చట్టాలతో సరిపెట్టడమే అని అనేకుల భావన.
(1) ఎప్పుడు చలాకీగా ఉండే అన్విత(పేరు మార్చాం) ప్రవర్తనలో ఒక్కసారిగా మార్పు వచ్చింది. ఎవరితోనూ కలవడం లేదు. సరిగా నిద్ర పోవడం లేదు. అర్ధ రాత్రి ఉలిక్కిపడి లేచి ఏడుస్తుంది. ఏమి జరిగిందో చెప్పమని అమ్మా నాన్నలు ఎంతగా అడిగినా .. చెప్పడం లేదు. బడికెల్లనని మొండికేస్తుంది. ఆందోళన చెందిన తల్లిదండ్రులు మానసిక వైద్య నిపుణుడి వద్దకు తీసుకెళ్ళారు. ఆయన ఆరా తీయగా .. బడికి తీసుకెళ్ళే వ్యాను డ్రైవరు ఆ బాలికపై రోజు లైంగిక వేదింపులకు పాల్పడుతున్నాడనే విషయం బయటపడింది.(ఈనాడు దిన పత్రిక అక్టోబర్ 27,2015)
(2) అజితకు (పేరుమార్చాం) పన్నెండేళ్ళు ! ఏడవతరగతిలో ఉంది. రంగారెడ్డి జిల్లాలోని ఓ మండల కేంద్రం ఆమె స్వస్థలం. తల్లి చిన్నప్పుడే చనిపోయింది. అజిత పిన్నమ్మను మారు మనువాడాడు తండ్రి. పిన్నమ్మ అయితే పిల్లకు తల్లి లేని లోటు తీరుస్తుందని ! కానీ అలా జరుగలేదు. అప్పుల పాలై ఉన్న రెండెకరాల భూమిని అమ్ముకున్నాడు తండ్రి. వ్యవసాయ కూలిగా మిగిలాడు. కాలం లేక కూలి పని సాగలేదు. రుణ భారం మోయలేనంత అయింది. అప్పుడే దగ్గరి బంధువు నుంచి ఆ తండ్రికి ఓ కబురు అందింది. ఆయన కూతుర్ని తనకు ఇచ్చి పెళ్లి చేస్తే ఆ అప్పంతా తీరుస్తానని. 32 ఏల్లా వాడికి 12 ఏళ్ల నా కూతురు కావాల్సి వచ్చిందా అని ఆవేశపడ్డాడు. పదిహేనేళ్ళ తేడా ఉండి, ఓ బిడ్డ తండ్రిని నేను చేసుకోలేదా ? అతనిధైతే ఇంకా మొదటి పెళ్ళే కదా ? అని ఎకసెక్కమ్ ఎగతాళి చేసింది అజిత పిన్నమ్మ. అప్పులతో అందరం ఆత్మ హత్య చేసుకునేకంటే బిడ్డను వాడి చేతిలో పెట్టి అప్పు తీర్చడం నయం కదా ! ఇప్పుడా పిల్ల చదివి ఊళ్ళు ఏలుతుందా? రాజ్యాలు ఏలేదుందా? ఎంత చదివించిన కట్నమిచ్చే కదా పెళ్లి చేయాలి. ఆ కట్నమేదో ఎదురొస్తుంటే నాలుగు అక్షింతలు వేయడానికి ఏముంది ? అంటూ భర్త మనుసును మార్చే ప్రయత్నం చేసింది. సఫలం కూడా అయ్యింది. పెళ్లి ముహూర్తాలు పెట్టుకున్నారు. విషయం తెలిసినప్పటి నుంచి అజిత ఇంట్లో యుద్ధం చేస్తూనే ఉంది. నాకు పెళ్లి వద్దు .. చదువుకుంటానని కానీ ఎవరూ వినలేదు. కన్నందుకు ఈ పెళ్లి చేసుకొని ఋణం తీర్చాల్సిందే అన్నట్టుగా ప్రవర్తించారు. పిల్ల గడప దాటకుండా కట్టడి చేసారు. పెళ్లి ముందు రోజు రాత్రి ఆ బంధనాలను తెంపుకుని ఇంట్లోంచి పారిపోయింది అజిత. ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. తన వాళ్లకు కనిపించకుండా అయితే వెళ్ళాలి. ఈ పెళ్లి తప్పించుకోవాలి. ఈ ఆలోచనలతోనే సాగుతుంది. ఆ ఊరి పొలిమేర దాటే లోపే పోలీసులు పట్టుకున్నారు. విషయం తెలుసుకున్నారు. బాల్య వివాహం నేరమని తల్లి తండ్రులను హెచ్చరించి ఆ ప్రయత్నాన్ని ఆపించారు. అయినా అజిత తల్లి తండ్రులతో ఉండనంది.(సాక్షి దిన పత్రిక అక్టోబర్ 30,2015)
(3) అన్వితది (పేరు మార్చాం) మెదక్ జిల్లాలోని ఓ పల్లెటూరు. వయసు పదిహేను. తొమ్మిదవ తరగతిలో ఉంది. చదువులో ఫస్ట్. ఆట పాటల్లో బెస్ట్. డాక్టర్ కావాలని కోరిక అంతే పట్టుదల. తండ్రి పచ్చి తాగుబోతు. తల్లి వ్యవసాయ కూలి. అన్న దుబాయ్ లో ఉంటాడు. పొలం పనుల నుండి తల్లి ఇంటికి వచ్చే సరికి పొద్దు పోయేది. ఒక రోజు .. విపరీతమైన జ్వరంతో మధ్యహానమే బడి నుంచి ఇంటికి వచ్చేసి ఒళ్ళు తెలియకుండా పడుకుండి పోయింది అన్విత. ఎపుడచ్చాడో తండ్రి .. విపరీతంగా తాగి .. కూతుర్నే ఇంగితం కూడా మర్చిపోయి అత్యాచారం చేశాడు. ఆ బిడ్డ శరీరమే కాదు మెదడు గాయపడింది. ఆ గాయం నుంచి శరీరం త్వరగా కోలుకున్నా, మనుసు ఇంకా కోలుకోలేదు. నాడి పట్టుకొని పేషంట్ల ఆరోగ్యం చూడాలని కలలు కన్న ఆ బంగారు తల్లి, ఎండు పుల్లలు పట్టుకొని గాల్లో గీతలు గీస్తుంది .. పిచ్చి చూపులు చూస్తుంది. ?(సాక్షి దిన పత్రిక అక్టోబర్ 30,2015)
(4) 1975 .. లక్నో .. చలికాలపు ఓ మధ్యాన్నం .. పదిహేనేళ్ళ అమ్మాయి .. యజ్డి మోటర్ సైకిల్ మీద .. కాజువల్ గా పెట్రోల్ కోసం పెట్రోల్ బంక్ దగ్గర ఆగింది. పెట్రోల్ కొట్టించి బైక్ ను టర్న్ చేస్తుంటే .. ఓ పన్నెండేళ్ళ అమ్మాయి .. పరిగెత్తుకుంటూ తన వైపే వస్తోంది .. భయంలో ఉంది .. వేసుకున్న గౌన్ కింది భాగమంతా రక్తసిక్తమై ఉంది. బైక్ మీద ఉన్న అమ్మాయి ఏదో కీడు శంకించింది. వెంటనే ఆ అమ్మాయికి ఎదురెళ్ళి .. బైక్ ఎక్కు అన్నట్టుగా కళ్ళతోనే సైగ చేసింది. ఆ అమ్మాయి మెరుపు వేగంతో బైక్ ఎక్కింది. వెనుక నుంచి గట్టిగా వాటేసుకొని కూచుంది. వణుకుతున్న ఆ పిల్ల చేతులు ప్రమాద తీవ్రతను చెపుతున్నట్టు అనిపించింది బండి నడుపుతున్న అమ్మాయికి. క్షణం ఆలస్యం చేయకుండా యాక్షిలేటర్ రైజ్ చేసింది. ఆ వెనుకాలే వచ్చిన ఓ మగ గుంపు .. అరే .. భాగ్ గయీ .. పకడో పకడో .. అంటూ అరుస్తూ ఆ ఇద్దరిని వెంబడించింది. తమ వెనుకాలే వస్తున్న ఆ గుంపును చూసి వెనుక ఉన్న అమ్మాయి బెదిరిపోయింది. బైక్ నడుపుతున్న అమ్మాయి నడుం చుట్టూ చేతులను మరింత బిగిస్తూ .. దీదీ .. హమ్కా బచాలో(నన్ను కాపాడు) .. అంది.
ఎక్కడా బ్రేక్ వేయకుండా తిన్నగా తన ఇంటి ముందు ఆపింది ఆ అమ్మాయి. స్టాండ్ వేసి అంతే హడావుడిగా పన్నెండేళ్ళ పిల్లను తీసుకొని ఇంట్లోకి పరుగెత్తి తలుపేసింది. ఆ అమ్మాయి హడావిడి, కంగారు చూసి వాళ్ళ నాన్న ప్రశ్నల వర్షం కురిపించాడు. సమాధానం చెప్పబోతుండగానే .. బయట గేట్ దబ దబ బాదుతున్న చప్పుడైంది. వాకిట్లో రాల్లుపడుతున్న శబ్దం వినిపించడంతో .. తండ్రి కిటికీ తెరిచి చూసాడు. బయటి గుంపులోని ఒక వ్యక్తి .. 'ఏ ప్రిన్సిపాలు .. నీ కూతురు ఓ అమ్మాయిని తీసుకొచ్చింది, మర్యాదగా ఆ పిల్లను వాళ్ళ తండ్రికి అప్పగించు' అంటూ గుంపులోనే ఉన్న ఓ నలభై ఏళ్ల వ్యక్తిని చూపించాడు. కిటికీ కర్టెన్ వేసి ఈ ఇద్దరి వైపు చూసాడు అతను. 'నన్ను పంపించద్దు .. అంటూ రెండు చేతులు జోడించి ఏడుస్తుంది ఆ పిల్ల. ఎందుకు వెల్లవని అడిగాడు. 'మా నాన్న నా మీద పడి ..' ఇంకా చెప్పలేక రెండు చేతుల్లో ముఖం దాచుకుని వెక్కి వెక్కి ఏడ్వసాగింది. ఆ మాట విన్న ఆ పెద్దమనిషి నిచ్చేస్తుడయ్యాడు. అతని భార్య ఆ పిల్లను అక్కున చేర్చుకుంది. 'వద్దు నాన్న .. ఈ అమ్మాయిని వాళ్ళ నాన్నకు అప్పగించద్దు ' అంటూ ఆయన చేతులు పట్టుకొని బతిమాలుతుంది పదిహేనేళ్ళ కూతురు.
ఇంతలోనే ఏదో వాహనం వచ్చి ఆగిన శబ్దం వినిపించింది. తేరుకున్న పెద్దాయన కిటికీలోంచి చూద్దామనుకునే లోపే తలుపు కొట్టిన చప్పుడు. వెళ్లి తలుపు తీశాడు. ఎదురుగా పోలీస్ ఇన్స్పెక్టర్. 'ప్రిన్సిపాల్ సాబ్ . ఇతని కూతురు మీ ఇంటికి వచ్చింది. మర్యాదగా ఆ పిల్లను ఇతనితో పంపించండి. పరువుగల కుటుంభం మీది. ఇందులో జోక్యం చేసుకొని అనవసరంగా రోడ్డు ఎక్కకండి' అన్నాడు ఇన్స్పెక్టర్ హెచ్చరిస్తున్నట్టుగా. ఈ అమ్మాయిని వాడు రేప్ చేశా ..' అని ఆ పెద్దాయన అంటుండగానే బయటున్న గుంపంతా ఇంట్లోకి జొరబడి పన్నెండేళ్ళ పిల్లను బలవంతంగా తీసుకెళ్ళింది.
'ఆ విషయం పోలీసులు చూసుకుంటారు. మీకు సంబంధం లేదు అంటూ' పోలీసు ఇన్స్పెక్టరు వెళ్ళిపోయాడు. ఆ హెచ్చరికను కాదని ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకుంటే ఏం జరుగుతుందో తెలిసిన ఆ పెద్దాయన మిన్నకుండి పోయాడు. అతని పేరు డాక్టర్ శక్తి దర్సింగ్.లక్నొలొని ఓ డిగ్రీ కాలేజి ప్రిన్సిపాల్. ఆయన పదిహేనేళ్ళ కూతురు పేరు రేను సింగ్ .(సాక్షి దిన పత్రిక .. నవంబర్ 20,2015)
(5) కోల్ కతా పార్క్ స్ట్రీట్ గ్యాంగ్ రేప్ .. మూడేళ్ళ కిందట సంచలనం రేపింది. సుజెట్ జోర్డాన్ అనే 38 ఏళ్ళ మహిళను .. టాక్సీ కారులో పార్క్ స్ట్రీట్ అంతా తిప్పుతూ .. అయిదుగురు రేప్ చేసారు. మూడేళ్ళ న్యాయ పోరాటం తర్వాత ఈ నెల పదో తారికున కోల్ కతా సెషన్స్ కోర్టు అయిదుగురిలో ముగ్గురికి పదేళ్ళ జైలు శిక్షతో పాటు, లక్ష రూపాయల జరిమానా విదించింది. ఇంకో ఇద్దరు నేటికి పరారిలో ఉన్నారు.
కోల్ కతా లోని ఒక ఆంగ్లో ఇండియన్. ఇద్దరు టీనేజ్ ఆడపిల్ల్లల తల్లి. ఆ పిల్లలను పెంచడానికి అష్ట కష్టాలూ పడ్డ సింగిల్ పేరెంట్. కొన్నాళ్ళు సేల్స్ వుమన్ గా .. ఇంకొన్నాళ్ళు హోటల్ తాజ్ బెంగాల్ లోని హెల్త్ క్లబ్ లో రిసెప్షనిస్టుగా, మరికొన్నాళ్ళు కాల్ సెంటర్ ఎక్ష్ క్యుటివ్ గా .. ఏ పని దొరికితే ఆ పని చేసింది. ఆ ఉద్యోగాలతో సుజెట్ విసిగి వేసారి ఉన్నప్పుడే .. అంటే 2011 లో ఆమె చెల్లెలు కొంత మంది స్నేహితుల సాయంతో ఓ కాల్ సెంటర్ పెట్టింది. నిర్వహణా భాద్యతను అక్క సుజెట్ కు ఇచ్చింది. అయితే ఏడాది తిరక్కుండానే చెల్లెలిని స్నేహితులు మోసం చేసారు. డబ్బు నష్టపోయి కాల్ సెంటర్ ను మూయక తప్పలేదు. సుజెట్ పరిస్థితి మళ్ళి మొదటికి వచ్చింది. ఉద్యోగాల వేటలో పడింది. ఆ సమయంలో కోల్ కథా లోని పార్క్ స్ట్రీట్ లో ఉన్న హోటల్ నైట్ క్లబ్ తంత్రాలో తన స్నేహితులను కలుస్తుండేది. అలా 2012 ఫిభ్రవరి 5 తేదిన కలిసింది. ఆ రాత్రి తిరిగి ఇంటికి వెల్తుంటేనే .. ఆమె మీద లైంగిక దాడి జరిగింది.
ఆ దారుణం గురించి సుజెట్ పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది. ఈ గుట్టు మీడియాలో గుప్పుమని దేశమంతట రట్టయింది. విచారణ ఇంకా మొదలవక ముందే .. బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ .. దీన్నో కల్పిత ఘటనగా ప్రకటించింది. అంతే ఆమె స్టేట్ మెంట్ మీడియా పుట్టించిన అగ్నికి ఆజ్యం పోసినట్టయింది. వెంటనే ఈ కేసును పార్క్ స్ట్రీట్ రేప్ కేస్ గా, సుజెట్ జోర్డాన్ ను పార్క్ స్ట్రీట్ రేప్ విక్టిం గా అభివర్ణించడం మొదలు పెట్టింది మీడియా. వార్తా పత్రికల్లో, వార్త చానళ్ళలో సుజేట్ ఫొటోను బ్లర్ చేస్తూ న్యూస్ రాశారు .. ప్రసారం చేశారు. వాటిని చూసిన ప్రతిసారి ఆమెలో అసహనం పెరిగేది. తనను మీడియా పార్క్ స్ట్రీట్ రేప్ విక్టిం గా పిలుస్తుంటే మనుసును ముల్లుతో గుచ్చినట్టు విల విల లాడేది. తప్పు చేసింది ఆ అయిదుగురు అయితే నేనెందుకు పేరు మార్చుకుని, నా నా ముఖం కనిపించకుండా తిరగాలి అని మదనపడింది.
అదే ఏడు నిర్భయ ఘటన జరిగింది. నిర్భయ తల్లితండ్రులకు సంఘీ భావం తెలుపుతూ వాళ్లకు అండగా నిలబడింది సుజెట్. అప్పుడే తనను పార్క్ స్ట్రీట్ రేప్ విక్టిం గా కాకుండా తన సొంత పేరుతో ఉచ్చరించమని మీడియాకు చెప్పాలనుకుంది. కానీ ఆమే బిడ్డల దృష్ట్యా తొందర పడద్దని స్నేహితులు వారించారు. నిర్భయ ఉదంతం తర్వాత అంతా చర్చ జరిగినా దేశంలోని స్త్రీల పరిస్థితుల్లో మార్పు లేదు. రేప్ లు ఆగలేదు. 2012 జూన్ లో బెంగాల్ లోని 24 పరగణాల జిల్లాలో కముదిని అనే 24 ఏళ్ల అమ్మాయిని గ్యాంగ్ రేప్ చేసి చంపేశారు. దానికి వ్యతిరేకంగా .. కోల్ కతాలో పెద్ద ర్యాలి జరిగింది. అందులో సుజెట్ కూడా పాల్గొంది. అప్పటికే స్త్రీల మీద జరుగుతున్న హింసకు, లైంగిక దాడులకు వ్యతిరేకంగా గొంతు విప్పి చాల చర్చల్లో పాల్గొంటుంది సుజెట్. పార్క్ స్ట్రీట్ రేప్ విక్టిం తానేనని ఎక్కడా బయటపెట్టలేదు. అయితే కముదిని తల్లి తండ్రులకు మద్దతుగా జరిగిన ఈ ర్యాలిలో మాత్రం తన ఉనికిని దాచుకోవాలనుకోలేదు. ఏమైనా సరే ఆత్మ బలంతో ముందుకు నడవాలనుకుంది. అందుకే ఆ ర్యాలిలో పార్క్ స్ట్రీట్ రేప్ విక్టిం ని నేనే .. ఇకనుంచి నన్ను ఆ పేరుతో పిలువద్దు. నా పేరు సుజట్ జోర్డాన్ .. సుజెట్ జోర్డాన్ అనే ఉచ్చరించండి. న ఫోటోను బ్లర్ చేయొద్దు .. స్పష్టంగానే చూపించండి అంటూ ప్రకటించింది. పేరును బయట పెట్టిన తొలి రేప్ విక్టిం గా ఆత్మ విశ్వాసంతో నిలబడింది సుజెట్.
సుజెట్ స్నేహితులు హెచ్చరించినట్టే .. ఆమె తన పేరును బయట పెట్టుకున్న మరుక్షణమే .. సుజేట్ ఉంటున్న కాలనీలో .. ఆమె పిల్లలు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వాళ్ళు వెళ్తుంటే 'పార్క్ స్ట్రీట్ రెప విక్టిం ఎవరో కాదు వీళ్ళ అమ్మే' అంటూ వేలు పెట్టి చూపించేవారు. తుంటరి మగ పిల్లలు రాత్రుళ్ళు సుజెట్ ఉంటున్న ఇంటి ముందుకు వచ్చి ఈలలు వేయడం .. నువ్వు వస్తావా ? నీ పిల్లల్ని పంపిస్తావా ? అంటూ అరిచేవాళ్ళు. ఈ న్యుసెన్స్, నాన్సెన్స్ భరించలేక ఉన్న పళంగా సుజెట్ ను ఇల్లు కాలి చేయించేవారు ఇల్లు గలవాళ్ళు. ఆ తర్వాత ఆమెకు ఇళ్ళు దొరకడమే కష్టమైంది. ఉద్యోగం అయితే సరేసరి. అయినా అధైర్య పడలేదు. ఒక్క అడుగు కూడా వెనక్కి వేయలేదు. ఆ ఎదురీతను ఆపలేదు. ఒకవైపు తన కేసుకి సంబంధించి న్యాయ పోరాటం చేస్తూనే .. మిగతా రేప్ విక్టింలకు అండగా నిలబడింది. అలా సోషల్ మీడియాలోని రేప్ సర్వైవర్స్ గ్రూప్ అన్నిటికీ ఆమె ఓ రోల్ మాడల్ అయ్యింది. ఆ గ్రూప్స్ లో ఈమెను చేర్చుకున్నారు. రేప్ విక్టిమ్స్ కి సామాజిక న్యాయం అందజేయడానికి ఓ హెల్ప్ లైన్ ఆరంభించింది సుజెట్. చైల్డ్ అబ్యూజ్, సెక్సువల్ అబ్యుస్ వంటి వాటి మీద మాట్లాడటానికి కోల్ కతాలోని స్కూళ్ళు, కాలేజిలు, ఆఫీసులు, స్వచ్చంద సంస్థలు ఆమెనే పిలువసాగాయి. ఇన్ని సానుకూలతలను సాదించగల్గినా పోయిన ఉద్యోగాన్ని మాత్రం పొందలేక పోయింది సుజెట్. అయినా కుంగి పోలేదు .. పోరాటం సాగించింది. మూడేళ్ళకు గెలిచింది. ఆ అయిదుగురిలో ముగ్గురికి శిక్ష పడేలా చేసింది. అయితే తన విజయాన్ని చూసుకోవడానికి .. సుజెట్ ఇప్పుడు లేదు. ఎనిమిది నెలల కిందట మెదడు వాపు ఈ లోకం నుండి తీసుకపోయింది. కాని ఆ పోరాట స్ఫూర్తి మాత్రం ఉంది .. ఉంటుంది మహిళలందరికీ మద్దతుగా! (స్వర్గంలో చిరునవ్వు .. సాక్షి దిన పత్రిక డిశెంబర్ 16,2015)
(6) రేప్ .. సెక్సువల్ అబ్యుస్ .. హెరాస్మెంట్ .. అసల్ట్ .. రక రకాల వేధింపులకు .. రక రకాల పేర్లు .. కాని వాటి లక్ష్యం ఒక్కటే ! అమ్మాయిల మనసును , శరీరాన్ని గాయపరచడం .. ఆత్మాబిమానాన్ని దెబ్బతీయడం .. వ్యక్తిగత గుర్తింపు లేకుండా చేయడం .. సమూహం నుంచి వెలివేయడం! అయినా వెరవకుండా గాయాన్ని ధైర్యమనే మలంతో నయం చేసుకొని సమాజంలో కలిసే ప్రయత్నం చేస్తున్నారు. ఆ స్ఫూర్తి చిత్రాలు .. గాధల కొలువే ఈ ఛాయా చిత్ర ప్రదర్శన ! ఈ జీవితాలను ఫ్రేం చేసిన వనిత పేరు స్మితా శర్మ! ఫోటో జర్నలిస్ట్ ! న్యూయార్క్ కోల్ కతా కేంద్రాలుగా పనిచేస్తున్న స్మితకు అలాంటి చేదు జ్ఞాపకాలు ఉన్నాయి. తన పద్దెనిమిదవ ఏట కాలేజ్ లెక్చరర్ చేత లైంగిక వేధింపులకు గురైంది. తప్పు గూవు చేస్తే శిక్ష తనకు విదించారు తోటి విద్యార్థులు. ఇతర గురువులు ఆమెను కాలేజ్ నుంచి బహిష్కరించి .. నన్ను ఇబ్బంది పెట్టినవాడిని వదిలేసి .. నన్ను చదువుకోనీయకుండా చేస్తారెంటి అని గొంతు చించుకుంది .. ఇది అన్యాయం అంటూ మొరపెట్టుకుంది .. చదువుకు దూరం చేయొద్దని ప్రాదేయపడింది. ఎవరూ వినిపించుకోలేదు. కాళ్ళ వెళ్ళా పడితే లాభం లేదు .. పోరాడి సాదించుకుంది. మళ్ళీ కాలేజ్ లో చేరింది.
కమలిక తన చిన్న నాన్న కూతురు. చురుకైన అమ్మాయి. స్కూల్ టాపర్. తను ఎనిమిదో క్లాస్ లో ఉన్నపుడు క్లాస్ మెట్ ఒకడు చాలా వేదించాడు ఆమెను. ఆ అబ్బాయి మీద ప్రిన్సిపాల్ కు, స్కూల్ యాజమాన్యానికి ఎన్ని ఫిర్యాదులు చేసినా లాభం లేక పోయింది. పైగా వాళ్ళంతా కూడా ఆ అబ్బాయి తరపునే వకల్తా పుచ్చుకున్నారు. కమలికపైనే నింద వేశారు. ఆ అవమానాలకు కుంగిపోలేదు కమలిక. వాటిని భరిస్తూనే నాలుగేళ్ళు గడిపింది. కమలిక పదకొండో తరగతికి వచ్చింది. ఆమె ధైర్యం అటు టీచర్లకి ఇటు యాజమాన్యానికి మింగుడు పడలేదు. ఏ సాకుతోనైనా సరే ఆ అమ్మాయిని స్కూల్ నుంచి పంపించేయాలనే కక్షతో ఉన్నారు. ఆ క్రమంలో .. ఒకసారి టీచర్ ఇచ్చిన ఒక అసైన్మెంట్ చేయలేక పోయింది ఆ అమ్మాయి. అదే అవకాశంగా తీసుకున్న టీచర్లు ఆమెను అసహ్యంగా తిట్టారు. టీచర్లు చెప్పింది వినకుండా నిర్లక్షంగా ఉంటుందని వారం రోజుల పాటు సస్పెండ్ చేశారు. ట్రబుల్ మేకర్ అనే ముద్ర వేశారు. బోర్డ్ ఎగ్జామ్స్ రాయడానికి యాజమాన్యం ఆమెను అనుమతించలేదు. చివరకు కమలిక వాళ్ళ అమ్మ క్షమాపణ చెబితే కాని శాంతించలేదు పాటశాల సిబ్బంది. అయితే ఇసారి ఈ అవమానాన్ని తట్టుకోలేక పోయింది కమలిక. నిరుడు జనవరి 20 న తమ ఇంటి పక్కనే ఉన్న ఏడంతస్తుల మెడ మీద నుంచి దూకి ఆత్మ హత్య చేసుకుంది. కమలిక మరణం స్మితను కలిచివేసింది. ఆమెను కాపాడు కోలేకపోయాననే చింత ఇప్పటికి వెంటాడుతూనే ఉంది.(పూజా పటాలు, సాక్షి దిన పత్రిక జనవరి 20,2016)
(7) దాదాపు అయిదేళ్ళ నాటి మాట. ఇరాన్‌లోని మారుమూల ప్రాంతంలో ఓ రాత్రివేళ. ఆదమరిచి నిద్రిస్తున్న ముప్పై ఏళ్ళ గృహిణి, ఆమె మూడేళ్ళ కూతురిపై .. ఒక పెద్ద బకెట్ నిండా తెచ్చిన ఆమ్లాన్ని(యాసిడ్) కుమ్మరించాడు ఆ మృగాడు. రెప్పపాటులో దాపురించిన ఆ కిరాతకానికి ఆ తల్లి బిడ్డల హాహాకారాలు మిన్ను ముట్టాయి. వారి ముఖాలు, చేతులు, శరీరంలోని అనేక భాగాలు కాలిపోయాయి. కుటుంభ భాధ్యతల్ని గాలికి వదిలేసి తిరగడమే కాక, నానా రకాల వ్యసనాలలో మునిగి తేలుతున్న భర్తను నిలదీయడమే ఆ ఇల్లాలు చేసిన నేరం. ఉన్మాదిగా మారి అతడు ఆమ్ల దాడికి తెగబడిన దరిమిలా ఆ తల్లి పసిబిడ్డ అనుక్షణం ప్రత్యక్ష నరకాన్నే అనుభవించారు. అభం శుభం తెలియని వారిద్దరికీ ఎన్ని శస్త్ర చికిత్సలు జరిగాయో లెక్కేలేదు. కంటి చూపు కోల్పోయి, యాసిడ్ తీవ్రతకు ఒళ్లంతా కాలిపోయి, చివరికి జీవచ్చవాలుగా మిగిలారు. ఇంత రాక్షసత్వానికి ఎందుకు పాల్పడ్డవన్న న్యాయ స్థానం ప్రశ్నకు ఆ వ్యక్తి ఇచ్చిన సమాధానం ఇంకా పైశాచికం. నన్ను నిలదీసి అడిగిన నేరానికి ఆమెను, పక్కనే ఉన్న పాపను శిక్షించా ? అనడంతో న్యాయమూర్తులే ఒక్కసారిగా నిచ్చేస్టులయ్యారు. ఆమ్ల దాడుల దుండగుల భయంకర మనస్తత్వానికి ఇదో ఉదాహరణ.(ఈనాడు దిన పత్రిక ఎడిటోరియల్ .. హక్కులపై ఆమ్ల దాడి, శరత్)
(8) ఓడిశాలోని బాల్వేశ్వర్ జిల్లాలో జరిగిన ఒక షాకింగ్ ఘటన .. ఒక భర్త జూదంలో తన భార్యనే ఫణంగా పెట్టి ఓడిపోయాడు. పేకాటలో ఓడిపోయిన ఆ వ్యక్తి, తన భార్యను ఓడిపోయినా వ్యక్తికి అప్పగించాడని, ఆ తర్వాత అతడు ఆమెపై భర్త ఎదుటే అత్యాచారం చేశాడని ఆరోపణలున్నాయి. వివరాల్లోకి వెలితే .. తనపై జరిగిన దారుణం గూర్చి బాధితురాలు బి బి సి తో మాట్లాడుతూ .. "గత నెల 23 వ తేదీ రాత్రి నా భర్త దాదాపు 11 గంటలకు ఇంటికి వచ్చాడు. తనతో రావాలంటూ నన్ను తీసుకెళ్లాడు. ఎక్కడికి అని అడిగితే జవాబు చెప్పలేదు. నను బలవంతంగా ఊరి బయటకు తీసుకెళ్లాడు. అక్కడ అప్పటికే అతడి దోస్తులున్నారు. వాళ్ళను నేను భయ్యా అని పిలుస్తాను. వాళ్ళు నన్ను చేయి పట్టుకొని లాగారు. నేను వాళ్ళను అడ్డుకున్నాను. కానీ నా భర్తే న ఒంటిమీద నుండి చీర లాగేసి వాళ్లకు అప్పజెప్పాడు. పేకాటలో గెలిచిన వ్యక్తి నన్ను కొద్దీ దూరం లాక్కెళ్లి నాపై అత్యాచారం చేశాడు. నా భర్త పేకాటలో నన్నే పందెం కాసి ఓడిపోయిన విషయం నాకు తర్వాతే తెలిసిందని" అని చెప్పారు.(బిబిసి న్యూస్ జూన్ 01, 2018)
(9) ఓ యువతిని బెదిరించి పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డ యువకుడిని యస్సార్ నగర్ పోలీసులు అరెస్టు చేశారు. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటనకు సంబంధించి ఎస్సై రాజేందర్ గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం .. ఒంగోలుకు చెందిన గొట్టిముక్కల కృష్ణ(28) అమీర్ పేట మైత్రి వనం సమీపంలోని గాయత్రి నగర్లో గల అమ్మాజీ నిలయంలో ఉండేవాడు. సాఫ్టువేర్ శిక్షణకు వచ్చి అదే ప్రాంతంలోని లేడీస్ హాస్టల్లో ఉంటున్న నెల్లూరు జిల్లాకు చెందిన యువతితో(23) నెల రోజుల క్రితం పరిచయం పెంచుకున్నాడు. జూన్ ఒకటో తేదీన యువతీ తండ్రి అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరడంతో ఆమె స్వస్థలానికి వెళ్ళింది. ఆమె ద్వారా విషయం తెలుసుకున్న కృష్ణ నెల్లూరు వెళ్ళాడు. ఆమె తండ్రిని పరిచయం చేసుకున్నాడు. తిరుగు ప్రయాణంలో ఆర్టీసీ బస్సుకు టిక్కెట్లు తీసుకోవాలని ఆ యువతి చెప్పినప్పటికీ ఆమెకు తెలియకుండా ఓ ప్రవేటు ట్రావెల్స్ స్లీపర్ కోచ్ లో టిక్కెట్ బుక్ చేశాడు. ప్రయాణంలో ఆమెపై అత్యాచారం చేశాడు. తన సెల్ లో ఫోటోలు తీసిన కృష్ణ హైదరాబాద్ వచ్చాక ఆమెను బెదిరించడం మొదలుపెట్టాడు. తన మాట వినకుంటే ఫోటోలను ఇంటర్ నెట్ లో పెడతానని, తండ్రికి చూపెడతానని బెదిరించి పలుమార్లు బయటకు తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆమె నుంచి రెండు సవర్ల బంగారు ఆభరణాలు, 10 వేల రూపాయల నగదు లాక్కున్నాడు. వేధింపులకు తట్టుకోలేక రెండు రోజుల కిందట బాధితురాలు యస్సార్ నగర్ పోలీసులను ఆశ్రయించింది. దీంతో కృష్ణను అరెస్టు చేసి అతని సెల్ ఫోన్ ను స్వాధీనం చేసుకున్నారు.(ఈనాడు దిన పత్రిక జూలై 1, 2017)
(10) ఐ.ఏ.ఎస్. లు ఎవరు సాదారణముగా ప్రజలను ఉద్దేశించి బహిరంగ లేఖలు రాయరు. కాని వీరేందర్ సింగ్ కుందు (రాష్ట్ర ప్రభుత్వ అదనపు కార్యదర్శి హర్యానా) 2017 ఆగస్టు 6 ఆదివారం ఫెస్ బుక్ లో ఒక లేఖను పోస్ట్ చేశారు ! అయితే ఆ లేఖను ఆయన ఒక ఐ.ఏ. ఎస్. అధికారిగా రాయలేదు. ఒక సగటు ఆడపిల్ల తండ్రిగా రాశారు. .. "నిన్న అర్ధరాత్రి నా కూతురు వర్ణికకు ఒక భయానకమైన అనుభవం ఎదురైంది. డ్యూటీ ముగించుకుని ఆమె తన కారులో ఇంటికి వస్తుండగా, ఇద్దరు గూండాలు టాటా సఫారీలో ఆమెను వెంబడించారు. నా కూతురు గుండె నిబ్బరంతో వారినుంచి వేగంగా తప్పించుకుని, కారును వేగంగా డ్రైవ్ చేస్తూనే పోలీసులకు ఫోన్ చేసింది. ఆ తర్వాత కూడా వాళ్లు ఆమె దారిని పదే పదే అడ్డగించారు. కొన్నికిలోమీటర్ల దూరం వరకు అలా చేశారు. ఒక చోటైతే వాళ్లలో ఒకడు టాటా సఫారీలోంచి దూకేసి, నా కూతురి కారులోకి దూరే ప్రయత్నం చేశాడు. ఈలోపు పోలీసులు రావడంతో వారు పారిపోయారు. మా అమ్మాయి దైర్యంగా అయితే తప్పించుకోగల్గింది. కానీ ఆ భయం నుంచి ఇంకా తేరుకోలేదు. అందుకు ఇంకా కొంత సమయం పట్టేలా ఉంది. ఇద్దరు కూతుళ్ళ తండ్రిగా నేను ఈ విషయాన్ని ఇక్కడితో వదిలి పెట్టాలని అనుకోవడం లేదు. ఇదంతా మీకు చెప్పడానికి రెండు కారణాలు వున్నాయి. ఒకటి : ఇది వాస్తవంగా జరిగింది అని చెప్పటం. రెండు: ఒకవేళ అవసరమైతే మద్దతు కూడ గట్టుకోవడం కోసం. ఈ పోరాటాన్ని నేను ఆపదల్చుకోలేదు. దోషులకు శిక్ష పడకపొతే ఇంకా ఎంతో మంది కూతుళ్ళకు ఈ దుస్థితి రావచ్చు. వాళ్ళందరూ నా కూతురంత అదృష్టవంతులు కాకపోవచ్చు. అలాంటి వారి కోసం ఎవరో ఒకరు నిలబడాలి. నేను నిలబడుతున్నాను. నిలబడగలిగినంత కాలం నిలబడతాను." ఇదీ వీరేందర్ సింగ్ కుందు రాసిన లేఖ. సోషల్ మీడియాలో ఈ లేఖ చదివిన వాళ్లంతా ఆ గూండాలపై విరుచుకు పడ్డారు. కానీ రన్వీర్ బట్టీ అనే వ్యక్తి మాత్రం వీరేందర్ సింగ్ మీద విరుచుక పడ్డాడు. రన్వీర్ బట్టీ హర్యానా బీజేపీ ఉపాధ్యక్షుడు.
ఆ రోజు వర్ణికను కిడ్నాప్ చేసేందుకు వేట కుక్కల్లా వెంటపడిన ఆ ఇద్దరు అగంతకులలో ఒకడు వికాస్ బరాల. హర్యానా బీజేపీ చీఫ్ సుభాష్ బరాల కొడుకు. ఇంకొకడు వికాస్ స్నేహితుడు ఆశీష్ కుమార్. మొదట వికాస్ ను అరెస్టు చేసిన పోలీసులు వీఐపీ కొడుకని తెలిసి వదిలేశారు. తర్వాత వర్ణిక, ఆమె తండ్రి ఫెస్ బుక్ లో పోస్టులు పెట్టడం, మీడియా ఒత్తిడి తేవడంతో వికాస్ ను అరెస్టు చేశారు. ఆ వెంటనే వికాస్ తండ్రి పార్టీలో తన పదవికి రాజీనామా చేసాడు. (సాక్షి దిన పత్రిక ఆగస్టు 12, 2017)
(11) ఢిల్లీలోని షాహ్ ధరా ప్రాంతంలో ఉన్న ఓ ప్రయివేటు పాఠశాలలో అయిదేళ్ల బాలికపై అక్కడే పనిచేస్తున్న ఓ ఫ్యును అత్యాచారానికి పాల్పడ్డాడు. శనివారం మధ్యాన్నం బడి ఆవరణంలోనే ఈ అకృత్యం చోటు చేసుకుంది. వికాస్(40) అనే ఫ్యును ఆ చిన్నారిని ఖాళీగా ఉన్న ఒక తరగతి గదిలోకి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. శనివారం మధ్యాహన్నం ఉపాధ్యాయులందరికి లంచ్ బాక్స్ లను ఇచ్చేసి ఇవతలికి వచ్చిన అనంతరం అక్కడెవరూ లేకపోవడం చూసి పాపపై ఈ దారుణానికి ఒడిగట్టాడు. ఎవరికీ చెప్పవద్దంటూ బెదిరించాడు. అప్పటికి మౌనంగా ఉండిపోయిన పాప .. ఇంటికెళ్ళాక రక్తస్రావం అవుతోందని .. చాలా భాదగా ఉందంటూ అమ్మదగ్గరికెళ్ళి ఏడవటంతో విషయం వెలుగు చూసింది. వైద్యులు ఆ బాలికపై అహత్యాచారం జరిగినట్లు ధృవీకరించారు. తర్వాత పోలీసులు మెల్లగా పాప నుంచి వివరాలు రాబట్టారు. తనపై దారుణానికి వ్యక్తి టోపీ ధరించి ఉన్నాడంటూ .. అతడి పోలికలను కూడ వర్ణించడంతో వికాస్ ను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.(ఈనాడు దిన పత్రిక సెప్టెంబర్ 11, 2017)
(12) అరేయ్ గాడిద !! తాటి చెట్టులా పెరగడం కాదురా, బుద్దీ జ్ఞానం కూడ ఉండాలి. వెధవా ? ఇలా ఒక మనిషిని నోరారా తిట్టే హక్కు ఎవరికుంటుంది ? అమ్మమ్మ, నానమ్మ, తాతయ్యలకే కదా ? మరి కర్ణాటక మాజీ డీజీపీ సంగిలీ యానాకుఅమ్మమ్మ, నానమ్మ, తాతయ్యలు ఇప్పటికి ఉంటే ఇలా తిట్టకుండా వదిలిపెడతారా ? మహిళా దినోత్సవం రోజు బెంగుళూరులో ఓ మహిళా కార్యక్రమం జరిగింది. సంగ్లియానా కూడా ఆ వేదిక మీద ఉన్నారు. తమ ప్రొఫెషన్ లో విశేషంగా కృషి చేస్తున్న మహిళలు, పోరాట పటిమతో తమ వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకున్న మహిళలు, సాటి మహిళలకు మార్గదర్శకంగా ఉన్నవాళ్ళను అభినందిస్తూ వారిని పురస్కరించడం ఆ కార్యక్రమం యొక్క ఉద్దేశం. నిర్భయ తల్లి ఆశా దేవిని కూడా నిర్వాహకులు ఆహ్వానించారు.
మహిళా దినోత్సవం కాబట్టి, సమాజంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాల గురించి, దాడికి పాల్పడిన వారి మీద తక్షణమే చర్య తీసుకోవడం గురించి, నాలుగు పనికొచ్చే మాటలు చెప్తాడని సంగ్లియానను పిలుచుకొస్తే .. ఆయన మొత్తం పోలీసు డిపార్టుమెంట్ పరువునే పోగొట్టారు. "నిర్భయ తల్లి ఫిజిక్ ఈ వయసులోనూ చాలా ఫిట్ గా బాగుంది. ఆమెను చూస్తే నిర్భయ ఎంత అందంగా ఉండి ఉంటుందో నేను ఊహించగలను." అని .. వేదిక మీద మైక్ పుచ్చుకుని మరీ సంగ్లియానా అన్నారు. సమావేశంలో ఉన్న వాళ్ళు ఒక్కసారిగా షాక్ ! తాము విన్నది నిజమేనా అన్నట్లు తల తిప్పి పక్కవాళ్ళను చూసారు. నిజమే అన్నట్లు ఒకరిని ఒకరు ముఖాలు చూసుకున్నారు. ఆ తర్వాత సంగ్లియానా మహిళలకు కొన్ని జాగ్రత్తలు కూడా చెప్పాడు కానీ అవేవి ఎవరి బుర్రలోకి ఎక్కనేలేదు.(ఆ రోజు కార్యక్రమంలో కర్ణాటక మాజీ డీజీపీ మాట్లాడిన మాటలు)
"మీరు నా శరీర ఆకృతిని ప్రశంశిస్తూ కామెంట్ చేశారు. ఆ కామెంట్ చేసే ముందు .. అది ఏమాత్రం సముచితమో ఒకసారి ఆలోచించి ఉండాల్సింది. దాంతో పాటు మా అమ్మాయి అందచందాల గురించి కూడా మాట్లాడారు. అత్యంత క్రూరంగా గాయపడి, చిన్న వయసులో ప్రాణాలు కోల్పోయిన అమ్మాయి దేహ ఆకృతిని ఊహించారు. లైంగిక దాడి కారణంగా ప్రాణాలు కోల్పోయిన అమ్మాయి సౌందర్యం గురించి మాట్లాడారు. తన మీద దాడికి పాల్పడిన వారిని నిరోదిస్తూ మా అమ్మాయి ఎంతగా ప్రతిఘటించిందనే సంఘతిని మీరు గుర్తించలేక పోయారు, ఆ ప్రతిఘటనను గౌరవించలేక పోయారు. మా అమ్మాయిలా మరే ఆడబిడ్డకు జరుగకూడదని నేనెంతగా పోరాటం చేసానో మీరు గుర్తించలేక పోయారు. మీ వ్యాఖ్యల ద్వారా మీలో నిండి ఉన్న అనారోగ్యకరమైన ధోరణిని బయటపెట్టుకున్నారు. మీ ఆలోచనలు కూడా మా అమ్మాయి మీద లైంగిక దాడికి పాల్పడిన మగవాళ్ల ఆలోచనలాగే ఉన్నాయి. ఒక ఆడపిల్ల తమ దాడికి లొంగిపోకుండా ప్రతిఘటించటాన్ని పురాషాధిక్య అహంకారం సహించలేకపోయింది. అందువల్లనే ఆమెను అంత క్రూరంగా హింసించినట్లు వాళ్ళే చెప్పారు. మీ మాటలు కూడా అలాంటి క్రూరమైన మనస్తత్వం ఉన్నవాళ్లను ప్రోత్సహించేవిగానే ఉన్నాయి.
మీరు చేసిన హేయమైన వ్యాఖ్యలతో మీరు యువతులకు ఏం చెప్పారు ? లైంగిక దాడి జరిగినప్పుడు ప్రతిఘటించి ప్రాణాల మీదికి తెచ్చుకోకుండా, లొంగిపోయి ప్రాణాలు కాపాడుకోండి .. అని ! మీ ఈ అభిప్రాయం ప్రకారం .. మీరు మన దేశం కోసం ప్రాణాలు అర్పించడానికి సిద్ధంగా ఉన్న సైనికులకు ఏం చెబుతారు? శత్రువు దాడి చేసినపుడు ఆయుధాలను విసిరేసి లొంగిపోయి ప్రాణాలు కాపాడుకోమనా ? మీరు మాట్లాడింది ఏమాత్రం సమంజసం కాదని ఇప్పటికైనా గ్రహించారా ? ఆడపిల్లలకు మీరు బలహీనమైనవాళ్లు, పరిస్థితులను బట్టీ రాజీ పడుతూ మిమ్మల్ని మీరు ఫణంగా పెట్టుకుంటూ జీవించాలి .. అని సందేశం ఇవ్వదల్చుకున్నారా ?? మీరు. ఇది సంగ్లియానకు నిర్భయ తల్లి రాసిన బహిరంగ లేఖలోని సారాంశం".(సాక్షి దిన పత్రిక మార్చి 21, 2018)
(13) రెండు దశాబ్దాల కిందట ఒక ఉద్యోగి పౌలా జోన్స్, నాటి అమేరికా అధ్యక్షుడిపై లైంగిక వేదింపుల కేసు దాకలు చేసారు. 1991 లో అర్కన్ సాస్ గవర్నర్ గా ఉన్నపుడు బిల్ క్లింటన్ తనను లైంగికంగా వేదించారన్న పౌలా జోన్స్ కేసు .. అధ్యక్షుడికి గల రాజ్యంగా రక్షణల పరిమితులపై సుప్రీం తీర్పునకు, అంతిమంగా క్లింటన్ పరువు మాసి జరిమానా కట్టి లెంపలు వేసుకోవడానికి కారణమైంది. ఎవరు ఎంతటి వారైనా రాజ్యంగా చట్టం వారికంటే సమున్నతమైనదనే నాగరిక భావనకు ఆమెరికా గొడుగు పట్టిన సందర్బమిది. అదే ఇండియాలో .. తనను ఫలానా వాడు లైంగికంగా వేదిస్తున్నాడని నోరు తెరిచి చెబితే పరువు పోతుందని అనేకమంది అనునిత్యం మానసిక క్షోభ అనుభవిస్తున్నారు. పంజాబ్ లో ఉగ్రవాదాన్ని సమర్థంగా అనిచివేసిన కే.పీ.యస్ గిల్ పై మరో ఐ.పి.యస్ అధికారి రూపన్ బజాజ్ గొంతేత్తినపుడు దేశం దిగ్బ్రాంతి చెందింది. ఓ విందు సందర్బంగా గిల్ తన పట్ల అసభ్యంగా ప్రవర్తించారన్న రూపన్ బజాజ్ .. రాష్ట్ర హొమ్ కార్యదర్శిని, గవర్నర్ ని కలిసి తన వేదన విన్నవించినా ఫలితం కరువయ్యింది.(కీచకుల మదమనిచేలా .. ఈనాడు దిన పత్రిక ఎడిటోరియల్, పర్వతం మూర్తి)
(14) ఉత్తర ప్రదేశ్ లోని ఉన్నావ్ ఘటన. 18 దళిత యువతీ వుద్యోగం అడగడానికి స్థానిక ఎం,యల్,ఏ కులదీప్ సెనేగర్ ఇంటికి వెళితే, అతను తనపై అత్యాచారం చేసినట్లు పోలీసులకు ఆమె ఫిర్యాదు చేసింది. కానీ పోలీసులు పట్టించుకోలేదు. మెజిస్టేట్ ముందు ఆ విషయం చెప్పకుండా పోలీసులు అడ్డుకున్న వాస్తవాన్ని కూడా ఆ యువతీ బయటపెట్టింది. చివరకు న్యాయం చేయాలని అడగడానికి పోలీసు స్టేషన్ కు వెళ్లిన ఆమె తండ్రిని ఎమ్మెల్లే సోదరుడు మరికొంత మంది తీవ్రంగా కొట్టి గాయపరిస్తే ఆయన ఆసుపత్రిలో మరణించారు. అత్యాచారానికి గురైన ఆ యువతీ ముఖ్యమంత్రి ఇంటి ముందర ఆత్మహత్యాయత్నానికి పాల్పడటంతో పోలీసుల్లో కదలిక వచ్చింది. దీంతో కేసు విచారణకు ఆదేశించారు. అనేక నిరసనలు దేశవ్యాప్తంగా దళితుల ఆందోళన వల్ల ఎమ్మెల్లేను అరెస్టు చేసారు. అత్యాచారానికి పాల్పడినవాళ్లు ఆధిపత్య కులానికి చెందినవారు కాబట్టే ఇటు పోలీసులు అటు ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు ఉండిపోయారు.(పై పూతలే పరిష్కారమా, మల్లెపల్లి లక్ష్మయ్య .. సాక్షి దిన పత్రిక ఎడిటోరియల్ 2018)
(15)జమ్మూలోని కథువా గ్రామంలో ఎనిమిదేళ్ల పసిపాపను ఒక ప్రార్థన మందిరంలో బందించి, కొన్ని రోజుల పాటు పసికూనపై అత్యాచారం చేసి చివరకు అతి క్రూరంగా చంపేసిన దారుణం దేశంలో ప్రకంపనలు సృష్టించింది. ప్రపంచం మొత్తాన్ని కలవరపరిచింది. కానీ గతంలో ఎప్పుడూ లేనట్టుగా ఈ దారుణాన్ని బహిరంగంగా సిగ్గులేకుండా సమర్థించడం దేశంలో మారుతున్న సామాజిక రాజకీయ పరిస్థితులకు ప్రత్యక్ష ఉదాహరణ. ఆ పసి పాపను అత్యాచారం చేసి, హత్యా చేసిన వారి సామాజిక వర్గం నేతలు చివరకు బిజెపి మంత్రులు, నాయకులు కూడా నిందితులను బహిరంగంగా సమర్థించారు. పైగా వారికి మద్దతుగా జెండాలు పట్టుకొని వీరావేశంతో వీధుల్లో కెక్కారు. ఇట్లా ప్రవర్తించడం వెనుక మతపరమైన, రాజకీయపరమైన కారణాలున్నాయనేది నమ్మకతప్పని వాస్తవం.
ఘాతుకానికి బలైన ఎనిమిదేళ్ల చిన్నారి ఆసీఫాను, మహమ్మద్ యూసుఫ్ ఆయన భార్య నసీమా బీబీ రెండేళ్ల వయసులో దత్తత తీసుకున్నారు. మహమ్మద్ యూసుఫ్ గొర్రెలను మేకలను మేపుతూ బతుకుతున్నాడు. పదేళ్ల నుంచి తువా జిల్లా రాసిన గ్రామంలో స్థిరపడ్డాడు. అయితే జమ్మూలో హిందువులదే మెజారిటీ. మహమ్మద్ యూసుఫ్ లాంటి వాళ్ళు ఇక్కడ స్థిరపడితే శ్రీనగర్ లాగా జమ్మూలో కూడా ముస్లింల సంఖ్యా పెరుగుతుందనే అనుమానం ఇక్కడి హిందువులలో ఉన్నది. అందుకుగాను మేకలు, గొర్రెలు మేపుకొని బతికే వారిలో భయాందోళనలు సృష్టించడానికి ఇటువంటి ఘాతుకానికి పాల్పడినట్టు అనుమానిస్తున్నారు. కామవాంఛ కాదు. నిజానికి ఒక సామూహిక విద్వేషం ఈ ఘాతకానికి పురికొల్పింది.(పై పూతలే పరిష్కారమా, మల్లెపల్లి లక్ష్మయ్య .. సాక్షి దిన పత్రిక ఎడిటోరియల్ 2018)
Special Focus .. !
(1) సృష్టిలో అమ్మ తనం అనిర్వచనీయమైనది. నవమాసాలు మోసి, ప్రసవ వేదన భరించి భూమ్మీద పడిన పసి కూనను చూసి ఏ తల్లైనా కష్టాలను మరిచిపోతుంది. మాతృత్వపు మమకారంతో ఉప్పొంగుతుంది. పసికూన కెవ్వున కేక పెడితే తన గుండెలో కలుక్కుమన్న భావనతో తల్లడిల్లి పోతుంది. కథలెన్ని చెప్పినా పాటలెన్ని పాడినా అమ్మ గొప్పదనాన్ని వర్ణించడానికి ఇంకా అక్షరాలూ వెదుక్కోవాల్సి ఉంటుంది. ప్రస్తుత కంప్యూటర్ యుగంలో సైతం అమ్మ అనే పిలుపుకు ఏదీ సాటిలేదు. అలాంటి అమ్మ మనసు కొందరిలో మారుతోందా? పుట్టిన బిడ్డ ఆడ పిల్ల అని తెలియగానే పురిటి పాన్పుల్లోనే లోకం చూడక ముందే ముళ్ల పొదలు, చెత్త కుండీలు, బస్టాండులో పడేస్తున్నారు. గుక్కపట్టి ఏడుస్తున్నా ఆ తల్లి మనసు కరగడం లేదు. గుండెను రాయి చేసుకుని పారిపోతుంది. ఈ దారుణాల వెనుక కారణాలేవైనా .. కళ్ళు తెరవక ముందే ఆడ శిశువుల జీవితాలు గాలిలో కలిసిపోతున్నాయి. అమ్మ బడిలో వెచ్చగా ఒదిగిపోవాల్సిన పసికూనలు ఆకలి భాదతో గుక్క పట్టి ఏడుస్తూ, రోడ్ల పక్కన, గరుకు నేలపై, చెత్తకుప్పలు, ముళ్ల పొదల్లో దర్శనమివ్వటం సభ్య సమాజాన్ని కుదిపేస్తోంది. ఒకటి, రెండు నెలల వయసున్న పిల్లలను సైతం వదలి వెలుతున్నారు. ఈ పరిణామాలు అందరి మనసులను మెలిపెడుతున్నాయి. కొద్ది నెలలుగా జిల్లాలోని రోడ్లపై పసికందుల అర్త నాదాలు మనిషిలోని మానవత్వాన్ని తట్టి లేపుతున్నాయి. ఇదే సందర్భంలో మానవ సంబంధాలు మంట గలుస్తున్నాయనేందుకు రోడ్డున పడిన పసికందులే సజీవ సాక్షాలుగా నిలుస్తున్నాయి. కారణాలకై అన్వేషిస్తే .. స్నేహం మరియు ప్రేమ పేరుతో శారీరకంగా దగ్గరై పెళ్లి కాకుండానే గర్భం దాల్చిన వారు పుట్టిన పిల్లల్ని చెత్త కుప్పలలో పడేస్తున్నారు. ఆడ బిడ్డ అనే చిన్న చూపు కారణంగా వదిలించుకోవాలని చూస్తున్నారు మరియు అక్రమ సంబంధాలను పెట్టుకుని గర్భం దాల్చిన తర్వాత ఏమి చేయాలో అర్థం కాక మురికి కాల్వలలో పడేయటం చేస్తున్నారు.(అమ్మా ... నన్ను పారేయకే..! ఈనాడు దినపత్రిక జనవరి 29, 2008)
(2). కుటుంభం అనే వ్యవస్థ సక్రమంగా కొనసాగాలంటే స్త్రీలు హింసను భరించక తప్పదని ఈ దేశంలోని సగం మంది పురుషుల అభిప్రాయం. "ఐక్య రాజ్య సమితి జనాభ నిధి" సంస్థ తాజాగా ప్రకటించిన నివేదిక సారంశమిది. ఇది స్త్రీలనే కాదు, మిగిలిన సగం మంది పురుషులను ఉలిక్కిపడేలా చేసింది. స్త్రీలపై హింస సబబేనన్న అభిప్రాయం సమాజంలో ఇంతగా వెళ్లునుకుని ఉందా .. అన్న ప్రశ్న సమానత్వం గురించి ఆలోచించేవారిలో సవాలక్ష సందేహాలు రేకెత్తిస్తుంది. ఈ సంస్థ అధ్యయనంలో పాల్గొన్న పురుషులలో 93.6 % భార్య భర్తకు విదేయులై ఉండాలని పేర్కొన్నారు. దాదాపు 77 % తమ మాట వినకపోతే భార్యను కొట్టే అధికారం, హక్కు పురుషుడికి ఉన్నాయని అభిప్రాయపడ్డారు. 60 % తాము భార్యలను కొట్టామని వెల్లడించారు. పురుషుడన్నాక సందర్బాన్ని బట్టి కటినంగా వ్యవహరించక తప్పదంటూ 85% తమను తాము సమర్థించుకున్నారు.
ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే .. భాదితులైన స్త్రీల భావాలు పురుషుల అభిప్రాయాలకు ఏమాత్రం భిన్నంగా లేకపోవడం! 57.3 % మహిళలు కుటుంభం కోసం హింసను భరించక తప్పదన్నారు. పురుషుడికి విదేయులై ఉండాలని 91 % స్త్రీలు భావించారు. స్త్రీలను కొట్టే హక్కు పురుషులకు ఉందని, పురుషులకన్న ఎక్కువగా స్త్రీలు అభిప్రాయపడ్డారు. స్త్రీ పురుష అసమానతలను తగ్గించే దిశగా పనిచేస్తున్న ఓ సంస్థ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో, సమితి జనాభ నిధి ఈ నివేదికను వెల్లడించింది. అధ్యయనంలో పాల్గొన్న మహిలలో 52 % జీవితంలో ఏదో ఒక దశలో హింసను ఎదుర్కొన్నామని స్పష్టం చేసారు. 38 % భౌతిక హింసకు గురైతే, 35 % మానసిక హింసకు, 17 % లైంగిక హింసకు గురైనట్లు తెలియజేసారు.(అనిచివేతలు ఎన్నాళ్ళు ? ఈనాడు దిన పత్రిక ఎడిటోరియల్, పద్మ శ్రీ యలమంచిలి)
(3).భారత్ లో నేరగణాంకా వివరాల నమోదు సంస్థ ప్రకారం .. 2011 మొదలు 2013 వరకు ఆమ్ల దాడుల సంఖ్య వరుసగా 83, 85, 66. ఆ తరువాత ఒక్క ఏడాదికే 2014 లో అది నాలుగు రెట్లు పెరిగి, ఒకేసారి 309 కి చేరడాన్ని బట్టి పరిస్థితి ఎంత క్లిష్టతరంగా మారిందో అర్థం చేసుకోవచ్చు. ఛత్తీస్ గడ్ లో ఓ హక్కుల ఉద్యమ కారిణిని కారు నుంచి బయటకు లాగిన దుండగులు, ఆమె ముఖంపై రసాయన ద్రావకాన్ని చల్లి తీవ్రంగా గాయపరిచి ఉడాయించడం సమస్య తీవ్రతకు తాజా నిదర్శనం.
దేశంలో ఎన్ని చట్టాలు ఉన్నా, స్త్రీలపై హింస నానాటికి పెరుగుతూనే ఉందని అధికారిక గణాంకాలు, స్వచ్చంద సేవాసంస్థల క్షేత్ర స్థాయి పరిశీలనలు తెలిజేస్తున్నాయి. 2012 లో ఆ తరహ ఫిర్యాదుల సంఖ్య దాదాపు 2.5 లక్షలకు చేరుకొంది. మరో ఏడాదికే అది 3.1 లక్షలకు పెరగడం విస్తరించిన హింసకు తార్కాణం. అప్పుడు, అనంతర సంవత్సరాలలోనూ నమోదైన కేసుల సంఖ్య ఉమ్మడి రాష్ట్రంలో చాల ఎక్కువ. వాటిలో అత్యంత కటిన శిక్షకు అర్హమైన నేరాలు 60 % పై మాటే. ఎటువంటి హింసకు గురైన స్త్రీలకైనా సత్వర న్యాయం జరగాలంటే, ప్రభుత్వ పరంగా పలు తక్షణ చర్యలు అత్యవసరమని జస్టిస్ జె.యస్ వర్మ కమీషన్ లోగడ స్పష్టం చేసింది. అవి ప్రస్తుత చట్ట నిబంధనల్లో పరిస్థితులకు అనుగుణమైన మార్పు చేర్పులతో పాటు, ఆమ్ల దాడుల వంటి ఘాతకాల్ని అరికట్టేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేయడం, కేసులను సకాల దర్యాప్తు పరంగా పోలీసు యంత్రాంగాన్ని సంస్కరించడం, న్యాయవ్యవస్థకు సంబంధించి మరిన్ని జాగ్రత్తలు తీసుకోవడం ప్రభుత్వాల ప్రధాన భాద్యత.(ఈనాడు దిన పత్రిక ఎడిటోరియల్ .. హక్కులపై ఆమ్ల దాడి, శరత్)
ఆడది...!
ఆరు బయట
అడుగు పెట్టగానే ...?
స్మార్ట్ గా ఉందని
కుందనాల బొమ్మని
సొల్లు కారుస్తూ
కళ్ళప్పగించి చూస్తూ
ఇంట్లోని ఆడవారిని మరిచి పోతారు.
కలల్లో తేలియాడుతూ
కన్నతల్లిని మరిచిపోయి
కామంతో కూడిన కార్యాలకు పునాది వేస్తున్నారు.
అమ్మాయిలను
ఆట బొమ్మలుగా చూస్తూ
అడవి మృగాల కంటే హీనంగా ప్రవర్తిస్తున్నారు.
* * *
"స్త్రీ పురుష సంబంధం బానిసలా ఉండకూడదు. సహజమైన పరస్పర ప్రేమానుబంధంతో ముడిపడి వుండాలి. కృత్రిమ బంధనాల మధ్య అస్వతంత్రతా సంబంధాలతో కుములుతున్న స్త్రీలకు చేయుతనివ్వడానికి పురుషులు బేషరతుగా ముందుకు వచ్చిన నాడు, స్త్రీలను పురుషులు అణుకువ గల కుమార్తెలుగా,ప్రేమాస్పదులైన అక్క చెల్లెల్లుగా,మరింత అనుకూల వంతులైన నమ్మదగిన భార్యలుగా,హేతుబద్దమైన తల్లులుగా,ఇంకా స్పష్టంగా చెప్పాలంటే భాద్యత గల పౌరులుగా చూడగలుగుతారు. అప్పుడు మాత్రమే మేము పురుషులను నిజమైన ఆప్యాయత అనురాగాలతో ప్రేమించ గలుగుతాం".. మేరీ ఉల్స్టోన్ క్రాఫ్ట్ (A vindication of the rights of women 1789)* * *
What about adultery ?
వ్యభిచారం .. చెవులకు ఈ పధం వినబడగానే ఒళ్ళు జలదరిస్తుంది. ఏదో చెడ్డదన్న భావన మన మనసుల్లోకి వచ్చి చేరుతుంది. లైంగికతకు పనికిరాదన్న ఆలోచన బుర్రలోకి చేరిపోతుంది. నీచమైన పననే ముద్ర సమాజం వేస్తుంది. ఏది ఏమైనా మనుషులందరు వ్యభిచారులే అన్నాడు నార్మన్ మెయిలర్. ఈ మాటతో అందరు ఏకీభవించక పోవచ్చు కాని మనుషులందరు మానసిక వ్యభిచారులనే నా మాటతో ఏకీభవించక తప్పదు. అందరి మెదళ్ళలో .. అన్ని వేళలా .. గుట్టు చప్పుడు కాకుండా జరుగుతున్న వ్యభిచారం మానసికమైనదే అని చెప్పవచ్చు .. ఆ మాటకొస్తే శారీరక వ్యభిచారం కూడా గుట్టు చప్పుడు కాకుండా హై ఫై స్తాయిలో జరుగుతూనే ఉంది. తలంపుల్లోనో , ఊహల్లోనో , చూపుల్లోనో ఎవ్వరికి తెలియకుండా ఎపుడో ఒకప్పుడు మనసులో చేసే చెడ్డ (లైంగిక) ఆలోచనలనే మానసిక వ్యభిచారం కాదంటారా మీరే చెప్పండి ? ఈ పధం యొక్క మూలాలలోకి వెళితే .. పూర్తిగా ఇది లైంగికతకు సంభందించిన అంశం .. నైతికతకు చెందిన విషయం. పుట్టిన ప్రదేశం , పెరిగిన సంస్కృతి , అనుకరిస్తున్న మతం .. ఏదైనా కావచ్చు .. మీరు ఇందులోని ఏ వర్గానికైనా చెంది ఉండవచ్చు. అన్ని మతాలలో , అన్ని వర్గ ప్రజలలో అందరి న్యాయసమ్మేతంగా భార్య భర్తల మధ్య జరగాల్సిన లైంగిక ఒడంబడికకు() వ్యతిరేకంగా జరిగేది వ్యభిచారమని సామాన్యంగా నిర్వచించవచ్చు. ఈ నిర్వచనంలో కొంత లోపమున్నప్పటికీ బైబిల్ స్పష్టంగా .. పెళ్ళికి ముందు జరిగే లైంగిక ప్రక్రియను జారత్వంగా, పెళ్లి తర్వాత కూడా భాగస్వామితో కాకుండా మరొకరితో జరిపే లైంగిక సంపర్కాన్ని వ్యభిచారంగా అభివర్ణించింది. అందుకేనేమో ఒకాయన మాట్లాడుతూ .. Sex is nothing but physical and emotional entertainment అన్నాడు.
నేడు ఆడది అవసరాలు తీర్చే యంత్రమైపోయింది .. ఎపుడు పడితే అపుడు ఉపయోగించే భోగ వస్తువై పోయింది .. అందాల ఆరభోతకు మాత్రమే పనికివచ్చే ప్రధాన పెట్టుబడిగా మారింది .. ప్రపంచాన్ని శాశించే అత్యంత గొప్ప వ్యాపారానికి స్త్రీ దేహము కేంద్ర బిందువుగా మారింది. ఎక్కడ చూసినా చిన్న చూపే , ఎక్కడ వెతికినా వివక్షే. కడుపులో మొదలైన కోత నుండి కాటికి పోయేదాక ఆగడం లేదు. గర్భం లోనైనా గండం తప్పుతుందేమో గాని భూమి మీద పడ్డ ఆడపిల్లకి గుండె కొత్త తప్పడం లేదు. పుండు పుండు చేస్తున్నారు ..శరీరాన్ని కుల్ల పొడుస్తున్నారు .. పండంటి జీవితాలకు ప్రతి క్షణం నరకంగా మారుస్తున్నారు .. ఆటవికుల రోజుల్లో అయినా ఆధునికుల కాలంలో అయినా .. తిప్పలు ఎక్కువవుతున్నాయే తప్ప తగ్గడం లేదన్నది రికార్డులు చెప్పే నగ్న సత్యం. ఎన్ని సార్లు పేపర్లో రాసినా .. ప్రత్యేక కథనాలతో మీడియాలో ప్రచారం చేసినా .. వారి తలరాత మాత్రం మారడం లేదన్నది వాస్తవం. నాకు తెలిసినంత వరకు .. తెలియకుండా వ్యభిచారపు కూపంలోకి నేట్టివేయబడేవారు కొందరైతే, తెలిసి ఆ రొంపిలోకి దిగేవారు మరికొందరు, వారసత్వంగా ఇంకొందరు అదే ఊభిలోకి దిగిపోతున్నారు.
అనేక కథనాలను చదివినపుడు , పరిశోదన పేపర్లలోని గాధలను పరిశీలించినపుడు, భాదితుల గోడును విన్నపుడు కళ్ళు నమ్మలేని నిజాలు .. నా కళ్ళ ముందు చేరాయి.
ఒకప్పుడు పేదరికం మూలంగా మహిళల అక్రమ రవాణ జరిగేది, వ్యభిచార వృత్తి నడిచేది. కాని నేడు హై ఫై కల్చరే వ్యభిచారానికి ప్రధాన మాధ్యమంగా మారింది. మనం వాడుతున్న టెక్నాలజీ వ్యభిచార వృత్తికి వేదికైంది. హైటెక్ సెక్స్ మాఫియా కారణంగా అమాయక మహిళలు ఉచ్చులో పడటానికి ఆస్కారం కల్పిస్తుంది. ఒక సర్వే ప్రకారం .. మన దేశంలో ప్రతి అయిదు నిమిషాలకి ఒక ఆడపిల్ల అదృశ్యం అవుతుంది. పది నిమిషాలకో ఆడపిల్ల అమ్మకానికి సిద్దమవుతుంది. ఏటా 30,00000 మంది అమ్మాయిలు అమ్మివేయబడుతున్నారు. అందులో నుండి 10 లక్షల మంది అమ్మాయిలు వ్యభిచారపు కూపంలోకి తోసివేయబడుతున్నారు. ఇది ఇలానే కొనసాగితే .. రేపటి మాన్ అమ్మాయిల పరిస్తితి ఆలోచిస్తే .. శరీరమంతా చెమటలు పడుతున్నాయి, భవిషత్తు భయానకంగా కన్పిస్తుంది. కనీసం నావంతు పాత్రగా , ఈతరం అమ్మాయిలు ఎలా ఆ ఉచ్చులో చిక్కుకుంటున్నారో తెలియజేసి .. కనీసం కొందరినైనా కాపాడాలనే ఉద్దేశంతో ఈ మాటలు వ్రాస్తున్నాను.
ఆడదానిగా పుట్టడమే మహా శాపంగా పరిణమించిన ఈ దేశంలో .. ఎందరో అభాగ్యులైన వ్యభిచారుల వలలో సులువుగానే చిక్కుకుంటున్నారు. వినోదాల మాటున జరిగే విధ్వంసాన్ని ఎరుగక .. బతికుండగానే బలి పశువులా మారుతున్నారు. బుట్టలో పడ్డ చేప పిల్లలా కొట్టుకుంటూ .. సుఖాన్నిచ్చే యంత్రంలా మారి .. చస్తూ బతుకుతూ రోజులు లెక్కపెట్టుకుంటున్నారు. కళ్ళ ముందే జరిగిన దారుణాన్ని సహించలేక .. క్షణ క్షణం కలిగే భాదను భరించలేక .. పారిపోదామని ప్రయత్నించినా, వారి మాటలకు ఎదురు తిరిగినా .. పరిణామాలు తీవ్రంగా, శిక్షలు కటినంగా, అంత్యంత భయంకరంగా ఉంటాయి. పచ్చి బూతులను పలుకుతూ .. మొదట మానసికంగా చంపేస్తారు. బట్టలూడదీసి రక్తం కారునట్లుగా .. చేయితో, చెప్పులతో వీలైతే కర్రలతో కొడతారు. గాయాలపై పొడి కారాన్ని చల్లుతూ .. కీచకుల్లా నవ్వుతారు. అందరి ముందు నగ్నంగా డ్యాన్స్ చేయమని బలవంతం చేస్తారు. నచ్చని పదార్థాలను నోట్లోకి బలవంతంగా కుక్కుతూ .. కొత్త రకమైన భాధలకు బీజం వేస్తారు. ఒకేసారి పది మంది మీద పడుతూ .. పందుల్లా మాంసాన్ని పీక్కతింటారు. చచ్చేంత వరకు మానసికంగా, శారీరకంగా, లైంగికంగా నష్టపరుస్తూ .. అణువణువునా గుండెను గాయాలపాలు చేసి .. అనాధ శవాల ఖాతాలోకి పారేస్తున్నారు. ఇంతటి దారుణాలు జరుగుతున్న భరత భూమిలో .. న్యాయం సంఘతేమో గాని వీరిపట్ల తృనికార భావమే సమాజంలో ఎక్కువగా కన్పిస్తుంది. వ్యభిచారి అనే ముద్ర వారి బతుకును చిద్రం చేస్తుంది.
హైందవ ధర్మ శాస్త్రం ప్రకారం , మనిషి యొక్క జీవిత పయనం ధర్మం , అర్థం , కామం , మోక్షం గుండా సాగిపోతుంది అనేది ఎక్కడో మనం విని ఉంటాం. మన చుట్టూ బతుకుతున్న మనుషులను గమనిస్తే .. ధర్మం, అర్థం, మోక్షం ఏమో గాని కామం అనే దశ చుట్టే ప్రపంచమంతా తిరుగుతుందని నా అభిప్రాయం. కోరికలను తీర్చుకొనుట కొరకు వయసు లేని పిల్లలను వదిలేయడం లేదు, వయసు మళ్ళిన వృద్దులను విడిచి పెట్టటం లేదు, యవ్వనంలో ఉన్నవారి గురించి మాట్లాడే పనే లేదు. అంగట్లో వస్తువులను అమ్మటం అలవాటైన మనిషికి, ఆడవారిని కూడా అంగట్లోని ఒక వస్తువుగా అలవాటైపోయింది. శీలాన్ని డబ్బుతో ముడి పెట్టటం వివాదాల్లో మామూలు విషయంగా మారింది. ఆడపిల్లలకి అడుగడుగునా అపాయమే పొంచి ఉంది. ఒంటరిగా ఉన్న వారిమీద కన్నేసి .. తెలివిగా వ్యభిచార కూపంలోకి లాగుతున్నారు. విడాకులు తీసుకున్న వారి మీద , విడాకులు తీసుకోవాలనుకుంటున్న వారి మీద దృష్టి నిలిపి .. మాయ మాటలు చెప్పి వలలో వేస్తున్నారు.అవసరాల్లో , ఆపదల్లో ఉన్న మహిళలను గుర్తించి .. ఆదుకునే మంచి మనిషిగా నటించి , పట్ట పగలే నీచమైన కార్యాలకు ఒడిగడుతున్నారు. అవకాశం దొరికితే కిడ్నాప్ చేస్తున్నారు , అత్యవసరమైతే కత్తి చూపి బెదిరిస్తున్నారు. కామం తలకెక్కి , కళ్ళు మూసుకపోయి కసాయి వాళ్ళలా ప్రవర్తిస్తున్నారు. వారికున్న వ్యక్తిగత గుర్తింపును(self-identity) దెబ్బతీస్తూ , సామాజిక గుర్తింపును(social-identity) సహితం కాలరాస్తూ .. ఒక్క మాటలో చెప్పాలంటే పశువుల కంటే హీనంగా చూస్తున్నారు ఈ యుగపు పురుషులు. ఈ రచన ద్వారా పురుషులు మారతారనే నిశ్శయత నాకు లేదు గాని చదివిన స్త్రీలైనాఎన్ని రకాలుగా ప్రమాదం పొంచిఉందో గమనించి జాగ్రత్త పడతారని భావిస్తున్నాను.
(1) ఒక అమ్మాయి చనిపోతూ వాల్ల అమ్మా నాన్న కి రాసిన Suicide Letter ఇది. అమ్మా నాన్న నన్ను క్షమించ౦డి.ఈ నిర్ణయ౦ తీసుకున్నందుకు. అమ్మా నాన్న ఒక అబ్బాయి నన్ను ప్రేమి౦చానని నటి౦చాడు. వాడు చెప్పిన మాయ మాటలకి నేను మోసపోయాను. తప్పుజరిగిపొయి౦ది అమ్మా. వాడి ప్రేమకి లొంగిపొయాను. నాకు తప్పు అనిపించలేదు. పెళ్ళ౦టూ చెసుకుంటే వాన్నె చేసుకోవాలి మిమ్మల్ని ఒప్పించి అనుకున్న. కాని వాడు ఆ తప్పు చెస్తుంటే మొబైల్ లొ Shoot చేశాడు. నెట్ లో పెడతానని బెదిరి౦చాడు. నేను మోసపోయానని ఆ క్షణమే తెలిసింది. కానీ వాడి చేతిలో నా జీవిత౦ ఉ౦దని ఏ నిర్ణయ౦ తీసుకోలేక పోయాను. ఆ వీడియోను అడ్డ౦ పెట్టుకుని చాలా బాధపెట్టాడు,.ఆడ పిల్లనని కూడా చూడలేదు. తన Friends అ౦దరితో నన్ను చీమను నలిపినట్టు నలిపేస్తుంటే నరకం లో ఉన్నట్లుఉ౦దమ్మా. క్రూర మ్రుగాలయినా సాటి జ౦తువుల పైన జాలి చూపిస్తాయేమో కానీ.నన్ను ఊపిరి కూడా ఆడనివ్వలేదమ్మా. భరి౦చలేక పోతున్న అమ్మా. College లో Top గా ఉ౦డే నేనుఎ౦దుకు Fail అవుతున్నావు అని అడిగితే నా ఒంటి మీద వున్న ప౦టి గాట్లని ఆ మ్రుగాలు నుజ్జు నుజ్జు చేసిన. నా బాడీ మొత్తం నొప్పిగా వుందని యెలా చెప్పుకు౦టానమ్మా నీతో. అమ్మా నాన్న నన్ను క్షమించండి.నాకు చనిపొవడ౦ కంటే ఇ౦కేమి కనిపించడ౦ లేదు. నాకు న్యాయం జరిగినా పాడయిపోయిన నా శరీర౦ ఆ గాయాలు బ్రతికున్న ప్రతి క్షణ౦ నన్ను చ౦పేస్తాయి అందుకే ఈ నిర్ణయ౦ తీసుకున్నాను నాలా౦టి ఆడపిల్లలు ఈ ప్రపంచం లో చాలా మంది వున్నారు. నా లాంటి వాల్లు యెంత మంది చనిపొయినా ఈ సొసైటీ లో మార్పు రాదు. ఇలాంటి ప్రప౦చ౦లో నేను ఉ౦డలేను. నన్ను క్షమించండి. మల్లి జన్మంటూ ఉ౦టే మీ కడుపున పుట్టి మిమ్మల్ని స౦తోష౦గా చూసుకుని మీ రుణ౦ తీర్చుకు౦ట. క్షమించు అమ్మా క్షమించు నాన్న..!
(2) నా పేరు మేరి. మాది గుడివాడ. పెండ్లయి ఇద్దరు పిల్లలు. భర్త వ్యసనపరుడు కావడంతో విడిపోయాం. నా పరిస్థితిని చూసిన ఇంటి పక్క అంటి .. మాకు హైదరాబాద్ లో తెలిసిన వాళ్ళు ఉన్నారు. పని కల్పిస్తానని చెప్పింది. అలా అంబర్ పేట చే నంబర్ కు వచ్చామ్. డ్యూటి సాయంత్రం ఉంటుంది .. మంచిగా రెడి అవ్వాలని చెప్పి వెళ్లిపోయింది. మరుసటి రోజు సాయంత్రం రెడి అయ్యా. ఆటోలో ట్యాంక్ బండ్ తీసుకెళ్ళారు. ఆఫీస్ కి వెళ్ళడానికి ఇంకో అటో .. దానిలో ఇద్దరు వస్తారని చెప్పారు. సరే అని వెళ్లాను. అదొక అందమైన అపార్ట్ మెంట్. సంబురపడ్డాను. పది నిమిషాలకి అర్థమైంది నేను మోసపోయానని. ఎన్ని సార్లు పారిపోదామనుకున్నా కుదరలేదు. సునితా మేడం నన్ను కాపాడి, నాకు అన్ని ఇచ్చారు. పిల్లల్ని మేడమే చదివిస్తుంది. నాకు దారి చూపించింది.(నమస్తే తెలంగాణా దిన పత్రిక,జనవరి 09,2016 )
(3) నా పేరు సుజాత. మాది నంద్యాల. భర్త లేడు. ఒక బాబున్నాడు. ఉపాధి కోసమని నంద్యాల నుండి బయలుదేరి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో దిగాను. ఒంటరిగా ఉన్న నన్ను చూసి .. పని కల్పించి ఆదుకుంటానని ఒకావిడ చెప్పింది. నమ్మి ఆమెతో వెళ్లాను. పోయాక అర్థమైంది అది ఒక వ్యభిచార కొంపని. ఒకసారి ఉప్పల్ లో పోలీసులకు దొరికి పోయా. ప్రజ్వల సంస్థ నాకు పునర్జన్మను ప్రసాదించింది. ఎంబ్రయిడింగ్ నేర్చుకున్నా. స్వరక్ష ద్వారా మార్పు తీసుకొస్తా. (నమస్తే తెలంగాణా దిన పత్రిక జనవరి 09,2016)
(4) నా పేరు రాణి. మాది నల్గొండా జిల్లా సూర్యాపేట. ఓ ప్రమాదంలో అమ్మా నాన్న ఇద్దరు చనిపోయారు. అక్కా కులాంతర వివాహం చేసుకుంది. బంధువులెవ్వరు తనని ఇంట్లోకి రానివ్వలేదు. నేనే అక్కని చూడ్డానికి హైదరాబాద్ వచ్చేదాన్ని. ఓసారి అలా వచ్చినప్పుడే సెల్ ఫోన్ రీచార్జ్ చేయించుకున్నా. అప్పటి నుంచి ఆ షాపు నడిపే అబ్బాయి ఫోన్ చేస్తూ మెస్సేజ్ లు పెట్టేవాడు. నేను స్పందిన్చేదాన్ని. క్రమంగా మా పరిచయం ప్రేమగా మారింది. అక్కకి విషయం చెబితే "ప్రేమ పెళ్ళితో అందరికి దూరమై భాధపడుతున్నా .. నీకు ఆ పెళ్లి వద్దు " అంది. నేను వినలేదు. ఇంట్లో చెప్పకుండా ఆ అబ్బాయితో వెళ్ళిపోయా. నిఖా చేసుకోవడానికి ఓ పద్దతుంది , దానికి సమయం పడుతుందని ఆ అబ్బాయి నన్ను ఒక స్నేహితుడి గదిలో ఉంచాడు. ఎలాగో పెళ్లి చేసుకోబోతున్నాం కదా అని నేను తనతో సన్నిహితంగానే ఉన్నా. రెండు నెలలు విలాసాలన్ని చూపించాడు. వందేళ్ళు ఇలాగే ఉంటుందనుకున్నా. ఒకరోజు బంధువులింటికి అని చెప్పి .. ఓ మహిళా దగ్గరికి తీసుకెళ్ళాడు. కాసేపయ్యాక ఇప్పుడే వస్తా అంటూ బయటికి వెళ్ళాడు. ఎన్ని గంటలు గడిచినా రాలేదు. నేనక్కడి నుండి వెలదామనుకుంటే "నిన్ను కొనుక్కున్నా .. ఎక్కడికెల్తావ్ అంటూ బంధించింది ఆవిడ. కాళ్ళ వెళ్ళా పడినా వదలలేదు. ఆంటి నన్ను మత్తు పదార్థాలకు అలవాటు చేసి ఆ మురికి కూపంలోకి దింపింది. అక్కడ జీన్స్ టాప్స్ జిగేల్ మనే దుస్తువులు వేసుకోవాలి. అపార్ట్ మెంట్ లో చుట్టుపక్కల వాళ్లకి అనుమానం రాకుండా ఆ దుస్తువుల మీద నైటి వేసుకోవాలి. ఒకే ఊళ్లోనే ఎవరికీ అనుమానం రాకుండా రకరకాల చోట్లకు మారుస్తారు. ఆఫీసు కోసం అద్దెకు తీసుకొని, లోపల మమ్మల్ని ఉంచుతారు. ఆకలితో ఉన్నపుడు, ఆరోగ్యం బాగా లేనపుడు కూడా వొళ్ళు అప్పగించాల్సిందే. వచ్చిన వారు సంతృప్తి కోసం గిచ్చడం, రక్కడం, రక్తం కారేలా కొరకడం చేసేవారు. ఏడ్చినా .. అడ్డుకున్నా.. ఆంటికి చెప్పి కొట్టించేవారు. ఈరకంగా బతికుండగానే ఏడాది పాటు నరకం చూసా. ఆకరికి రెండేళ్ళ క్రితం రేస్క్యులో ప్రజ్వలకు వచ్చా. అయినా వాళ్ళని నమ్మలేక పోయేదాన్ని. వంచనకు బలయ్యాక నమ్మకం అనే పదాన్ని మర్చిపోయా. అప్పటికే మద్యానికి బానిసైన నేను తాగకుండా ఉండలేక పోయేదాన్ని. సునీత మేడం ఈ పరిస్థితుల్లో ఉన్న నన్ను మామూలు మనిషిని చేశారు. డి టి పి కోర్సు నేర్పించి ఉద్యోగామిచ్చారు. ప్రస్తుతం నేను స్కూళ్ళలో కాలేజీలలో అమ్మాయిలని కలిసి నా జీవితాన్ని పాటంగా చెబుతున్నా.(ఈనాడు దిన పత్రిక, జనవరి 09,2016 )
(5) నా పేరు మాలతి. మాది గుంటూరు జిల్లాలోని ఓ మారుమూల గ్రామం. నాన్న చిన్న తనంలోనే పోయారు. అమ్మ .. అక్కని నన్ను చదివించే స్తోమత లేక విజయవాడలోని సాంఘిక సంక్షేమ ఉంచి చదివించేది. ఎనిమిదో తరగతిలో ఉన్నపుడు .. ఒక రోజు బడి నుంచి బయటికి వచ్చాను. ఇద్దరు భార్యా భర్తలు నాతో చనువుగా మాట్లాడుతూ .. మత్తు పానియమేదో తాగించారు. నన్ను తీసుకెళ్ళి వైజాగ్ లో లక్షన్నరకు అమ్మేశారు. అలా వ్యభిచార కూపంలోకి వెళ్లాను. చెప్పిన మాట వినాల్సిందేనని నన్ను కొనుక్కున్న ఆమె రోజూ కొట్టేది. చాల రోజులు తట్టుకున్నా. చివరికి వాళ్ళు చెప్పినట్టు చేయక తప్పలేదు. రెండేళ్ళ తర్వాత నన్ను గోవా వాళ్లకి అమ్మేశారు. అక్కడ వాస్కోడిగామా చాలా ప్రమాదకరమైన ప్రాంతం. అక్కడి రెడ్ లైట్ ఏరియాలో విదేశీయుల్ని ఆకట్టుకునేలా పొట్టి దుస్తువుల్ని వేసుకోవాలి. అలా చేయకపోతే వివస్త్రను చేసి కొడతారు. గాయాల మీద కారం చల్లుతారు. వచ్చే విటులు తమ వికారాలతో నరకం చూపిస్తారు. కొందరు మీద బీరు పోస్తారు. నచ్చని పదార్తాలిచ్చి తినమంటారు. సిగరెట్లతో కాలుస్తారు. స్తానికులు ఒక్కడినే వస్తా అని చెప్పి దగ్గరలోని అడవులకు తీసుకెళ్తారు. తీరా ఒక్కసారే పది పదిహేను మంది మీద పడతారు. మాట వినక పోతే చంపేస్తారు. సున్నిత మనస్కులైతే అక్కడి నుంచి వచ్చాకా ఆత్మ హత్య చేసుకుంటారు. అలా ఎనిమిదేళ్ళు నరకం అనుభవించా. ఈ భాధలు భరించ లేక ఐదు సార్లు పారిపోవడానికి ప్రయత్నించా. చివరికి హైదరాబాద్, గోవా పోలీసుల స్టింగ్ ఆపరేషన్‌లో బయటపడి 14 ఏళ్ల క్రితం ప్రజ్వల సంస్థ కి వచ్చాను. కాని గతం నన్ను కుంగదీసింది. తీవ్ర నిరాశలోకి వెళ్లి పోయా. సునితా మేడం నాకు అన్ని రకాలుగా అండగా నిలిచారు. బ్యుటిశియాన్, హౌస్ కీపింగ్ .. రంగాల్లో నిలదొక్కు కునేలా పనులు నేర్పించారు. ఉద్యోగం ఇప్పించారు. మూడు నాలుగేళ్ళు ఉద్యోగం చేశా. కానీ నేను నలుగురికి ఉపయోగపడాలనే ఉద్దేశంతో ప్రజ్వలలో చేరి రేస్క్యు బృందంలో పని చేస్తున్నా. నాకు తెలిసిన సమాచారంతో గోవా డిల్లీ కలకత్తా పూనే చంద్రపూర్ వంటి ప్రాంతాలలో వ్యభిచార కూపంలో మగ్గి పోతున్న అయిదు వేల మంది అమ్మాయిలని కాపాడ. నా మీద ఐదారు సార్లు దాడులు జరిగాయి. అయినా పోరాటం ఆపలేదు. ప్రస్తుతం నాకు పెళ్లైంది. ఇద్దరు ఆడపిల్లలు. మా అమ్మని కలుసుకున్నా. దూర విద్యలో డిగ్రీ చదువుతున్నా. నిజంగా నాకిది పునర్జన్మ.(ఈనాడు దిన పత్రిక, జనవరి 07,2016 )
(6) ఆ అమ్మాయికి అతనెవరో తెలియదు. స్నేహితురాలి స్నేహితురాలికి బంధువయ్యే ఓ అబ్బాయికి అతను స్నేహితుడు. చాట్ చేసిన మూడో రోజే 143 చెప్పేశాడు. అతని ప్రొఫైల్ పిక్త్చర్ చాల అందంగా ఉంది. చదివే విద్యా సంస్థ చాలా పేరున్నది. ఆ ఆన్ లైన్ ప్రేమ కాస్త ముదిరింది. ఒక రోజు ఆ అబ్బాయ్ స్కైప్ లో అర్ధ నగ్నంగా రమ్మన్నాడు. ఆ దృశ్యాల్ని సేవ్ చేసి పెట్టాడు. అంతర్జాలంలో వ్యభిచార మార్కెట్ల సైట్లలో పెట్టేశాడు. ఆ క్షణం నుంచే ఆ అమ్మాయికి విపరీతమైన ఫోన్లు. విషయం తెలిసి .. ఆ కుటుంభం మొత్తం ఆత్మహత్యకు పాల్పడే నిర్ణయానికొచ్చింది. చివరి క్షణంలో చుట్టు పక్కల ఉన్నవాళ్ళు అడ్డుకున్నారు. మానసిక నిపుణుల సహాయంతో ఆ బాధల నుంచి కోలుకున్నారు. ఇంతకి తేలిందేమిటంటే .. తనకి పరిచయమైన ఆ అబ్బాయి ఓ వ్యభిచార దళారి అని. ఇది అంతర్జాల నేరానికి ఓ పరాకాష్ట.(ఈనాడు దిన పత్రిక, నవంబరు 23,2015)
(7) ఓ కాలని మలుపు నుండి ఆటో బయలుదేరింది. కొంచెం దూరం వెళ్ళగానే .. ఓ అమ్మాయి చేయి చాపి .. బస్టాండ్ వెళ్ళాలని అడిగి ఆటో ఎక్కింది. ఆటోలోకి ఎక్కగానే .. ఆటో డ్రైవరు ప్రణాళిక ప్రకారం ఫ్రెండ్ కి మిస్ కాల్ చేసి పెట్టేశాడు. తన స్నేహితుడు మిస్ కాల్ చూసి కాల్ చేసే సరికి ఫోన్ మోగింది. రిసివ్ చేసుకొని మార్గ మధ్యంలోఉన్నానని .. వెయిట్ చేయమని చెప్పి ప్రయాణిస్తున్న క్రమంలో .. ఏమి తెలియని పాసింజర్ లా ఆటో ఎక్కాడు స్నేహితుడు. పక్క ప్రణాలికను గుర్తించని అమ్మాయి .. అటూ ఇటూ దిక్కులు చూస్తున్న సమయంలో .. చుట్టూ జనాలు లేని సందర్బాన్ని గమనించి .. అమ్మాయి పక్కనే కూర్చున్న స్నేహితుడు .. జేబులోని క్లోరోఫాం కల కర్చీఫ్ ను తీసి .. అకస్మాత్తుగా అమ్మాయి దగ్గర పెట్టాడు. ఆ వాసనకి శరీరమంతా మత్తు ఆవరించి .. నిద్రలోకి జారిపోయింది. అమ్మాయి తలను తన భుజంపై ఆనించుకొని .. పేషెంట్ ను తీసుకెళ్తున్న బంధువులా ఫోజు పెట్టి .. ముందున్న డ్రైవర్ కి సక్సెస్ అని సైగ చేశాడు. ప్రణాళిక ప్రకారమే జనావాసం ఎక్కువగా లేని ఒక భవనంలోకి అమ్మాయిని ఎత్తుకెళ్ళి .. ఓ రూంలో బెడ్ పైన పడుకోబెట్టారు. బట్టలు ఊడదీసి మత్తులోనే లైంగికంగా అనుభవించారు. అమ్మాయికి మెలకువయ్యే జరగాల్సిన దారునమంతా జరిగిపోయిందని గ్రహించి .. గట్టిగా ఏడుస్తూ .. తనను వదిలేయమని రెండు చేతులెత్తి దండం పెట్టింది. ఆ ఇద్దరు నవ్వుతూ .. వదిలేయడానికి కాదమ్మ ఇంత కష్టపడి పట్టుకొచ్చింది .. నీ అందమైన శరీరాన్ని అనేకులకు పరిచయం చేసి .. డబ్బు సంపాదించాలంటూ .. వారికి పరిచయమున్న అనేకులకు ఫోన్ చేసి .. బేరాన్ని కుదుర్చుకుని .. అమ్మాయి చచ్చేంత వరకు వారు అనుభవిస్తూ .. అనేకులకు డబ్బు తీసుకొని సుఖాన్ని పంచుతూ .. వ్యభిచారం అనే వ్యాపారాన్ని కొనసాగించారు.(life ok serial)
(8) సాయంత్రం పార్టీకి పోదామని భార్యకు చెప్పాడు భర్త. ఏడు గంటలు దాటింది .. భార్య అందంగా తయారై .. పార్టీ గురించి ఊహల్లో తేలియాడుతూ .. భర్త ఆఫీసు నుండి రాగానే వెళ్ళాలనే ఆతృతలో . హాల్లో కూర్చుని వేచి చూస్తుంది. అనుకోవడమే ఆలస్యంగా .. కారు శబ్దం చెవులకు వినిపించగానే .. మెయిన్ డోర్ దగ్గరకి వెళ్లి నిలబడింది. కారుని పార్క్ చేసిన భర్త ఇంట్లోకి వస్తూ .. ఈ రోజు కొత్తగా కన్పిస్తున్నావ్ ? నాకంటే ముందుగా రెడి అయ్యావ్ అని భర్త అనగానే .. ఇదంతా నీకోసమే నండీ అంటూ చేతిలోని బ్రీఫ్ కేస్ ను తీసుకుంది. భర్త కూడా త్వరగానే సిద్దపడి .. ఇద్దరు కారులో బయలుదేరారు. నియాన్ లైట్ల వెలుతురుతో .. అందంగా అలంకరించబడ్డ హోటల్లోని గదిలోకి ప్రవేశించగానే .. చప్పట్లతో ఘనమైన స్వాగతం లభించింది. వారికి కేటాయించిన టేబుల్ దగ్గర కూర్చుని .. చుట్టూ చూసే సరికి .. ఒక్కొక్క టేబుల్ దగ్గర జంటలు సంతోషంగా కన్పిస్తున్నాయి. కలర్ ఫుల్ లైట్స్ మధ్య .. మధురమైన సంగీతంతో ముగ్దులై .. డ్రింక్స్ అయిపోగానే .. కమాన్ ఫ్రెండ్స్ అంటూ ఏంకర్ నుండి ఆర్డర్ వెలువడింది. ఆ వాయిస్ ని గమనించిన భర్తలందరు లేచి .. పోడియం వైపు నడిచి కారు 'కీ' లను టేబుల్ పై పెట్టేశారు. జరుగబోయే ఆట అంతా ఏకధాటిగా మూడు ముక్కల్లో చెప్పేశాడు ఏంకర్. కమాన్ గాయ్స్ .. క్యాచ్ ఇట్ ఓన్లీ వన్ అని ఏంకర్ అనగానే .. పోడియం చుట్టూ ఉన్న పురుషులందరు .. వారి కారు 'కీ' తప్పించి ఇతరుల కారు కీ ని తీసుకున్నారు. ఈ ఆట ఏంటో అర్థం కాక భార్యలందరు టేబుల్ దగ్గర వింతగా చూస్తున్నారు. కారు కీస్ మార్చుకోవడమంటే ..పరోక్షంగా భార్యలను మార్పిడి చేసుకోవడమే ఆ ఒక్క రాత్రికి. కారు కీస్ మార్చుకున్నంత తేలికగా .. భార్యలను మార్చుకోవడం జరిగిపోయింది. కొందరి భార్యలకు నచ్చక తిరగ బడినప్పటికి .. వారు స్త్రీలు కాదా, వారు మౌనంగా భరించటం లేదా అంటూ భర్తలు వారించారు. అందరి ముందు ఎదిరించలేక, ఏమి చేయలేక ఎవరి గదులకు వారు కీస్ తో పాటు ఇంకొకరితో పడుకోవటానికి వెళ్ళిపోయారు. ఈ తంతు అంతా ఏమి తెలియని భార్యలు కష్టంగా ఒక్క రాత్రిని భరించారు. ముందే తెలిసిన భార్యలు .. మరో మగాడితో సుఖాన్ని అనుభవించారు. సాంప్రదాయ కుటుంభంలో పెరిగిన భార్యఇంటికి వచ్చాక .. అదేం పార్టీ అని నిలదీస్తే .. ఎల్లకాలం నీతోనే ఉండి బోర్ కొట్టింది .. అందుకే కొత్త రకం టేస్ట్ .. దాంట్లో తప్పేముంది .. నీవు కూడా ఎంజాయ్ చేసావు కదా అంటూ మాట దాటేశాడు భర్త. నేడు మెట్రో సిటీలుగా పేరున్న అనేక నగరాల్లో .. భార్యల మార్పిడి అనే ఈ కల్చర్ .. గుట్టు చప్పుడు కాకుండాజరుగుతూనేఉంది.దీనిని సైకాలజీ భాషలో 'Wife Swapping' అంటారు . పట్టణాల్లో సోమరులై, పని చేసి పోషించడం చేతకాక నూటికి 40% మంది భర్తలు తమ భార్యల మాన ప్రాణాలను బలిపెట్టి .. పడుపు వృత్తిలోకి దించుతూ పబ్బం గడుపుతున్నారని నివేదికలు చెబుతున్నాయి. ప్రస్తుతం పెరుగుతున్న ఈ నయా కల్చర్ ఎటు దారితీస్తుందో వేచి చూడాలి.
(9). ఎంత పేదరికంలో పెరిగినా బాల్యం కొన్నయినా బంగారు జ్ఞాపకాలను మూటకట్టుకుంటుంది. కానీ నసీమాకు బాల్యమంటేనే పీడకల. విటుల రాకపోకలు, పోలీసు దాడులతోనే గడిచి పోయింది. నిజానికి నసీమా ఆ ఇళ్ళల్లో పుట్టలేదు. ఆమెను కన్నతల్లి ఆ వాడలోని ఓ ఇంటి తల్లికి ఆ పిల్లను ఇచ్చేసి వెళ్లిపోయింది. అలా ఆ ఇంటి అమ్మాయి అయింది నసీమా. రాత్రి మంచి నిద్రలో ఉన్నపుడు పోలీసు బూట్లు, లాటీల చప్పుళ్ళకు హటాత్తుగా మెలకువ వచ్చేది. అంతే వెంటనే లేచి పక్కనే ఉన్న స్కూల్ బ్యాగ్ లోంచి ఏదో ఒక పుస్తకం తీసి గట్టిగా చదివేది .. తమ ఇల్లు సెక్స్ వర్కర్స్ ఉండే ఇల్లు కాదని నమ్మించడం కోసం. అంతా సద్దుమనిగాక తెరిచిన ఆ పుస్తకంలో మొహం దాచుకొని వెక్కి వెక్కి ఏడ్చేది. అలా ఏడ్చి ఏడ్చి ఎప్పటికో మళ్ళీ నిద్రలోకి జారుకునేది. తను నాలుగో తరగతికి వచ్చాక అనుకుంటా .. కుటుంభ నేపథ్యం గురించి భయపడడం మొదలు పెట్టింది. స్కూల్లో స్నేహితులెవరికి ఇంటి అడ్రస్స్ చెప్పొద్దని వారించేది తల్లి. అప్పటి నుంచే నలుగురిలో కూడా ఒంటరిగా ఉండడం అలవాటు చేసుకుంది నసీమా. ఎనిమిదో తరగతిలో వున్నప్పుడనుకుంటా .. పెంపుడు తల్లి రెండో పెళ్లి చేసుకొంది.నసీమాకు దిగులు ఎక్కువైంది. దాబా మీద కూర్చొని భవిషత్ గురించి బెంగపడేది. అప్పుడే చీకట్లో వెలుగు రేకలా ఆమె అమ్మమ్మ వచ్చింది. నసీమాను తీసుకొని సీతామాది (ఊరు)కి తీసుకెళ్ళింది. అక్కడే ఓ ఎంజివోలో చేరి చదువు కొనసాగించింది. అడ్డంకులను ఎదుర్కొంటూనే మొత్తం మీద పదో తరగతి పూర్తి చేసింది.
నసీమా జీవితం మలుపు తిరిగింది. ముజఫర్ రెడ్ లైట్ ఏరియలోని బంధువుల ఇంట్లో నసీమా ఉన్నపుడు పోలీస్ రైడ్ జరిగింది. ఆ రైడ్ ని లీడ్ చేసింది లేడి పోలీస్ ఆఫీసరే. ఆడవాళ్ళు, చిన్న పిల్లల్ని కూడా కొట్టుకుంటూ తీసుకెళ్ళారు మగ పోలీసులు. పట్టుకెల్లిన వాళ్ళలో తన స్నేహితులు, బంధువులు కూడా ఉన్నారు. నిజానికి వాళ్ళెవరు సెక్స్ వర్కర్స్ కాదు. సెక్స్ వర్క్ చేస్తున్న వాళ్ళు కూడా ఎక్కడినుంచో ఎవరో అమ్మేస్తే ఈ రొంపిలోకి వచ్చి పడ్డవాళ్ళు. ఆ దృశ్యం నసీమను కలిచి వేసింది. సెక్స్ ట్రాఫికింగ్ కి చెక్ పెట్టె ప్రయత్నం చేయాలనే ఆలోచనలో పడింది.(సాక్షి దిన పత్రిక సెప్టెంబర్ 23,2015)
(10) పల్లెటూరిలో పుట్టి పెరిగిన ఓ వ్యక్తి చదువులో ఎపుడు ముందంజలో ఉండేవాడు, మాస్టర్ డిగ్రీ పూర్తి చేశాడు. చూపునకు అందంగా ఉంటాడు .. చూడటానికి రమ్యంగా కనిపిస్తాడు. అంతంత మాత్రమే స్థిరపడిన కుటుంభం కాబట్టి పెళ్లి వయసు వచ్చే సరికి, అల్లారు ముద్దుగా పెరిగిన ఆయనకు, అందమైన చదువుకున్న అమ్మాయిని వెతికి ఘనంగా పెళ్లి చేశారు. ఇద్దరు చదువుకున్నవారు కావటంతో పట్టణంలో రూమ్ అద్దెకు తీసుకుని ఉద్యోగాలు మొదలు పెట్టారు. పరీక్షలు కఠినంగా ఉండటంతో కోరుకున్న ఉద్యోగం లభించలేదు. ఏదో ఒకటి అనుకొని చిన్న కంపెనీలో తగని ఉద్యోగం అయినప్పటికీ చేరిపోయాడు భర్త. భార్య ఇంటివద్దనే ఉంటున్న క్రమంలో .. పై అధికారుల ఒత్తిడిని తట్టుకోలేక .. పని ఒత్తిడి కారణంగా మధ్యలోనే మానేశాడు. ఇంటి ఖర్చులు భరించలేక ఏదైనా ఒక పని చేయాలనే ప్రయత్నం చేస్తున్న సందర్భంలో .. ఆశించిన ఉద్యోగం లభించక .. ఉన్న ఉద్యోగం ఊడిపోయి భార్యను పోషించలేక తంటాలు పడుతున్న సమయంలో .. అప్పులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తూ వ్యసనాలకు బానిసై పోయాడు. రోజంతా టైం పాస్ చేయటం, ఒకదాని తర్వాత ఒకటి సిగరెట్ కాల్చటం, సాయంకాలం అయిందంటే చాలు మందు బాబులతో కలిసి, పీకల దాకా తాగి ఇంటికి రావటం అలవాటుగా మారిపోయింది.
ఓ రాత్రి మందు బాబులతో మందు పార్టీలో కూర్చున్నపుడు, చాలా కాలంగా స్నేహితుడు, అరే మామ ..! ఆ ఉద్యోగం ఈ ఉద్యోగం అంటూ ఎన్ని రోజులు తిప్పలు పడతావురా ? నీవు ఏమనుకోనంటే .. బాగా డబ్బులు సంపాదించే మంచి ఉపాయం చెప్తా ! చేస్తావా .. అంటూ తాగిన మత్తులో అనేశాడు. ఏ ఉద్యోగం లేక బాధపడుతున్న ఇతడు .. ఎంతో ఆసక్తిగా .. చెప్పు మామ .. అంటూ మరో పెగ్గు గ్లాసులో పోసి .. జాగ్రత్తగా వింటుంటే .. ఇప్పుడున్న మంచి వ్యాపారాల్లో .. ఆడదాని అందాలను అప్పగించి .. చేసే వ్యాపారానికి మించిన వ్యాపారం .. లోకంలోనే ఏది లేదురా ! అన్నాడు. అరే చెప్పేదేదో సూటిగా చెప్పు మామ .. నన్నేమి చేయమంటావ్ అని గట్టిగా అరవటంతో .. ఏమి లేదురా .. చాలా సింపుల్ .. నీకు ఉద్యోగం లేదు, నీ భార్య ఏమి చేయట్లేదు .. ఇంత ఖరీదయిన సిటీలో బతకటం ఎలా ? నీ భార్య ఉంది చూడు .. కుందనపు బొమ్మల .. ఎంత అందంగా ఉందిరా ! ఒక్క రాత్రి నీ భార్యను ఒప్పించి .. డబ్బున్న వాళ్ళదగ్గర పడుకోబెట్టావనుకో .. ఇక జేబు నిండా డబ్బులే డబ్బులు అంటూ నవ్వటంతో .. ఇతనికి మతిపోయి .. మత్తు దిగిపోయి .. ఒక్కసారి పైకి లేచి .. కళ్ళెర్ర జేసి .. నీ భార్యనైతే అలానే చేయిస్తావురా ? అని బూతులు తిడుతూ .. కోపంతో కాళీ బాటిల్ తో తలపై కొట్టబోయాడు. స్నేహితుడు అది గమనించి .. అరె .. అరె .. ఆగు .. నేనిప్పుడు చేస్తున్న పని అదే .. ఇన్ని డబ్బులు నా దగ్గర ఎక్కడివని అనుకొంటున్నావ్ ? .. నీకు నమ్మకం లేకపోతే .. అర్ద రాత్రి అవుతుంది కదా .. మా ఇంటికి వెళ్లి చూడు .. ఏమి జరుగుతుందో నీకే అర్థమవుతుంది అంటూ చెప్పటంతో .. అదే కోపంతో బైక్ పై వెళ్లి చూసేసరికి .. అదే సంఘటన అక్కడ కన్పించింది. నమ్మాలో నమ్మకూడదో తెలియక .. మనసు అనేక సంఘర్షణలకు లోనై ఇంటికి వెళుతున్నప్పుడు .. ఫ్రెండ్ చెప్పించింది మంచి పనే అనిపించి .. పటిష్టమైన ప్రణాలికను వేసుకున్నాడు.
మరుసటి రోజు పథకం ప్రకారమే .. భార్యకు తెలియకుండానే .. ఈ రోజు మన ఇంట్లోనే ఫ్రెండ్స్ కి పార్టీ అని చెప్పి .. మాసిన డ్రెస్సులో నీవు కనబడకూడదు, మంచి సారీ కట్టుకోవాలని కౌగిలించుకున్నాడు. సాయంకాలం దాటింది .. సూర్యుడు అస్తమించాడు .. చీకటి పడింది .. పథకాన్ని అమలు చేసే పనిలో భాగంగా .. స్నేహితులకు ఫోన్ చేసి .. ఎనిమిది దాటాక రండని చెప్పి ఫోన్ పెట్టేశాడు. ఒక్కొక్కరు చేరుకున్నాక .. సోఫాలో కూర్చోమని చెప్పి .. రిమోట్ తీసుకొని టీవీలో మంచి సినిమా ఛానెల్ పెట్టి .. మందు బాటిళ్లను అందరికి అందించాడు. మధ్య మధ్యలో తినటానికి ఏదైనా తీసుక రమ్మని .. భార్యను పదే పదే పిలుస్తున్నాడు. భర్త కుట్రను కుతంత్రాన్ని ఎరుగని భార్య .. మధ్య మధ్యలో వచ్చి పోతూ ఉంటే .. నీ భార్య కేకరా ! అని ఒకడు .. పిట్ట మంచి ఊపులో ఉందని మరియొకడు అంటుంటే .. ఏమి మాట్లాడకుండా అందరితో ఆనందంగా భర్త తాగుతూ ఉంటే .. ఏమని నిందించాలో అర్థం కాక, ఏమి జరుగబోతుందో తెలియక .. మౌనంగా ఉండిపోయింది. అర్ద రాత్రి దాటింది .. అయినా పార్టీ ముగించడం లేదు .. గదిలోకి భర్త వస్తే ఏమైనా చెపుదామని .. మెలకువగా ఉండి ఎదురు చూస్తున్న భార్య అనుకుంటుండగానే .. నీకు ఇష్టమైన టీ .. తయారు చేసి తీసుకొచ్చాను అంటూ చేతికి గ్లాసు అందించాడు. ప్రేమతో తెచ్చిన భర్త మనసు కాదనలేక .. అమాంతంగా తాగేసింది భార్య. కొద్ది సేపటికి .. కళ్ళు బైర్లు కమ్మి .. కళ్ళలో గది అంతా చుట్టూ తిరుగుతుండగా .. పరుపులోకూలిపోయింది .
పథకం సక్సెస్ అంటూ .. గది నుండి బయటికి వచ్చిన భర్త .. స్నేహితులలో ఒకడిని వెళ్లి తన భార్యను అనుభవించి రమ్మని చెప్పటంతో .. ఒకడు వెళ్లి .. బట్టలూడదీసి .. మైకంలోనే ఉన్న స్నేహితుని భార్యను అనుభవిస్తున్నప్పుడు .. మైకంలో నుండి తేరుకున్న స్నేహితుని భార్య గమనించేసరికి .. వేరొక పురుషుడు తనను అనుభవించడం భరించలేక .. గట్టిగా అరవబోతుంటే .. ఎంత అరిచినా ఏమి లాభం లేదమ్మా ? నిన్ను ఊరికే నీ భర్త నాకు అప్పగించాడా ? ఒక్క రాత్రికే లక్ష రూపాయలు ఇచ్చానని అనటంతో .. కుప్ప కూలిపోయింది. పని అయిపోయాక .. ఇంకా ముగ్గురు కూడా ఉన్నారులే అంటూ గది నుండి బయటికి వచ్చాడు. చేసేదేమి లేక అందరికి శీలాన్ని .. అప్పగించాల్సిన అత్యవసర పరిస్థితి ఏర్పడింది. కట్టుకున్నవాడే కాలయముడై .. క్రూరంగా కళ్లప్పగించి కనికరం లేకుండా చూస్తుంటే .. కన్నవాళ్లకు చెప్పుకోలేక .. కన్న బిడ్డలను వదులుకోలేక .. కామాంధుల కోర్కెలను తీర్చే .. ఖరీదైన వస్తువుగా మారిపోయింది. తెలివి కలిగి, తగిన అర్హతలు ఉండి, సోమరులై ఏమి చేయలేక, సంపాదించడం చేతకాక .. సగానికి పైగా సిటీలో ఉన్న భర్తలు .. భార్యలను నాలుగు గోడల మధ్య బందిస్తూ .. ఇంటిలోనే వ్యభిచార కూపంగా మారుస్తున్నారని .. నివేదికలు చెబుతుంటే .. ఎవరిని నమ్మమంటారు, కుటుంబాల్లోని కుటిల నీతిని ఏమని వివరించమంటారు ? మరోవైపు కన్నవారే కాల నాగులై .. కన్న బిడ్డలను వ్యభిచారపు రొంపిలోకి దించుతుంటే .. కలి కాలం కాక మరేమంటారు ? అత్త మామలే అడుగడుగునా అడ్డు పడుతూ .. చేయకూడని పనులు చేయిస్తుంటే .. ఎవరిని నిందించమంటారు ? పట్టణ సంస్కృతీ పెరిగి పోయి .. పాపపు పనులు అధికారం కింద జరిగిపోతుంటే .. పాలనా వ్యవస్థను ఎలా సరిచేయమంటారు ? ఇంతటి దౌర్భాగ్యమైన కుటుంబ వ్యవస్థను చూస్తూ .. చంపాలో చావాలో తెలియక కుమిలి పోతున్న ఈ తరాన్ని ఏమని పిలవాలో అర్థం కావడం లేదు. (life o.k serial)
(11) ఓ అమ్మాయి పల్లెటూరిలో పుట్టి పెరిగింది .. సంస్కృతీ సంప్రదాయాలు కట్టు బొట్టు అంతా కూడా పద్దతిగా అలవాటు చేసుకుంది. పెద్ద చదువులు చదవటానికై .. పట్టణానికి ప్రయాణమయ్యింది. పల్లెటూరి వాతావరణానికి .. పట్టణ వాతావరణానికి పూర్తిగా భిన్నంగా ఉండటంతో .. కొన్ని రోజులు అత్యంత సంఘర్షణకు లోనైంది. భాష వేరు, వేషం వేరు .. అలవాట్లు వేరు, అనుబంధాలు వేరు. ఇవన్నీ గమనిస్తున్నపుడు నేనిక్కడ ఉండగలనో లేదో అంటూ ఓ స్నేహితురాలి దగ్గర వాపోయింది. ఇవన్నీ ఇక్కడ కామనే .. అవే అలవాటవుతాయి అంటూ భుజం తట్టి ప్రోత్సహించింది ఫ్రెండు. ఒక రోజు కాలేజీలో అందరు తన వేషాన్ని, భాషను చూసి పగలబడి నవ్వారు. అర్థం కాక అంతరంగంలో ఘర్షణతో .. దినాలు గడుపుతున్న దశలో .. నీ హెయిర్ స్టైల్ అంతా .. పాత కాలపు ముసలి వాళ్ళలా ఉంది .. మార్చుకోవాలి తప్పదంటూ .. సున్నితంగా హెచ్చరించి బ్యూటీ పార్లర్ కి తీసుకెళ్లింది స్నేహితురాలు. స్టైలిష్ గా కనిపించే సరికి .. ఇదేదో కొత్తగా బాగుందనుకుని .. రోజు అలానే కాలేజీకి వెళ్ళింది. వింతగా చూసే వారంతా .. విలువగా మాట్లాడుతుంటే .. ముసి ముసి నవ్వుకుంది. కొన్ని రోజులు గడిసాక .. జుట్టు మారింది కానీ డ్రెస్ కోడ్ మారలేదు కదా ? అందుకే అందరూ నీవైపు ఒకలా చూస్తున్నారని .. ఇది కూడా మార్చుకుంటే నీకు తిరుగే ఉండదు అంటూ .. షాపింగ్ కు తీసుకెళ్లి స్లీవ్ లెస్ వస్త్రాలను .. సూపర్ గా కన్పిస్తావని .. కావాల్సిన కాస్మొటిక్స్ కొనిచ్చింది.ఇది న్యూ ఫ్యాషన్ అని .. మారాలి అంటూ .. లేని అలవాట్లను అలవాటు చేసింది. ఇష్టం లేనప్పటికీ .. అంగాల ఆరబోతకు అనువైన బట్టలు వేసుకొని .. అలంకరణకు అనువైన మెటీరియల్స్ ధరించి .. కాలేజీ వెళ్లేసరికి .. అందరూ చుట్టూ చేరి .. వావ్ అంటూ వారితో కలిపేసుకున్నారు. అదేదో కొత్త లోకంగా .. మనసుకి గమ్మత్తుగా అన్పించేసరికి ? ఆ ప్రభావానికి పూర్తిగా లోనైపోయింది. ప్రతి రోజు రాత్రి పార్టీల పేరుతో .. పబ్ ల పేరుతో .. క్యూట్ గా తయారు కావాలని చెప్పి .. తనను పూర్తిగా నయా కల్చరుకు అలవాటు చేసింది. కానీ నయా కల్చర్ వెనుక నమ్మలేని భయంకర నిజాలున్నాయని తెలియక .. పూర్తిగా అందులో మునిగిపోయింది. స్నేహితురాలు చెప్పినట్టుగా నడుస్తూ .. తనే ప్రాణంగా భావించి పెనవేసుకుని తన చుట్టూ తిరుగుతుంది. ఒక రోజు రాత్రి పబ్ లో అమ్మాయిలూ, అబ్బాయిలు కలిసి తప్ప తాగి డాన్సు చేస్తుంటే .. అందరితో కలిసిపోయి .. అరమరికలు లేకుండా .. ఆటలు ఆడుతుంటే .. అందులోని ఓ మనిషికి .. అతని మృగతత్వం మేల్కొని .. రంగు లైట్ల మధ్య రమ్యంగా వెలిగి పోతున్న ఆ అమ్మాయిని .. ఎలాగైనా ఓ రాత్రి అనుభవించాలనే తలంపు కల్గింది.
ఆస్తి కల్గిన కుటుంభంలో పుట్టడంతో .. అమ్మ నాన్నలు అధికారులు కావడంతో .. అడ్డు అదుపు లేకుండా ఆటగా జీవిస్తున్న అతను .. అమ్మాయి యొక్క వివరాలను కనుక్కొని .. ఎక్కడుంటుందో తెలుసుకొని .. ఇష్టా అయిష్టాలను తెలుసుకొని .. మంచి ఫ్రెండ్ గా పరిచయమయ్యాడు. పార్కులు, పబ్ ల చుట్టూ తిప్పుతూ .. పెద్ద పెద్ద హోటల్ లో విందులను ఏర్పాటు చేసి ఆనందంలో ముంచెత్తాడు. బర్త్ డే రోజు లేకున్నా .. ఓ రోజు బర్త్ డే అని .. పార్టీకి ఖచ్చితంగా రావాలని ఆహ్వానించి .. గర్ల్ ఫ్రెండ్స్ కూడా వస్తున్నారని నమ్మించి .. ఫ్రెండ్స్ తో పథకాన్ని రచించి అన్ని ఏర్పాట్లు చేసాడు. గడియారం గిర్రునా తిరిగింది .. రాత్రి అయ్యే సరికి ఒక్కొక్కరు పార్టీకి చేరుకుంటున్నారు. తాను, తన ఫ్రెండు మరియు అయిదుగురు అబ్బాయిలు కలిసి కార్య క్రమంలో పాల్గొన్నారు. ఇంకా గర్ల్ ఫ్రెండ్స్ ఎక్కడా అనగానే .. వాళ్ళు బిజిగా ఉన్నట్టున్నారు .. నీ క్లోస్ ఫ్రెండ్ వచ్చిందిగా .. ఎందుకు దిగులు అంటూ చిన్నగా నవ్వాడు. బర్త్ డే కార్యక్రమం ముగిసింది .. డిన్నర్ చేసి .. డ్రింక్స్ తీసుకుంటున్న సమయంలో .. తనకిచ్చిన పెప్సిలో మత్తు మందు కలిపి .. మూర్ఛపోయేలా చేశాడు. సహకరించిన గర్ల్ ఫ్రెండ్ కి కొంత సొమ్ము ముట్టజెప్పి .. వెళ్లిపొమ్మని సైగ చేశాడు. అమ్మాయిని ఎత్తుకొని .. హాల్ నుండి గదిలోకి తీసుకొని వెళ్ళి .. పరుపై పడుకోబెట్టి .. ఒక్కొక్కరు .. ఇష్టం వచ్చినట్లుగా అనుభవించారు. తనకు ఏ పాపం తెలియని పల్లెటూరి అమ్మాయి .. ఫ్రెండ్ పేరుతో చేసిన పనికి మెచ్చుకోవాలో .. మృగాలా చేతికి అప్పగించిందని తిట్టుకోవాలో అర్థం కాక .. గది గోడలలోనే బందీగా మారి .. కన్నవారికి కనుమరుగై .. కామాంధుల చేతిలో చచ్చి పోయింది. కూతురికి ఏమి జరిగిందో తెలియక .. ఎక్కడ తమ కూతురు దొరుకుతుందో అర్థం కాక .. సంబధీకుల చుట్టూ .. స్టేషన్ ల చుట్టూ తిరిగి తిరిగి, క్షణ క్షణం కుమిలి పోయి కాటికి చేరువయ్యారు తలిదండ్రులు. ఇలాంటి సంఘటనలు వింటున్నప్పుడు .. జరిగిన ధారుణాలను పత్రికల్లో చదువుతున్నపుడు .. ప్రేమ పేరుతో, ఫ్రెండ్ షిప్ పేరుతో .. అమ్మాయిల జీవితాలకు అడ్రస్ లేకుండా పోతుందని అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. (life o.k serial)
(12) హైదరాబాద్ లో పర్యాటక ప్రాంతాలను చూసేందుకు కోల్ కతా నుంచి వచ్చిన యువతీ(19) పట్ల నలుగురు దారుణంగా ప్రవర్తించారు. మాయమాటలతో నమ్మించి, గదిలో బందించి మరీ అత్యాచారం చేశారు. ప్రధాన నిందితుడు ప్రీత్ సెర్గిల్(39) ను అరెస్టుతో గోరం వచ్చింది. ఇన్ స్పెక్టర్ ఉమా మహేశ్వర రావ్ కథనం మేరకు ... హైదరాబాద్ లో పర్యటించేందుకు గాను కోల్ కతా కు చెందిన, బీకామ్ చదువుతున్న యువతి ఫిభ్రవరి 14 న శంషాబాద్ విమానాశ్రయానికి వచ్చింది. తాను బస చేయబోయే హోటల్ కు షేరింగ్ క్యాబ్ లో బయలుదేరింది. యువతి నగర పర్యటనకు వచ్చినట్టు తెలుసుకున్న తోటి ప్రయాణికురాలు పింకీ రాయ్ ఆమెతో మాటలు కల్పింది. తెలిసిన స్నేహితుడి కారు ఉందని, అందులో పర్యాటనకు వెళదామని నమ్మించింది. మరుసటి రోజు ఇద్దరు అమీర్ పేట్ లోని హోటల్ లో కలుసుకున్నారు. తర్వాత పింకీ నృత్య దర్శకుడు, ఈవెంట్ మేనేజర్ ప్రీత్ షెర్గిల్ కు ఫోన్ చేసి అక్కడికి రప్పించింది. అనంతరం ప్రీత్ కారులో ముగ్గురు బయలుదేరారు. ప్రీత్ సూచనలతో పింకీ మార్గ మధ్యలో దిగేయగా .. ఆయన యువతిని వెస్ట్ మారేడ్ పల్లీ, కృష్ణ పుర కాలనీ లోని మిష్ మాన్షన్ అపార్ట్ మెంట్ కు తీసుకెళ్లాడు. శీతల పానీయంలో మత్తు మందు కలిపి ఇచ్చాడు. మత్తులోనే యువతి ఇంట్లోంచి బయటికి వెళ్లే ప్రయత్నం చేయగా .. బెదిరించి మరీ అత్యాచారం చేసాడు. ఇంటికి తాళం వేసి వెళ్లిపోయాడు.
ఫిబ్రవరీ 16 న ఉదయం ఇంటికొచ్చిన ప్రీత్ కారు డ్రైవర్ సుల్తాన్ అలియాస్ నీరజ్, సాయంత్రం ఇంటికొచ్చిన ప్రీత్ స్నేహితులిద్దరిలో ఒకరు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. తర్వాత రోజు కూడా ప్రీత్ అతని డ్రైవర్ యువతిని బలాత్కరించారు. అనంతరం ఆమెను వివస్త్రను చేసి కుర్చీలో కట్టేసి ఫోటోలు వీడియోలు తీశారు. స్నేహితులకు వీడియో కాల్స్ చేసి ఇంటికి తాళం వేసి వెళ్లిపోయారు. వాళ్ళు బయటికి వెళ్లిన అనంతరం ఆ యువతి ఓ కాగితంపై "అయామ్ ఇన్ ట్రబుల్ " అంటూ చీటీ రాసి కిటికీలోంచి విసిరేసింది. ఎవరు రాకపోవడంతో .. కష్టం మీద కట్లు విప్పుకుని ఇంట్లోంచి బయట పడింది. కోల్ కత్తా వెళ్లే సమయంలో శంషాబాద్ విమానాశ్రయంలో ఫిర్యాదు చేసింది. బాధితురాలు పారిపోవడం "అయామ్ ఇన్ ట్రబుల్ " అంటూ ఆమె రాసి విసిరేసిన కాగితం ఇంటి పోర్టికోలో పది ఉండటాన్ని తర్వాత గుర్తించిన నిందితులు .. పోలీసులకు సమాచారం అందిందేమో నన్న అనుమానంతో అప్పట్నుంచి పరారీలో ఉన్నారు.(బెంగాలీ యువతిపై కిరాతకం .. ఈనాడు దినపత్రిక ఏప్రిల్ 30,2017 పేజీ 1 )
(13) ఇది ముంబైకే సంబందించిన ప్రత్యేకమైన విషయం. అది దాని కస్టమర్లు ఏమాత్రం డ్యాన్సు చేయనటువంటి డ్యాన్స్ బార్. అది తాగుబోతు మహిళలు సైతం రావడానికి ఇష్టపడని లేడీస్ బార్. అలాగని అనేక మధ్య శ్రేణి ధరలతో కూడిన బార్ల కంటే అధిక దరల వద్ద లిక్కరును అమ్మే ప్రత్యేకమైన విక్రయ కేంద్రం కూడా కాదు. అసలు విషయం ఏమిటంటే అమ్మాయిలు డ్యాన్సు ఫ్లోర్ ను ఆక్రమించి డ్యాన్స్ చేస్తుంటే కస్టమర్లు వారి వచ్చి కరెన్సీ నోట్లను వారిపై విసురుతుంటారు. అక్కడున్న డ్యాన్సర్లలో ఒకరు ఏ కస్టమర్ సీటు వద్దకైనా రావడానికి ఇష్టపడితే, అతడు ఆమెను పక్కన కూర్చుండ బెట్టుకుంటాడు.
చాలా కాలం క్రితం మధుర్ భండార్కర్ తీసిన చాందిని బార్ సినిమాలో ఈ డ్యాన్స్ బార్ల పనితీరును దాదాపుగా మీరు చూసి ఉంటారు. అనేక ఒత్తిళ్ల కారణంగా అలాంటి బార్లలోనే మగ్గుతున్న నిస్సహాయ బాలికలు, డ్యాన్స్ నుంచి నిశ్శబదంగా వారు వ్యభిచారంలోకి జారిపోవడం, ఒక్కోసారి వాళ్ళే ఆ బార్ల యజమానులుగా మారటం మనందరికీ తెలిసిన విషయమే. ఒక్కసారిగా వీటిని నిషేధించడంతో వాటిపై ఆధారపడి బతుకుతున్న లక్షమందికి పైగా వీదిన పడ్డారు. దీంతో పరిస్థితి ఇంకా దిగజారిపోయింది.(సాక్షి దినపత్రిక అక్టోబర్ 19, 2015)
(14) ప్రపంచంలో భారత దేశం సంస్కృతి సంప్రదాయాలకు పుట్టినిల్లుగా ప్రసిద్ధి గాంచింది. ఆచారం వికృత రూపం దాల్చి సమాజం పై చెడు ప్రభావం చూపినపుడు అది ఆచారంగా సాంఘిక దురాచారంగా మారింది. ఘన చరిత్ర కల్గిన భారత భూమిలో ఒక చీకటి అధ్యాయం చోటు చేసుకుంది. పెళ్లిని పవిత్రంగా భావించే ఈ దేశంలో ఆచారాల పేరిట ఆకృత్యాలు అలవాటుగా మారిపోయాయి. పెళ్ళిని రెండు జీవితాల కలయికగా .. దైవ నిర్ణయంగా చూసే భరత భూమిలో .. ఊరందరికీ ఉంపుడు గత్తెగా మార్చే హైందవ ఆచారం అత్యంత హీనమైనది. నాకు ఊహ తెలిసే నాటికి ఊర్లలో ఒక ఆచారం ఉండేది. ఇప్పటికి అక్కడక్కడా పల్లెటూళ్లలో ఈ ఆచారం కన్పిస్తుంది. ముక్యంగా అగ్ర కులానికి చెందిన మనుషులు, అణగారిన కులానికి చెందిన అందమైన అమ్మాయిలను అనుభవించాలనే తపనతో, దైవంతో ముడి వేసి జోగినిగా మార్చి .. ఊరందరి సొత్తుగా భార్యగా ముద్ర వేసేవారు. ఒక వ్యక్తిని పెళ్ళి చేసుకుని గౌరవ ప్రదమైన జీవితం లేకుండా అందరూ అనుభవించటానికే ఆచారం పేరిట అడ్డు కట్ట వేశారు. దేవునికి దేవుని ఆలయానికి ఆడపిల్లను అంకితమిచ్చే ఈ దురాచారం హైందవ మతంలోనే ఉందని ఒప్పుకోక తప్పదు. భర్త చనిపోయాక భార్యకు చేసే వితంతు కార్యక్రమం కూడా పరోక్షంగా ఇలాంటిదే. ఆచారం పేరిట సాగే ఈ సాంఘిక దురాచారం వ్యభిచారానికి లైసెన్సు లాంటిదని చెప్పుకోక తప్పదు. ఈ తంతును ప్రాంతాలను బట్టి దేవ దాసిగా, జోగినిగా మాతమ్మగా పిలుస్తుంటారు. ఈ రకంగా చేసిన దేవదాసిని, ఊళ్లోని పెద్దలందరి శరీర కోరికలు తీర్చి, పెళ్ళి కాకుండానే తల్లులై, కన్న పిల్లలకు మాత్రం తండ్రి ఎవరో చెప్పలేక నరకయాతన పడుతూ బతుకులు చాలిస్తుంటారు. ఈ సమాజం వ్యభిచారాన్ని అపచారంగా చూపాల్సింది పోయి అధికారిక వ్యభిచారంగా మార్చి అనేక గ్రామాల్లో నేటికీ అమలు చేస్తుంటే అభివృద్ధి చెందిన దేశమని ఎలా చెప్పమంటారు. వ్యభిచారానికి మరో రూపమని చెప్పకుండా ఎలా ఉండమంటారు. ?!
(15) సైబరాబాద్ లోని ఐటీ సెక్టార్లో హైటెక్ వ్యభిచార దందా జోరుగా సాగుతుంది. స్పా, మసాజ్ సెంటర్ ముసుగులో నిర్వాహకులు వ్యవస్తీకృతంగా ఈ వ్యవహారాలు నడుపుతున్నారు. దీని కోసం థాయిలాండ్ తో పాటు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి యువతులని అక్రమ రవాణా చేస్తూన్నారు. ఈ వ్యవహారంపై సమాచారం అందుకున్న సైబరాబాద్ పోలీసులు ఆదివారం వరుస దాడులు చేశారు. మాదాపూర్, రాయదుర్గం, గచ్చిబౌలి ఠాణాల పరిధిలో ఉన్న 12 స్పా, మసాజ్ సెంటర్ల పై ఈ దాడులు జరిగినట్లు కమీషనర్ సందీప్ శాండిల్య తెలిపారు. 34 మంది థాయ్, 21 మంది ఈశాన్య రాష్ట్రాలు, ఒక పంజాబ్, నగరానికి చెందిన 9 మంది తో కలిసి మొత్తం 65 మంది యువతులను విడిపించామన్నారు.
ఇలా ఉద్యోగం కోసం ఇక్కడకు వచ్చే థాయిలాండ్ తో పాటు ఈశాన్య రాష్ట్రాలు, దేశంలోని వివిధ ప్రాంతాలు నగరానికి చెందిన యువతుల్ని సిద్దార్థ్ వివిధ ప్రాంతాల్లో ఉంచుతున్నాడు. ప్రాథమికంగా విదేశీయుల నుంచి పాస్ పోర్టులు తీసుకుని తమ ఆదీనంలో ఉంచుకుంటున్నాడు. ఆపై తాను నిర్వహించే స్పా, మసాజ్ సెంటర్లకు వీరిని తరలించి బలవంతంగా వ్యభిచారం చేయిస్తున్నాడు. సెంటర్లకు వెనుక భాగంలో కొన్ని రహస్య గదులు ఏర్పాటు చేశాడు. ఇతడికి మాదాపూర్, బంజారా హిల్స్, బెంగుళూరులోను స్పాలున్నాయి. ఈ వ్యవహారాల్లో సిద్దార్థ్ కి సర్ఫరోజ్ అలీ, వినయ్, అజయ్ తదితరులు సహకరిస్తున్నారు. వెంకటరెడ్డి, బాలసుబ్రమణ్యం ప్రధాన భాగస్వాములు. ఈ దందాలో సిద్దార్థ్ ప్రతి నెల 90 లక్షల వరకు సంపాదిస్తున్నాడని పోలీసులు గుర్తించారు.(సాక్షి దిన పత్రిక ఆగస్టు 21, 2017)
(16) అరబ్బుల దాష్టికాలకు పాత బస్తీ అమ్మాయిలు బలవుతున్నారు. ఎడారి దేశం నుండి వచ్చిన వాలుతున్న కామాంధులు మైనర్లను కూడా పెళ్లి చేసుకొని వారి గొంతు కోస్తున్నారు. తల్లిదండ్రులకు లక్షల్లో డబ్బు ఆశ చూపి అమ్మాయిలను పెళ్లి చేసుకోవడం, తర్వాత వారి దేశం తీసుకెళ్లడం కామ వాంఛ తీరిన తర్వాత నరకం చూపిస్తుండటంతో భాదితులు గగ్గోలు పెడుతున్నారు. షేక్ కుటుంబీకులు కూడా లైంగిక దాడులకు పాల్పడుతుండటంతో దేశం కాని దేశంలో అత్యంత దుర్భర జీవితం గడుపుతున్నారు. తాజాగా ఇలాంటి సంఘటనే వెలుగు చూసింది. తొమ్మిదో తరగతి చదువుతున్న ఓ మైనర్ అమ్మాయిని ఆమె మేనత్తే ఒమాన్ కు చెందిన 76 ఏళ్ల అరబ్ షేక్ కు కట్టబెట్టింది. పెళ్లి తర్వాత ఒమాన్ కు వెళ్లిన అమ్మాయి తన దారుణ పరిస్థితిని తల్లిదండ్రులకు ఫోన్లో తెలిపింది. ఈ నరకం నుంచి తనను కాపాడకుంటే విషం తాగి చస్తానని విలపించింది. దీంతో తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. దక్షిణ మండలం డీసీపీ కార్యాలయంలో డీసీపీ సత్యనారాయణ, అదనపు డీసీపీ బాబురావులు గురువారం ఈ వివరాలు వెల్లడించారు.
ఫలక్ నూమా పరిధిలోని నవాబ్ సాల్ కుంటా ప్రాంతానికి చెందిన అఫ్జల్ బేగం అలియాస్ సైదున్నీసా, అఫ్సర్ ల దంపతులు. వీరికి ఇద్దరు సంతానం. పెద్ద అమ్మాయి తొమ్మిదో తరగతి చదువుతుంది. తమ ఆర్ధిక పరిస్థితులు బాగా లేకపోవడంతో తమ అమ్మాయిని పట్టేపల్లిలో ఉంటున్న చెల్లి గోసియా ఇంట్లో ఉంచి చదివిస్తున్నారు. గోసియా కద్దామా(సేవకురాలు) విషమా పై వెళ్లి ఒమాన్‌లో నివసిస్తుంది. ఈమె ఒమాన్ షేక లకు ఇక్కడి అమ్మాయిలతో పెళ్లిళ్లు చేయిస్తుంది. ఇటీవల ఆ దేశం నుంచి వచ్చిన 76 ఏళ్ల షేక్ కు అయిదుగురు అమ్మాయిలను చూపింది. అతడికి ఎవరు నచ్చక పోవడంతో గౌసియా దృష్టి తన ఇంట్లో ఉంటున్న అన్న కూతురిపై పడింది. ఒమాన్ షేక్ తో అమ్మాయి పెళ్లి చేయిస్తే అయిదు లక్షలు వస్తాయని, పేదరికం పోతుందని ఆమె తల్లిదండ్రులకు చెప్పింది. అమ్మాయి కూడా విలాస వంతమైన జీవితం గడుపుతుందని మాయమాటలు చెప్పి ఒప్పించింది. రంజాన్ మాసంలో వివాహం చేయించింది.
పెళ్లయి నాలుగు రోజులు తర్వాత షేక్ ఒమాన్ వెళ్ళాడు. గత నెలలో గౌసియా .. తన మేన కోడల్ని ఒమాన్ తీసుకెళ్లింది. అక్కడికి వెళ్ళాక ఆమెకు నరకం చూపిస్తున్నారు. పెళ్లాడిన వృద్ధ షేక్ జాడలేదు. తీసుకెళ్లిన మేనత్త ఆచూకీ లేదు. షేక్ కొడుకులు, మనవళ్లు లైంగిక దాడికి పాల్పడుతున్నారు. చివరికి తనకు అన్నం కూడా పెట్టడం లేదంటూ ఆమె కన్నీళ్లు పెట్టుకుంటూ తల్లికి ఫోన్ చేసింది. తనను ఇక్కడి నుంచి విడిపించకుంటే విషం తాగి చచ్చిపోతానని చెప్పింది.(ఈనాడు దినపత్రిక ఆగష్టు 18, 2017)
"న్యూయార్క్ లో పుట్టి .. కంప్యూటర్ మేధావిగా ఎదిగి .. టైం మాగజైన్ సర్వేలో అత్యంత ప్రభావశీలమైన వ్యక్తిగా గుర్తించబడి .. ఫేస్ బుక్ అధినేతగా అందరికి పరిచయమై .. కూతురు పుట్టిన సందర్బముగా మూడు లక్షల కోట్లు దానం చేసిన ఘనుడు జూకర్ బెర్గ్. అంతర్జాలంతో అనుసంధానమై .. అంతరాలను తగ్గించి .. భావాలకు వేదికగా .. భూత, భవిష్యత్ కాలానికి వారధిగా .. ఈ తరం ప్రజల మనసును దోచుకున్న సోషల్ సైట్ ఫేస్ బుక్ అనటం అతిశయోక్తి కాదేమో? .. గూగుల్ తర్వాత స్తానాన్ని ఆక్రమించి .. అనేకులను ఆకర్షించిన తీరు గమనిస్తుంటే ఆశ్చర్యమేస్తుంది. నా సొంత పేరుతో (srinivas bopparam)ఫేస్ బుక్ లో కాత తెరచి అనేక సామాజిక , తాత్విక , మతపరమైన అంశాలను .. అనుబంధాలను కలిగి .. అనేకులకు ఒక్కసారే పంచుకుంటూ .. సమాజాన్ని బాగు చేయాలన్న తలంపుతో ముందుకు సాగుతున్నపుడు .. Telugu ammaye అనే ఫేస్ బుక్ ఐడిలో ఒక పోస్ట్ నా కాతలోకి చేరింది. వాటిలోని ఆర్ద్రతను , చుట్టూ సమాజంలో జరుగుతున్న దారుణాలను గమనించినపుడు .. యధాతధంగా మీముందుంచి .. మీ కళ్ళు తెరిపించాలనే మనస్సుతో కొనసాగిస్తున్నాను.
"ఆడదాని రక్త మాంసాలే ఈ మదమెక్కిన క్రూర జంతువుల(పురుషుల) కామానికి ఆహారం. ఆడది ఈ భూమ్మీద ఎందుకు పుట్టిందో తెలియని వింత పరిస్థితి. పుట్టింది మొదలుకొని పుష్పవతి అయినపుడు కలిగే నొప్పి , పెళ్ళయ్యాక మగాడికి మొదటి రాత్రి తను నొప్పితో భాద పడుతూ ఇచ్చే సుఖం , గర్భవతి అయినాక తను కడుపు చించి తను నొప్పిని బరించి మగాడికి జీవంపోస్తూ , బిడ్డగా ఎదుగుతున్నప్పుడు తన చమట తీసి కస్టపడి తను పస్తువుండి నీకు అన్నం పెడుతుంది. నీకేదైనా జరిగితే తను విలవిలాదిపోతుంది ఆఖరికి చచ్చే వరకు తన శరీరంతో మగాడికి ప్రతి క్షణం శారీరకంగా , మానసికంగా సంతోషానిస్తూ తను ప్రతి క్షణం నలిగి పోతు కుమిలిపోతూ కరిగిపోతు భాదల్ని తనలోనే మింగేసుకుంటూ ఎందుకు జీవిస్తుందో కూడా తెలియని పరిస్థితి. పుట్టుకతో స్త్రీ కాస్త బలహీనంగా ఉండటం ఆసరా గా చేసుకుని క్రూరుడు తనని ఒక బానిసలాగా తన అవసరాలు తీర్చే ఒక యంత్రం లాగా ఆడది తనకి సేవలు చేయటానికే పుట్టినట్టు బావించి తనని వంటింట్లోకి మాత్రమే పరిమితం చేసేసాడు.
ఆడది ఒక వ్యాపార వస్తువు అయిపొయింది... సినిమాలో ఆడదాన్ని శరీరాన్ని చూపియకపోతే సినిమా విజయం సాదించదు. అందాల పోటీల్లో స్త్రీ అందాల్ని ఆరబోయకపోతే వ్యాపారం జరగదు. ఎటు చుసిన ఆడది లేకపోతె మృగాడికి మనుగడ లేదు. సహజంగా రతి క్రీడలో స్త్రీ యోని మరియు మగవారి అంగం మాత్రమే పరిమితం కాని మితిమీరిన విసృన్కలత్వం మృగాడి దురాశకి చిన్న పెద్ద ముసలి ముతక అని తేడ లేకండా మృగాడి మధానికి స్త్రీ శరీరం నిలు వెల్ల అణువణువును క్రూరుడి కామకోరికలకి ఉపయోగించుకుంటున్నాడు ..తన అంగాన్ని ఆసనం లో దూర్చి తను నొప్పితో ఒకవైపు భాదపడుతుంటే మృగాడు క్రూరంగా రాక్షసంగా తన మీద పడి ఎదో చేస్తుంటాడు. తుప్పు పట్టిన కంపు కొట్టే అంగాల్ని ఎ అర్ధరాత్రో తాగేసి వచ్చి నోట్లో వుంచి చుమ్బించమని బలవంతం చేస్తారు. ఇలా మృగాడి స్వార్థానికి నిలువెల్లా మనసుని చంపుకుని ఇష్టం లేకున్నా ఆడది చచ్చి మృగాడికి సుఖాన్ని ఇస్తుంది.... చిన్న పిల్లల్ని ముసలివారిని సైతం వదలరు ఈ మృగ కామ పిసాచులు. తెలిసి తెలియని ఆ చిన్న పిల్లల్ని మాయ మాటలు చెప్పో లేక బలవంతగానో వారి ఆసనం లో అంగాన్ని దూర్చి సెక్స్ చేస్తుంటారు. ఎటు చూసిన ఏమి చేసిన ఆఖరికి ఆడాదానికే శిక్ష అన్నట్టు ఇలా మృగాడు చేసే వెర్రి చేష్టలకి జబ్బులు బారిన పడి ఎవరికీ చెప్పుకోలేక లోలోపలే భాదపడే స్త్రీలు ఎంతమందో వున్నారు ఈ దేశంలో...? సహజం కాని పద్దతులలో సెక్స్ చేయాలని స్త్రీలని బలవంతం చేసి వారి నోటిలో , వారికి ఉన్న అన్ని రంధ్రాలలో అంగాల్ని దూర్చి సంతోషించే క్రూరమైన మృగజాతి...స్త్రీలు పైకి చెప్పుకోలేక కట్టుకున్నవాడో, ప్రేమించిన వాడో, లేక వేశ్యతో పడుకోవటానికి వచ్చిన వాడో చేయమమన్నదల్లా చేస్తూ మనసు చంపుకుని వారికంటూ ఎలాంటి కోరికలు లేకుండా జీవచ్చవంలా జీవిస్తున్న అభాగ్యులు ఎందరో ఈ ప్రపంచంలో...???? ఆడదంటే సుఖానిచ్చే ఒక యంత్రం . కావలసినప్పుడు వాడుకోవచ్చు మిగతా అప్పుడు సేవలు చేయించుకోవచ్చు . మృగాడి దాస్తికానికి బలయిపోయి ఇలాంటి వికృత చేష్టల వల్ల లేని పోనీ జబ్బులు వచ్చి ఆఖరుకి చచ్చేది కూడా స్త్రీలే.,,,!!!"
"మిగతా దేశంలో కంటే మన దేశంలో, అలాగే మన తెలుగు రాష్ట్రాల్లో అమ్మాయిల అక్రమ రవాణా ఎక్కువ జరుగుతుంది. ప్రపంచ వ్యాప్తంగా ఏటా 30 లక్షల మంది అమ్మాయిలూ అమ్ముడవుతున్నారు. ఒకప్పటి కంటే పరిస్థితి మరీ దిగజారింది. ఐదేళ్ళ అమ్మాయిలతోను వాంచలు తీర్చుకునే పరిస్థితి దాపురించింది. గోవా ముంబాయి వంటి చోట్లా పదేళ్ళ లోపు ఆడ పిల్లల్ని వేలం పెట్టి మరీ అమ్మేస్తున్నారు. ఒకప్పుడు పేద వర్గాలకు చెందిన అమ్మాయిలనే ఈ కూపంలోకి దింపేవారు. ఇప్పుడు సోషల్ మీడియా, చాటింగ్ లతో వల వేసి, అక్రమంగా తరలిస్తున్నారు. మనం అమ్మాయిల్ని రవాణా చేసే వాళ్ళనే కాదు .. కోరుకునే వాళ్ళని నియంత్రించాలి. స్వీడన్లో అమ్మకానికి అమ్మాయిలున్నా .. కొనుక్కోవడానికి ఎవరు ధైర్యం చేయరు. ఎందుకంటే అక్కడ వ్యభిచారం చేస్తూ పట్టుబడితే విటుల ఫోటోలను పత్రికల్లో ప్రచురిస్తారు. వాళ్ళ గురించి కథనాలు రాస్తారు. మన దగ్గర పట్టుబడిన మగవాళ్ళ గురించి అసలే మాట్లాడరు. మహిళల్ని అరెస్టు చేస్తారు .. ఫోటోలు కూడా బయటికి వస్తాయి. ఇలాంటి వివరాలు తెలియజేస్తూ .. వంచనకు గురి కాకుండా కాచుకునే మార్గాలను తెలియజేసేందుకే మేము స్వరక్ష కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం.(ఈనాడు దిన పత్రిక..జనవరి 07,2016)
(2) యువతులను వ్యభిచార కూపంలోకి దింపే ముటాలు రాష్ట్రంలో పదుల సంఖ్యలో ఉన్నాయి. ఈ ముఠాల సభ్యులు రెండు తెలుగు రాష్టాలలోని గ్రామీణ ప్రాంతాల్లో పర్యటిస్తూ ఉపాధి కల్పిస్తామని మాయ మాటలు చెబుతూ అమాయక యువతులపై వల విసురుతున్నారు. భాదితుల పేదరికాన్ని తమ అక్రమ వ్యాపారానికి వనరుగా మార్చుకుంటున్నారు. ఇలాంటి జాడలేకుండా పోతున్న కేసులు కరువు భారిన పడ్డ అనంతపురం తదితర రాయలసీమ జిల్లాల్లో ఎక్కువగా ఉంటున్నాయి. ఒక్కసారి వీరి బారిన పడ్డ తర్వాత ఆ నరక కూపం నుంచి యువతులు బయటపడటం కష్టం. పూనే ముంబాయి దిల్లీ వంటి చోట్ల వ్యభిచార గృహాలకు వీరిని అమ్మివేస్తున్నారు. భాదితుల తల్లిదండ్రులు స్తానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తున్నా పెద్దగా ఎవరూ పట్టించుకోవడం లేదు. ప్రేమ వ్యవహారాల కారణంగా తమ ఇష్ట ప్రకారమే వెళ్ళిపోయి ఉంటారని భావిస్తున్న పోలీసులు వీరిగురించి వెతికేందుకు ప్రయత్నించడం లేదు. చిన్న చిన్న పిల్లల్ని అపహరించి వ్యభిచార గృహాలకు అమ్ముతున్న ముఠా ఇటీవల సికింద్రాబాద్ రైల్వే పోలీసులకు చిక్కిన ఘటన పరిస్థితి తీవ్రతకు అద్దంపడుతోంది. తల్లితోపాటు మార్కెట్ కు వచ్చిన ఎనిమిదేళ్ళ బాలికను మరో మహిళ ఎత్తుకెళ్ళి యాదగిరి గుట్టలోని వ్యభిచార గృహానికి అమ్మేసింది. ఆ గృహం నిర్వాహకులు ఇటువంటి పిల్లల్ని పంచి పెద్దచేసి ఆ తర్వాత వ్యభిచార కూపంలోకి దింపుతున్నారు. ఈ ఘటనలో అతికష్టం మీద పోలీసులు ఆ బాలికను కాపాడగలిగారు. పదేళ్ళు కూడా లేని చిన్న పిల్లల్ని అపహరించి వ్యభిచార గృహాలకు అమ్మే ముఠాలు తయారయ్యాయంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. జార్కండ్ పోలీసులు ఇటివల కొత్త విషయం వెల్లడించారు. తమ రాష్ట్రం నుంచి జాడలేకుండా పోతున్న యువతులలో చాలామందిని దేశంలో వేగంగా విస్తరిస్తున్న నీలిచిత్ర పరిశ్రమ వైపు మల్లిస్తున్నారని చెప్పారు. ఇదొక కొత్త ప్రమాదం.
(నరక కూపంలోకి యువతులు .. ఈనాడు దిన పత్రిక ఫిబ్రవరి 24,2016)
(3) అనేక మంది అమ్మాయిలు విధి వంచితులై అనాధ ఆశ్రమాల్లో చేరుతున్న బాలికల్లో వేలాది మంది ఆచూకి లేదు. కొందరు స్వార్థపరులైన అనాధ ఆశ్రమ నిర్వాహకులు బాలికలను వ్యభిచార రొంపిలోకి దింపుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. మరికొందరు వారి పనుల కోసం పలుకుబడి కల్గిన రాజకీయ నేతలు, ఉన్నత అధికారుల దగ్గరకు అనాధ బాలికలను పంపుతున్నారు. ఇటివల తెలంగాణ సి.ఐ.డి పోలీసులు పూణేలో వ్యభిచార కేంద్రాలపై దాడి చేసినపుడు దొరికిన అమ్మాయిల్లో అత్యదికులు బలవంతంగా ఆ రొంపిలోకి దిగినవారే. వారిలో అత్యదికులు అనాధ బాలికలే. 2011లో ఉమ్మడి రాష్ట్ర పోలీసులు డిల్లీలో వ్యభిచార గృహాలపై దాడులు నిర్వహించినపుడు దొరికిన వంద మంది మహిలల్లోను 43 మంది అనాధ ఆశ్రమాల నుంచి వ్యభిచార గృహాలకు తరలించ బడ్డవారే. "పూనే,ముంబై,కోల్ కతా,డిల్లీలలోని వ్యభిచార గృహాలలో మగ్గుతున్న తెలుగు వారిలో అత్యధికులు అనాధ బాలికలే. ఓ స్వచ్చంద సంస్థ సహకారంతో దాదాపు 540 మందిని ఆ కూపం నుంచి బయటకు తీసుక వచ్చాం. వారు వ్యభిచార కేంద్రాలకు ఎలా చేరుకుంది తెలుసుకుని, భాధ్యులైన 63 మందిపై కేసులు నమోదు చేశాం. అందులో అరడజను మంది వ్యభిచార నిర్వాహకులు ఉన్నారు". అని సీనియర్ పోలీసు అధికారి ఒకరు వెల్లడించారు.
అనాధ ఆశ్రమాల ముసుగులో నిర్వాహకులు బాల బాలికల శ్రమను దోపిడి చేస్తున్నారని కేంద్రానికి అందిన నివేదిక స్పష్టం చేసింది. బాలికలను లైంగిక దోపిడి చేస్తున్నారని, వ్యభిచార గృహాలకు అమ్మేస్తున్నారని వెల్లడించింది. అదే సంవత్సరం కేంద్ర ప్రభుత్వం ... మహారాష్ట్ర,ఆంద్రప్రదేశ్,మధ్య ప్రదేశ్,పశ్చిమ బెంగాల్,తమిళనాడు డిల్లీలోను 63 అనాధ ఆశ్రమాల పై వేటు వేసింది. వాటిలోని బాల బాలికలను ప్రభుత్వ రంగంలోని ఆశ్రమాలు, కార్పోరేట్ సంస్థల ఆధీనంలోని శరనలయాలకు తరలించాలని ఆదేశించింది. కాని ఆ ఆదేశాలు క్షేత్ర స్తాయిలో అమలుకు నోచుకోలేదు. ఏ.పీ లో 11 అనాధ ఆశ్రమాలకు సంబంధించి వచ్చిన ఆరోపణలు అవాస్తావమని అప్పటి పార్లమెంట్ సభ్యుడొకరు కేంద్ర హొమ్ శాఖకు లేఖ కూడా రాశారు. తనతో పాటు మరికొందరు పార్లమెంట్ సభ్యుల సంతకాలతో వినతి పత్రం అందజేశారు. ఆందోళనకర విషయమేమిటంటే ఆ జాబితాలో ఉన్న ఓ అనాధ శరణాలయానికి(హైదరాబాద్ లోని కూకట్ పల్లి ప్రాంతంలో) చెందిన అరడజను మంది బాలికలు పెల్లికాకుండానే గర్బవతులై పిల్లలను కన్నారు. వారంతా ఇప్పుడు అమీర్ పేట్ శిశుసధనంలో అనాధలుగానే పెరుగుతున్నారు.(అంతా చీకటే .. సాక్షి దిన పత్రిక, సెప్టెంబర్ 20,2015)
(4) భారత దేశంలో మహిళలు, చిన్న పిల్లల అక్రమ రవాణా సమస్య తీవ్ర రూపం దాల్చడం పట్ల ఐక్య రాజ్యసమితి ఆందోళన వ్యక్తం చేస్తుంది. స్త్రీలను, బాలికలను మయా మాటలు చెప్పి, మోసం చేసి ఇతర దేశాలకు తరలిస్తున్న ముఠాలు కొత్త కొత్త పద్ధతులు అనుసరిస్తున్నారు. భాదితుల ప్రాథమిక గుర్తింపు, జాతీయత అనేవి కూడా తుడిచిపెట్టుకు పోయేలా చేస్తూ, చివరకు భారత పౌరులుగా కూడా వారి గుర్తింపు మనుగడే ప్రశ్నర్థకంగా మార్చేస్తున్నారు. ప్రధానంగా ఈశాన్య రాష్టాల్లో ఇలాంటివి ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి. విదేశాల్లో మంచి జీతమొచ్చే ఉద్యోగం ఉందంటూ స్థానిక ఏజెంట్లు నమ్మించి మహిళలు, అమ్మాయిలను ఇతర దేశాలకు తీసుకెళుతున్నారు. చైనా, థాయిలాండ్, సింగపూర్, మయన్మార్ తదితర దేశాల్లో ఇళ్లల్లో పనిమనిషిగా లేదా చిన్న పిల్లల సంరక్షణ వంటి పనూలు చేసేవారికి డిమాండ్ ఉందని, ఆహారంతో పాటు వసతి కల్పిస్తామని చెబుతూ, మంచి జీతాన్ని ఎరగా చూపుతున్నారు. స్థానికంగా అంతగా ఉపాధి అవకాశాలు లేని కారణంగా ఈ మోసపు మాటల పట్ల అమ్మాయిలు ఆకర్షితులవుతున్నారు. ముందుగా ఈ ప్రాంతాల నుంచి వారిని మయన్మార్ కు తీసుకెళుతున్నారు. మిజోరాం బాలికలనైతే సరిహద్దులోని మయన్మార్ గ్రామానికి, మణిపూర్ కు చెందిన వారిని మరో పట్టణానికి తరలిస్తున్నారు. వీరిని అతి సులభంగా ద్విచక్రా వాహనాలపై సరిహద్దు దాటించేస్తున్నారు.
భారత్, మయన్మార్, గమ్య స్థాన దేశం ఇలా మూడు అంచెల్లో ఈ ఏజంట్ల నెట్ వర్క్ పని చేస్తుంది. వారు అక్కడకు చేరుకోగానే ఆధార్ కార్డు, మొబైల్ ఫోన్లు, ఇతర డాక్యుమెంట్లను ఏజెంట్లు తీసుకుంటున్నారు. యాంగాన్, తదితర చోట్లకు చేరాక ఈ అమ్మాయిలను వారి రూపురేఖల ఆధారంగా విభజిస్తున్నారు. అందంగా ఉన్నవారిని బ్యూటీ పార్లర్ లలో, ఇతరులను ఇళ్ల పనులలో శిక్షనిచ్చి అక్కడి నుంచి మరో దేశానికి పంపించే ఏర్పాట్లు చేస్తున్నారు. సింగాపూర్, థాయిలాండ్ దేశాలకు వెళ్లేందుకు వీలుగా బర్మా భాషలో వారికి శిక్షణిచ్చి వారికి మారు పేర్లతో మయన్మార్ పాస్ పోర్టులు సిద్ధం చేస్తున్నారు. మరో దేశానికి చేరిన వెంటనే ఏజెంట్లు వారి పాస్ పోర్టులు సైతం లాగేసుకుంటున్నారు.
భాదితులు ఎక్కడున్నారు ? ఏమి చేస్తున్నారు అనే విషయాన్ని కనుక్కోవడం కూడా వారి కుటుంభ సభ్యులకు అసాధ్యంగా మారుతుంది. ఈ నేపథ్యంలో మిస్సింగ్ కేసులు కూడా పెరుగుతున్నాయి. ఈవిదంగా తీసుకెళ్తున్న మహిళలు లేదా బాలికల్లో అధిక శాతం మందిని ఇతర దేశాలకు అక్రమంగా రవాణా చేస్తున్న ఉదంతాలు పెరుగుతున్నాయి. భాదితులు తమ గుర్తింపును కోల్పోయి, కొత్త పేర్లతో చెలామణి అవుతుండటంతో అధికారులు వారిని కనిపెట్టడం అసాధ్యం అవుతుంది. ఈవిదంగా మిజోరాం నుంచి సింగాపూర్ వెళ్లిన 17 మెర్సీ ఆత్మహత్యకు పాల్పడితే ఆమె భౌతిక కాయాన్ని భారత్ కు తీసుక రాలేకపోయారు. ఆమె తల్లిదండ్రులు కూడా పేదవారు కావడంతో అక్కడకు వెళ్లేందుకు డబ్బులతో పాటు పాస్ పోర్టు లేక కనీసం చివరి చూపు కూడా దక్కించుకోలేక పోయారు. మెర్సీ మయన్మార్ పస పోర్టు పై అక్కడకు వెళ్లినట్టు అప్పుడే బయటపడింది.("డేగలు తీరుగుతున్నాయి.. లేగలు తప్పిపోతున్నాయి" .. సాక్షి దిన పత్రిక ఏప్రిల్ 13, 2018)

ప్రజ్వల సంస్థ అధినేత మాటలు ..!
"స్త్రీ భోగ వస్తువు కాదు. అంగడి సరుకు అసలే కాదు. మహిళను వేరే దృష్టి కోణంతో చూడకుండా సమాజంలోని మనుషులందరితో ఆమెను సమానంగా చూడాలంటున్నారు ప్రజ్వల ఫౌండేషన్ వ్యవస్తాపకురాలు డాక్టర్ సునీత కృష్ణన్. ఇంకా ఆమె మాట్లాడుతూ .. 26 సంవత్సరాల క్రితం నాపై జరిగిన అఘాయిత్యం మరే అమ్మాయిపై జరగ కూడదనే నా ఆలోచన. నాకు జరిగిన అన్యాయంపై నేను అందరిలా స్పందించాలని అనుకోవట్లేదు. ఆ సంఘటనను తలచుకుంటూ ఇంట్లో కూర్చొని కుమిలిపోవడం కాదు.. దాన్ని ఎదిరించాలనుకున్న. అయినా నాపై జరిగిన దాడికి నేను కారణం కాదు. తప్పు నాది కాదు. ఒక లైంగిక దాడి జరిగితే .. దానికి కారణమైన మగవాన్ని ప్రశ్నించేవారు ఎవరూ ఉండరు. అదే మహిలనైతే నీచంగా భావిస్తూ హేళన చేసే వారే ఎక్కువ. ఇలాంటివన్నీ ప్రత్యక్షంగా చూశాక నేను అనుకున్నదొక్కటే.. ఏ అమ్మాయి అమ్ముడు పోవద్దని అనునిత్యం పోరాటం చేస్తూనే ఉన్నాను. దీనిలో భాగంగానే స్వరక్ష అనే ప్రజా చైతన్య యాత్రను ఈ రోజు నుంచి ప్రారంభిస్తున్నాం. మహిళా అక్రమ రవాణాకు వ్యతిరేకంగా సాగుతున్న ప్రపంచంలోనే మొదటి చైతన్య యాత్ర ఇది అని గర్వంగా చెప్పుకో గలుగుతున్నా అని చెప్పారామే."(నమస్తే తెలంగాణా దిన పత్రిక..జనవరి 09,2016)"మిగతా దేశంలో కంటే మన దేశంలో, అలాగే మన తెలుగు రాష్ట్రాల్లో అమ్మాయిల అక్రమ రవాణా ఎక్కువ జరుగుతుంది. ప్రపంచ వ్యాప్తంగా ఏటా 30 లక్షల మంది అమ్మాయిలూ అమ్ముడవుతున్నారు. ఒకప్పటి కంటే పరిస్థితి మరీ దిగజారింది. ఐదేళ్ళ అమ్మాయిలతోను వాంచలు తీర్చుకునే పరిస్థితి దాపురించింది. గోవా ముంబాయి వంటి చోట్లా పదేళ్ళ లోపు ఆడ పిల్లల్ని వేలం పెట్టి మరీ అమ్మేస్తున్నారు. ఒకప్పుడు పేద వర్గాలకు చెందిన అమ్మాయిలనే ఈ కూపంలోకి దింపేవారు. ఇప్పుడు సోషల్ మీడియా, చాటింగ్ లతో వల వేసి, అక్రమంగా తరలిస్తున్నారు. మనం అమ్మాయిల్ని రవాణా చేసే వాళ్ళనే కాదు .. కోరుకునే వాళ్ళని నియంత్రించాలి. స్వీడన్లో అమ్మకానికి అమ్మాయిలున్నా .. కొనుక్కోవడానికి ఎవరు ధైర్యం చేయరు. ఎందుకంటే అక్కడ వ్యభిచారం చేస్తూ పట్టుబడితే విటుల ఫోటోలను పత్రికల్లో ప్రచురిస్తారు. వాళ్ళ గురించి కథనాలు రాస్తారు. మన దగ్గర పట్టుబడిన మగవాళ్ళ గురించి అసలే మాట్లాడరు. మహిళల్ని అరెస్టు చేస్తారు .. ఫోటోలు కూడా బయటికి వస్తాయి. ఇలాంటి వివరాలు తెలియజేస్తూ .. వంచనకు గురి కాకుండా కాచుకునే మార్గాలను తెలియజేసేందుకే మేము స్వరక్ష కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం.(ఈనాడు దిన పత్రిక..జనవరి 07,2016)
SPECIAL FOCUS :
(1) మన దేశంలో సుమారు ఎనభై లక్షల మంది బాలికలు వేశ్య వృత్తిలో మగ్గుతున్నారు. జాతీయ మహిళా కమిషన్ గణాంకాల ప్రకారం .. బెంగుళూరు, కోల్ కథా, డిల్లీ, హైదరాబాద్, చెన్నై, ముంబై వంటి నగరాల్లో కనీసం 45 వేల మందికి పైగా బాలికలు ఉన్నట్లు అంచనా. పలు నివేదికలను పరిశీలిస్తే మన దేశంలో వేశ్య వృత్తిలో ఉన్న మహిళల్లో సుమారు 61 శాతం మంది SC,ST,BC లే. వీరంతా గ్రామీణ ప్రాంతాల నుంచి అక్రమ రవాణాకు గురైన బాదితులే.దేశంలోకెల్లా ఎక్కువమంది ఆడపిల్లలను వేశ్య వృత్తిలోకి దించుతున్న రాష్ట్రాల్లో తెలుగు రాష్ట్రాలు ప్రథమ స్తానంలో ఉండటం ఆందోళన కలిగిస్తోంది. దేశ వ్యాప్తంగా వివిధ వేశ్య గృహాల్లో ఉన్న బాలికల్లో, మహిళల్లో 25 నుంచి 85 శాతం మంది తెలుగు రాష్ట్రాలకు చెందిన వారే కావడం విచారకరం. డిల్లీలో 45%, ముంబైలో 28%, కోల్ కతా 14%, గోవాలో 80% అలాగే చెన్నై, చందాపూర్, బెంగుళూరులో కూడా తెలుగు బాలికలే ఈ వృత్తిలో మగ్గుతున్నారు. ప్రధానంగా తెలుగు రాష్ట్రాల నుంచి మహిళలే కాకుండా బాల కార్మికుల అక్రమ రవాణ కూడా ఎక్కువగానే ఉంటుందని గణాంకాలు చెబుతున్నాయి. ఇళ్ళలో పని చేయించుకునేందుకు, కొందరు డబ్బున్న యజమానులు దళారీల ద్వారా బాలలను కొనుగోలు చేస్తున్నారు. మరికొందరు బాలికలను పనిమనుషులుగా ఇంట్లో ఉంచుకొని లైంఘిక వేదింపులకు పాల్పడుతున్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి అమాయకులైన బాల కార్మికులను తమ వ్యక్తిగత అవసరాలకు ఉపయోగించుకుంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లో పేదరికాన్ని, వ్యక్తిగత అవసరాలను అసారగా చేసుకొని భాదితులను ఇతర రాష్ట్రాలకు, దేశాలకు తరలిస్తుండటం ఆందోళన కల్గించే విషయం. అనాధలు, అభం శుభం తెలియని బాలికలను ఎక్కువగా దళారీలు ట్రాప్ చేస్తున్నారు. అనంతపురం జిల్లా కదిరి ప్రాంతం నుంచి వేల సంఖ్యలో కువైట్, దుబాయ్, కోల్ కతాలకు నిత్యం మహిళల రవాణ కొనసాగుతుంది.(ఆదుని బానిసత్వంపై మేల్కోవాలి .. ఆంద్ర జ్యోతి దిన పత్రిక జులై 30,2015)(2) యువతులను వ్యభిచార కూపంలోకి దింపే ముటాలు రాష్ట్రంలో పదుల సంఖ్యలో ఉన్నాయి. ఈ ముఠాల సభ్యులు రెండు తెలుగు రాష్టాలలోని గ్రామీణ ప్రాంతాల్లో పర్యటిస్తూ ఉపాధి కల్పిస్తామని మాయ మాటలు చెబుతూ అమాయక యువతులపై వల విసురుతున్నారు. భాదితుల పేదరికాన్ని తమ అక్రమ వ్యాపారానికి వనరుగా మార్చుకుంటున్నారు. ఇలాంటి జాడలేకుండా పోతున్న కేసులు కరువు భారిన పడ్డ అనంతపురం తదితర రాయలసీమ జిల్లాల్లో ఎక్కువగా ఉంటున్నాయి. ఒక్కసారి వీరి బారిన పడ్డ తర్వాత ఆ నరక కూపం నుంచి యువతులు బయటపడటం కష్టం. పూనే ముంబాయి దిల్లీ వంటి చోట్ల వ్యభిచార గృహాలకు వీరిని అమ్మివేస్తున్నారు. భాదితుల తల్లిదండ్రులు స్తానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తున్నా పెద్దగా ఎవరూ పట్టించుకోవడం లేదు. ప్రేమ వ్యవహారాల కారణంగా తమ ఇష్ట ప్రకారమే వెళ్ళిపోయి ఉంటారని భావిస్తున్న పోలీసులు వీరిగురించి వెతికేందుకు ప్రయత్నించడం లేదు. చిన్న చిన్న పిల్లల్ని అపహరించి వ్యభిచార గృహాలకు అమ్ముతున్న ముఠా ఇటీవల సికింద్రాబాద్ రైల్వే పోలీసులకు చిక్కిన ఘటన పరిస్థితి తీవ్రతకు అద్దంపడుతోంది. తల్లితోపాటు మార్కెట్ కు వచ్చిన ఎనిమిదేళ్ళ బాలికను మరో మహిళ ఎత్తుకెళ్ళి యాదగిరి గుట్టలోని వ్యభిచార గృహానికి అమ్మేసింది. ఆ గృహం నిర్వాహకులు ఇటువంటి పిల్లల్ని పంచి పెద్దచేసి ఆ తర్వాత వ్యభిచార కూపంలోకి దింపుతున్నారు. ఈ ఘటనలో అతికష్టం మీద పోలీసులు ఆ బాలికను కాపాడగలిగారు. పదేళ్ళు కూడా లేని చిన్న పిల్లల్ని అపహరించి వ్యభిచార గృహాలకు అమ్మే ముఠాలు తయారయ్యాయంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. జార్కండ్ పోలీసులు ఇటివల కొత్త విషయం వెల్లడించారు. తమ రాష్ట్రం నుంచి జాడలేకుండా పోతున్న యువతులలో చాలామందిని దేశంలో వేగంగా విస్తరిస్తున్న నీలిచిత్ర పరిశ్రమ వైపు మల్లిస్తున్నారని చెప్పారు. ఇదొక కొత్త ప్రమాదం.
(నరక కూపంలోకి యువతులు .. ఈనాడు దిన పత్రిక ఫిబ్రవరి 24,2016)
(3) అనేక మంది అమ్మాయిలు విధి వంచితులై అనాధ ఆశ్రమాల్లో చేరుతున్న బాలికల్లో వేలాది మంది ఆచూకి లేదు. కొందరు స్వార్థపరులైన అనాధ ఆశ్రమ నిర్వాహకులు బాలికలను వ్యభిచార రొంపిలోకి దింపుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. మరికొందరు వారి పనుల కోసం పలుకుబడి కల్గిన రాజకీయ నేతలు, ఉన్నత అధికారుల దగ్గరకు అనాధ బాలికలను పంపుతున్నారు. ఇటివల తెలంగాణ సి.ఐ.డి పోలీసులు పూణేలో వ్యభిచార కేంద్రాలపై దాడి చేసినపుడు దొరికిన అమ్మాయిల్లో అత్యదికులు బలవంతంగా ఆ రొంపిలోకి దిగినవారే. వారిలో అత్యదికులు అనాధ బాలికలే. 2011లో ఉమ్మడి రాష్ట్ర పోలీసులు డిల్లీలో వ్యభిచార గృహాలపై దాడులు నిర్వహించినపుడు దొరికిన వంద మంది మహిలల్లోను 43 మంది అనాధ ఆశ్రమాల నుంచి వ్యభిచార గృహాలకు తరలించ బడ్డవారే. "పూనే,ముంబై,కోల్ కతా,డిల్లీలలోని వ్యభిచార గృహాలలో మగ్గుతున్న తెలుగు వారిలో అత్యధికులు అనాధ బాలికలే. ఓ స్వచ్చంద సంస్థ సహకారంతో దాదాపు 540 మందిని ఆ కూపం నుంచి బయటకు తీసుక వచ్చాం. వారు వ్యభిచార కేంద్రాలకు ఎలా చేరుకుంది తెలుసుకుని, భాధ్యులైన 63 మందిపై కేసులు నమోదు చేశాం. అందులో అరడజను మంది వ్యభిచార నిర్వాహకులు ఉన్నారు". అని సీనియర్ పోలీసు అధికారి ఒకరు వెల్లడించారు.
అనాధ ఆశ్రమాల ముసుగులో నిర్వాహకులు బాల బాలికల శ్రమను దోపిడి చేస్తున్నారని కేంద్రానికి అందిన నివేదిక స్పష్టం చేసింది. బాలికలను లైంగిక దోపిడి చేస్తున్నారని, వ్యభిచార గృహాలకు అమ్మేస్తున్నారని వెల్లడించింది. అదే సంవత్సరం కేంద్ర ప్రభుత్వం ... మహారాష్ట్ర,ఆంద్రప్రదేశ్,మధ్య ప్రదేశ్,పశ్చిమ బెంగాల్,తమిళనాడు డిల్లీలోను 63 అనాధ ఆశ్రమాల పై వేటు వేసింది. వాటిలోని బాల బాలికలను ప్రభుత్వ రంగంలోని ఆశ్రమాలు, కార్పోరేట్ సంస్థల ఆధీనంలోని శరనలయాలకు తరలించాలని ఆదేశించింది. కాని ఆ ఆదేశాలు క్షేత్ర స్తాయిలో అమలుకు నోచుకోలేదు. ఏ.పీ లో 11 అనాధ ఆశ్రమాలకు సంబంధించి వచ్చిన ఆరోపణలు అవాస్తావమని అప్పటి పార్లమెంట్ సభ్యుడొకరు కేంద్ర హొమ్ శాఖకు లేఖ కూడా రాశారు. తనతో పాటు మరికొందరు పార్లమెంట్ సభ్యుల సంతకాలతో వినతి పత్రం అందజేశారు. ఆందోళనకర విషయమేమిటంటే ఆ జాబితాలో ఉన్న ఓ అనాధ శరణాలయానికి(హైదరాబాద్ లోని కూకట్ పల్లి ప్రాంతంలో) చెందిన అరడజను మంది బాలికలు పెల్లికాకుండానే గర్బవతులై పిల్లలను కన్నారు. వారంతా ఇప్పుడు అమీర్ పేట్ శిశుసధనంలో అనాధలుగానే పెరుగుతున్నారు.(అంతా చీకటే .. సాక్షి దిన పత్రిక, సెప్టెంబర్ 20,2015)
(4) భారత దేశంలో మహిళలు, చిన్న పిల్లల అక్రమ రవాణా సమస్య తీవ్ర రూపం దాల్చడం పట్ల ఐక్య రాజ్యసమితి ఆందోళన వ్యక్తం చేస్తుంది. స్త్రీలను, బాలికలను మయా మాటలు చెప్పి, మోసం చేసి ఇతర దేశాలకు తరలిస్తున్న ముఠాలు కొత్త కొత్త పద్ధతులు అనుసరిస్తున్నారు. భాదితుల ప్రాథమిక గుర్తింపు, జాతీయత అనేవి కూడా తుడిచిపెట్టుకు పోయేలా చేస్తూ, చివరకు భారత పౌరులుగా కూడా వారి గుర్తింపు మనుగడే ప్రశ్నర్థకంగా మార్చేస్తున్నారు. ప్రధానంగా ఈశాన్య రాష్టాల్లో ఇలాంటివి ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి. విదేశాల్లో మంచి జీతమొచ్చే ఉద్యోగం ఉందంటూ స్థానిక ఏజెంట్లు నమ్మించి మహిళలు, అమ్మాయిలను ఇతర దేశాలకు తీసుకెళుతున్నారు. చైనా, థాయిలాండ్, సింగపూర్, మయన్మార్ తదితర దేశాల్లో ఇళ్లల్లో పనిమనిషిగా లేదా చిన్న పిల్లల సంరక్షణ వంటి పనూలు చేసేవారికి డిమాండ్ ఉందని, ఆహారంతో పాటు వసతి కల్పిస్తామని చెబుతూ, మంచి జీతాన్ని ఎరగా చూపుతున్నారు. స్థానికంగా అంతగా ఉపాధి అవకాశాలు లేని కారణంగా ఈ మోసపు మాటల పట్ల అమ్మాయిలు ఆకర్షితులవుతున్నారు. ముందుగా ఈ ప్రాంతాల నుంచి వారిని మయన్మార్ కు తీసుకెళుతున్నారు. మిజోరాం బాలికలనైతే సరిహద్దులోని మయన్మార్ గ్రామానికి, మణిపూర్ కు చెందిన వారిని మరో పట్టణానికి తరలిస్తున్నారు. వీరిని అతి సులభంగా ద్విచక్రా వాహనాలపై సరిహద్దు దాటించేస్తున్నారు.
భారత్, మయన్మార్, గమ్య స్థాన దేశం ఇలా మూడు అంచెల్లో ఈ ఏజంట్ల నెట్ వర్క్ పని చేస్తుంది. వారు అక్కడకు చేరుకోగానే ఆధార్ కార్డు, మొబైల్ ఫోన్లు, ఇతర డాక్యుమెంట్లను ఏజెంట్లు తీసుకుంటున్నారు. యాంగాన్, తదితర చోట్లకు చేరాక ఈ అమ్మాయిలను వారి రూపురేఖల ఆధారంగా విభజిస్తున్నారు. అందంగా ఉన్నవారిని బ్యూటీ పార్లర్ లలో, ఇతరులను ఇళ్ల పనులలో శిక్షనిచ్చి అక్కడి నుంచి మరో దేశానికి పంపించే ఏర్పాట్లు చేస్తున్నారు. సింగాపూర్, థాయిలాండ్ దేశాలకు వెళ్లేందుకు వీలుగా బర్మా భాషలో వారికి శిక్షణిచ్చి వారికి మారు పేర్లతో మయన్మార్ పాస్ పోర్టులు సిద్ధం చేస్తున్నారు. మరో దేశానికి చేరిన వెంటనే ఏజెంట్లు వారి పాస్ పోర్టులు సైతం లాగేసుకుంటున్నారు.
భాదితులు ఎక్కడున్నారు ? ఏమి చేస్తున్నారు అనే విషయాన్ని కనుక్కోవడం కూడా వారి కుటుంభ సభ్యులకు అసాధ్యంగా మారుతుంది. ఈ నేపథ్యంలో మిస్సింగ్ కేసులు కూడా పెరుగుతున్నాయి. ఈవిదంగా తీసుకెళ్తున్న మహిళలు లేదా బాలికల్లో అధిక శాతం మందిని ఇతర దేశాలకు అక్రమంగా రవాణా చేస్తున్న ఉదంతాలు పెరుగుతున్నాయి. భాదితులు తమ గుర్తింపును కోల్పోయి, కొత్త పేర్లతో చెలామణి అవుతుండటంతో అధికారులు వారిని కనిపెట్టడం అసాధ్యం అవుతుంది. ఈవిదంగా మిజోరాం నుంచి సింగాపూర్ వెళ్లిన 17 మెర్సీ ఆత్మహత్యకు పాల్పడితే ఆమె భౌతిక కాయాన్ని భారత్ కు తీసుక రాలేకపోయారు. ఆమె తల్లిదండ్రులు కూడా పేదవారు కావడంతో అక్కడకు వెళ్లేందుకు డబ్బులతో పాటు పాస్ పోర్టు లేక కనీసం చివరి చూపు కూడా దక్కించుకోలేక పోయారు. మెర్సీ మయన్మార్ పస పోర్టు పై అక్కడకు వెళ్లినట్టు అప్పుడే బయటపడింది.("డేగలు తీరుగుతున్నాయి.. లేగలు తప్పిపోతున్నాయి" .. సాక్షి దిన పత్రిక ఏప్రిల్ 13, 2018)
అమ్మాయిగా ?
పుట్టడమే
ఈ దేశంలో .. మహా శాపం.
అనుక్షణం ప్రమాదం
ఎక్కడ చూసినా భయానక దృశ్యం.
కామం తలకెక్కి
మానవత్వం .. మదమెక్కి
కాచుకొని .. కూర్చున్నారు కీచకులు.
పట్ట పగలే
పాముల వలే .. చుట్టేసి
బుసలు కొడుతూ .. విషాన్ని కక్కుతున్నారు.
టార్గెట్ అంతా ..!
ఒంటరిగా ఉన్న అమ్మాయిలు
భర్తలకు దూరమైన భార్యలు
విశాదాల్లో ఉన్న వితంతువులు
ఎలా ?
ప్రేమ పేరుతో
స్నేహం ముసుగులో
పని కల్పిస్తామనే కుట్రతో
మత్తు మందు సహాయంతో
మాయ మాటలతో .. దగ్గరై
మృత్యు కూపంలోకి .. నెడుతున్నారు.
శీలాన్ని
డబ్బుతో ముడిపెట్టి
అందమైన మాంసపు ముద్దని
అంగడి సరుకుగా .. అమ్ముకుంటున్నారు.
వలలో పడేసి
ఊపిరాడకుండా చేసి
ఒంటి నిండా .. పంటి గాట్లతో
శరీరాన్ని కుల్ల పొడుస్తూ
ప్రతి క్షణాన్ని .. ప్రత్యక్ష నరకంగా మారుస్తున్నారు.
కన్నవారి శవాల పక్కనే
కనికరం లేకుండా .. కడుపుచేసి
కసాయి మృగంలా .. ప్రవర్తిస్తున్నారు.
గుండె చెరువై
కంటికి నిద్ర కరువై
సమాజానికి భరువై
వ్యభిచారానికి వేదికై
ఇష్టమున్నా .. లేక పోయినా
భయట పడలేక
భాదను భరించలేక
చస్తూ బతుకుతుంది .. ప్రతి క్షణం.
నేను డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న కాలంలో .. చీకటి పడ్డాక ఒక తమ్ముడు రూమ్ కి వచ్చి .. అన్నా ఒక విచిత్రమైన సమస్యను నేను ఎదుర్కొన్నాను అని గొంతులో తడి ఆరిపోయి ..గద్గద స్వరంతో వణుకుతూ వివరించేసరికి .. ఆశ్చర్య పోవటమే నావంతైంది. వివరాల్లోకి పోతే .. ఇద్దరు చెల్లెలు, అమ్మ, నాన, అతడు. చిన్న కుటుంభం, వీధి చివరన పూరి గుడిసెలో నాన రెక్కల కష్టం మీద ఆధారపడి బతుకుతున్న కుటుంభం ఆయన అకస్మాత్తు మరణంతో అల్లకల్లోలంగా మారింది. ఆర్థికంగా కృంగిపోయి అష్ట కష్టాలు పడుతున్న సమయంలో మరో దుర్ఘటనకు దారి తీసింది. కాలేజీలో అడ్మిషన్ తీసుకోవటానికి పాస్ ఫోటోలు అవసరం కావటంతో స్టూడియోకి వెళ్ళింది. చూడటానికి అందంగా ఉన్న అమ్మాయిని అదో రకంగా చూసి ఫోటో తీసాక రేపు ఉదయం రమ్మని చెప్పేసరికి వెనుదిరిగింది. మరుసటి రోజు ఉదయం వెళ్లే సరికి పాస్ ఫోటోలతో పాటు, నగ్నంగా తీసిన తన ఫోటోను చూయించి .. నీవు అందంగా ఉన్నావు కదా? అందుకే ఇలా చేశాను అనే సరికి కళ్ళు బైర్లు కమ్మి మనసు ముక్కలైంది. నేను చెప్పినట్లు నీవు చేయక పోతే, ఈ ఫోటోని నెట్ లో పెడతానని బెదిరించి, అమ్మాయిని పూర్తిగా లొంగదీసుకుని అన్ని రకాలుగా బ్లాక్ మెయిల్ చేయటం ప్రారంభించాడు. కెమెరా లెన్స్ సహాయంతో చేసిన కుట్రను గుర్తించలేక, జరిగిన విషయం ఇంట్లో చెబితే అమ్మ తట్టుకోలేదని, తనలో తానే కుమిలిపోతూ, ఆరు నెలల పాటు అబద్దాలు చెబుతూ అతడికి దగ్గరైంది. రోజు రోజుకి అతడి చేష్టలు వికృతంగా మారడంతో భరించలేక .. నెట్లో పెడితే పరువు పోతుందేమోనని ఎవరు లేని సమయంలో ఇంట్లోనే ఆత్మ హత్య చేసుకుంది. యజమానిని ఎదిరించలేక, కేసు పెట్టె స్థోమత లేక, కన్న కూతురిని మర్చిపోలేక కుమిలి కుమిలి ఏడుస్తూ .. కాలం గడిపారు కుటుంభ సభ్యులు. కొంత కాలానికి తెలిసినవాళ్ళ సహాయంతో ఆ సంఘటన నుండి బయటపడ్డారు. ఇలాంటి సంఘటనలు మన చుట్టూ జరుగుతున్నా, ఎంతో మంది ఆడ బిడ్డల జీవితాలు బలి అవుతున్నా .. అందరిలాగే చదివి, చూసి వదిలేయటం సరికాదనిపించింది. ఈ సంఘటన మిలేనియం మొదటి సంవత్సరంలోనే సంభవించే సరికి నా మనసు ఈ రచన చేయడానికి ఆధారమైంది.
బ్లాక్ అయిన్డ్ వైట్ టీవీల కాలంలో పుట్టాను .. కలర్ టీవీల కాలంలో పెరిగాను .. నీలి చిత్రమనే మాటను వినటమే తప్ప ఎక్కడ చూసిన దాఖలాలు లేవు.స్వాతి మాస పత్రిక తప్ప, బూతు రచనలు ఎక్కడ కనిపించేవి కావు. కల్లా కపటం ఎరుగని కాలంలో, కలిసి మెలిసి బతుకుతున్న మనుషుల మధ్య .. కామం యొక్క ప్రస్తావనే తప్ప క్రూరమైన చర్యలు కనిపించేవి కావు. పుట్టిన పది సంవత్సరాలకు నీలి చిత్రమనే మాటను విన్నాను. ఇరవై సంవత్సరాలు గడిచాక అదేంటో అని ఒకమారు చూసాను. మిలేనియం గడిచి ఇరవై ఒకటో శతాబ్దంలోకి అడుగు పెట్టేసరికి .. అంతా తలకిందులుగా మారింది. మనుషులు మారిపోయారు, మానవత్వం మంటగలిసింది, మనుషులంతా మిషన్ల ఆదీనంలో బతుకుతూ మొరాలిటీ(నైతికత) లేదన్నట్లుగా ప్రవర్తిస్తున్నారు. కంప్యూటర్ ను కనుగొన్నాకా, అంతర్జాలం(నెట్) ఆవిర్భవించాక ప్రపంచమే గ్లోబల్ విలేజ్ గా మారి గందరగోళంలో పడిపోయింది. గతాన్ని మరిచి, గమనమే గగనమై అంతా గూగుల్ తల్లి చేతిలో ఒదిగి పోయింది. అన్నిటికి వేదికగా అశ్లీలతకు కేంద్రంగా అంతర్జాలం నిలిచిపోయింది. అదేమి విచిత్రమో గాని అనుదినం అందరు ఆన్ లైన్లో గడుపుతూ , అనవసరమైన బంధాలను కలుపుకుంటున్నారు, అనుబంధాలను దూరం చేసుకుంటున్నారు.అనవసరమైన అలవాట్లకు తెలియకుండానే బానిసై, అదో వ్యసనంగా మారి, అట్టడుగు స్థాయికి దిగజారి పోతున్నారు.
ఆరు బయట అశ్లీలం అనేదిఅప్పటి మాట .. అరచేతిలో అశ్లీలం అనేది ఇప్పటి మాట. . పేపర్లో పుస్తకాల్లో, సినిమా హాల్లో ఇంటర్నెట్ కేఫ్ లో అశ్లీలాన్ని వెతకటం పాత మాట .. స్మార్ట్ ఫోన్ లో సూపర్ కంప్యూటర్ లో అశ్లీలం అనేది కొత్త మాట. అప్పటి కాలంలో అత్యంత కష్టంగా ఖరీదుగా ఉండేది కాని అత్యంత చౌక బారు సరుకుగా మార్కెట్ లో దొరుకుతుంది. . ఒకప్పుడు అశ్లీల పుస్తకాలు, అక్కడక్కడ కనిపించే వీడియోలు మాత్రమే ఉండేవి. ఇప్పుడు ఎక్కడ చూసినా ఏ రంగంలో వెతికినా వాటి యొక్క ప్రభావం తీవ్రంగా కన్పిస్తుంది. వృద్ధులతో మొదలుకొని యవనులను దాటి చిన్న పిల్లలను చేరింది. అరసెకను కాలంలో అనంత జ్ఞానాన్ని అంతర్జాలం అందివ్వగలదు. ఫోన్ ల నుండి ఫ్యాబ్ ల వరకు, పర్సనల్ కంప్యూటర్ నుండి పబ్లిక్ కంప్యూటర్ వరకు సుమారు 50 కోట్ల మంది భారతీయులు నెట్ వినియోగిస్తున్నారని ఓ సర్వే చెప్పిన వివరణ. అందుకే మన దేశం నెట్ వినియోగంలో ప్రపంచంలో స్థానాన్ని ఆక్రమించింది. చిన్న పిల్లలకు సహితం చిటికిన వేలంత దూరంలో చేరువై, కరుడు గట్టిన సెక్స్ సైట్ లను ఐదుగురిలో ఒకరు చూస్తున్నారంటే ఎంత లోతుల్లోకి పాతుక పోయిందో అర్థం చేసుకోవచ్చు. సుమారు అయిదు కోట్ల అశ్లీల వెబ్ సైట్ లు అందుబాటులో ఉన్నాయంటే ఎంతటి ప్రమాదం పొంచి ఉందో అంచనా వేయవచ్చు. ఎయిడ్స్ వ్యాధి కన్నా అత్యంత వేగంగా వ్యాపిస్తున్న ఈ భూతం .. ఎన్ని కొంపలు ముంచుతుందో ఊహించవచ్చు.
2015 సం ఆగష్టు మొదటి వారం .. అటు టీవీల్లోనూ, ఇటు పేపర్లలోనూ అంతేకాకుండా సోషల్ మీడియాలోనూ ఒక విషయం అత్యంత ఎక్కువగా వైరల్ గా మారింది. అతి ప్రాముఖ్యమైన అంశం వివాదాస్పదంగా తెరపైకి వచ్చింది. ఇంటర్ నెట్‌లోని అశ్లీల వెబ్ సైట్లను నిషేధిస్తూ కేంద్ర ప్రభుత్వం ఒక జీవోను జారిచేసింది. నాకు తెలిసి గడిచిన కాలంలో ప్రభుత్వాలు ఇలాంటి నిర్ణయాలు చేసిన దాఖలాలు లేవు. విచిత్రమేమిటంటే .. వారం తిరిగే లోపే సుప్రీం కోర్టులో వాద ప్రతి వాదనలు జరిగి, అది సరైంది కాదని వ్యక్తి స్వేచ్ఛకు భంగం కల్గుతుందని ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవటం అందరికి ఆశ్చర్యం కల్గించింది. ఆ వాదనల యొక్క సారాంశాన్ని పరిశీలిస్తే .. ఆ వెబ్ సైట్ల వల్ల పిల్లలెంతగా చెడిపోతున్నారో చూడండి అని ఒకరంటుంటే, అవి లేక పోతే మరింత అడ్డదార్లు తొక్కుతారని మరో వర్గం వారు కొత్త రకమైన వాదన చేస్తున్నారు. ఏది ఏమైనా ఒకప్పుడు అశ్లీల పుస్తకాలు, కొన్ని వీడియోలు మాత్రమే ఉండేవి. కొందరు వాటిని చాలా రహస్యంగా దాచుకొని అప్పుడప్పుడు చూస్తూండేవారట. కానీ పుస్తకాలు, ఆ వీడియోలు చాలా పరిమితంగా, అతి కష్టంగా మాత్రమే దొరికేవట. అంతర్జాలం పుట్టిన నాటిన నుండి ఈ తరం వాళ్ళు కలలోనైనా ఊహించని అనంత విజ్ఞానాన్ని అర సెకను కాలంలో నేటి పిల్లలకు చిటికెన వేలుకు చేరువగా ఒక్క క్లిక్ తో చేరువైపోయాయి. ఒక్క మాటలో చెప్పాలంటే .. అంతర్జాలం అశ్లీల చిత్రాలను చూసే అలవాటుని రాక్షస ఆనందంగా మార్చింది. నాలుగు గోడల మధ్య జరిగే నగ్నత్వాన్ని నవ్వులపాలు చేసింది. బెడ్ రూంలో ఆలు మగల మధ్య జరిగే లైంగిక చర్యని బజారు పాలు చేసింది. అంతే కాకుండా అమ్మాయిలపై అనేకులు కలిసి చేసే అత్యాచార దృశ్యాలను, ఒకరికంటే ఎక్కువమందితో లైంగిక చర్యలో పాల్గొనే చిత్రాలను అందుబాటులో ఉంచి మగాళ్లను మృగాళ్ళుగా మార్చే యంత్రంలా మారింది. అందుకే తొలి చూపులోని తత్తరపాటు, తొలి స్వరంలోని తీయని గగుర్పాటు, పెళ్లయ్యాక కలిగే ఆషాడపు ఆనందాలు, జీవితాంతం అందమైన జ్ఞాపకాలుగా మిగిలే ఇలాంటి సున్నితమైన విషయాలన్నింటిని సరైన రీతిలో ఆస్వాదించలేని పరిస్థితిలోకి ఈ తరం చేరిపోయింది.
ఈ మధ్య కాలంలో సుప్రీం కోర్టులో దాఖలైన ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యం నేపథ్యంలో ప్రభుత్వం ఇటీవల కొన్ని నీలి వెబ్ సైట్లను నిషేధించడంతో ఇంటర్ నెట్ స్వేచ్ఛ పై చర్చ మొదలైంది. ప్రాపంచికంగా ఆలోచిస్తే .. బాలల నగ్న, అర్ద నగ్న చిత్రాలను, నీలి చిత్రాలను తీవ్ర నేరంగా అనేక దేశాలు పరిగణిస్తున్నాయి. మన దేశంలో కళగా చూయించి, భావ స్వేచ్ఛ పేరుతో సమర్థించడం ఎంతవరకు సరైందో ఆలోచించాలి. నీలి చిత్రాలకు మరియు చుట్టూ జరిగే లైంగిక నేరాలకు ఎలాంటి సంబంధం లేదనే వారు ఉన్నా ప్రపంచ వ్యాప్తంగా నిర్వహించిన ఓ సర్వే ప్రకారం పిల్లలపై లైంగిక చర్యకు పాల్పడ్డ నేరగాళ్లలో 84% మంది నీలి చిత్రాల వెబ్ సైట్లని చూసేవాళ్ళని రుజువైంది. సాధారణంగా చిన్నారులపై జరిగే వేధింపుల విషయంలో నూటికి ఒక్క కేసు కూడ రిజిస్టర్ కావడం లేదంటున్నారు అధికారులు. సహజంగా మన చుట్టూ వేయి లైంగిక వేధింపుల సంఘటనలు జరిగితే ఒకటి మాత్రమే పత్రికలలో కనబడుతున్నాయని అంటున్నారు మేధావులు. ఇలాంటి నేరాలకు పాల్పడే వారిలో ఎక్కువ మంది టీనేజీ నుండి వీటికి అలవాటు పడ్డవారే అయి ఉండటం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది. నిర్భయ ఘటన జరిగిన కొన్ని రోజులకే మన దేశ రాజధానిలో చాక్ లెట్ ఇస్తామని 5 సంవత్సరాల పాపని కిడ్నాప్ చేసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డ నేరస్తులు రోజంతా నీలి సైట్లను చూసారని విచారణలో తేలింది. ఒకవైపు .. "మీ లైంగిక సాహసాలను అందరితో పంచుకోండి" అని సవాలు చేసే నీలి సైట్లలో తమ ప్రతాపం చూపడం కోసం సామూహిక రేపిస్టులు వీడియోలు తీసి అప్లోడ్ చేస్తుండటం తరచు వార్తల్లో కనబడుతుంది. అంతే కాదు నమ్మిన మహిళలను వంచించి వారితో గడిపిన వీడియోలను నెట్ లో పెట్టడం రోజు రోజుకి పెరిగి పోతుంది. చివరకు నీలి చిత్రాల వికృత ప్రభావం, విశృంఖల తత్వం స్త్రీ, పురుషుల మధ్య జరిగే లైంగిక వాంఛను లైంగిక దాడుల స్థాయికి దిగజార్చి లైంగిక హింసకు మరియు లైంగిక వైపరీత్యానికి (sexual perversion) ప్రత్యక్ష ప్రేరణగా నిలిచాయని మహిళా సంఘాల లీగల్ సెల్ లాయరు ఒకరు మీడియాతో చెప్పింది. అందుకే అసజమైన, ఆధునికమైన, హింసాత్మకమైన లైంగిక క్రీడకు భయపడి విడాకులు తీసుకుంటున్న మహిళల సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతుంది. మరో వైపు సాఫ్ట్ పోర్న్(soft porn) పేరుతో మీడియాలో స్వైర విహారం చేస్తున్న అర్ద నగ్న నంగా కన్పిస్తున్న అమ్మాయిల శరీరాలు అంగడి సరుకుగా అమ్మబడుతూనే ఉన్నాయి. అసభ్య పదజాలానికి, అర్ద నగ్నత్వానికి చిరునామాలుగా మారిన టీవీ కార్యక్రమాలు సినిమాలు మగాళ్ళలోని మృగ తత్వాన్ని లేపుతూనే ఉన్నాయి.
ఈ తరం మనుషులకు ఓ రకమైన పిచ్చి ఎక్కువైంది. సామాన్యుల నుండి సెలబ్రిటీల దాకా ప్రతి ఒక్కరికి ఫ్యాషన్ అయిపొయింది. ఎవరిని కలిసినా, ఎక్కడికెళ్లినా, ఏమి చేసినా .. సెల్ఫీలు దిగటం సర్వ సాధారణమైపోయింది. మరుక్షణమే సోషల్ మీడియాలో పంచుకోవటం అలవాటుగా మారింది. పరిచయాలే ప్రమాదకరంగా మారుతున్నాయి. సామాజిక మాధ్యమాలే ఎక్కువ సమస్యలు సృష్టిస్తున్నాయి. నెట్ ఇంజన్లే ప్రధాన వేదికగా మారి నేరాలకు దారితీస్తున్నాయి. తెలిసి తెలియకుండానే సైబర్ వలలో చిక్కుకొనేలా చేస్తున్నాయి. ఈ విషయంలో అబ్బాయిల పరిస్థితి ఎలా ఉన్నా, అమ్మాయిల పరిస్థితి అత్యంత దారుణంగా మారింది. తీయగా మాట్లాడుతున్నారు .. తెలివిగా నమ్మిస్తున్నారు .. సెల్ నంబర్ ను సేకరిస్తున్నారు .. సమయమే తెలియకుండా చాటింగ్ చేస్తున్నారు .. ప్రేమిస్తున్నామంటున్నారు .. తర్వాత పెళ్లి చేకుంటామంటున్నారు .. పెళ్ళికి ముందే పడక గదిలోని సుఖాన్ని కల్గి ఉంటే తప్పేంటి ఏంటి అని ప్రశ్నిస్తున్నారు .. స్నేహం పేరుతో సన్నిహితంగా ఉంటూ సెల్ఫీలు దిగుతున్నారు .. ప్రేమ పేరుతో వ్యక్తిగత విషయాలన్నీ పంచుకుంటున్నారు. వీలైతే పడక గదిలోని పరువాన్ని సొంతం చేసుకుంటున్నారు .. మనుషులు మారిపోయాక .. మోసం తెలిసాక, పరువు ఎక్కడ బజారు పాలవుతుందో అని మౌనంగా భరించేవారు కొందరైతే, పరువు పోయిందనే భాదతో బలవంతంగా ప్రాణాలు తీసుకునేవారు మరికొందరు. అసలు పోలీసులకే ఫిర్యాదు చేయకుండా తమలో తామే క్షోభను అనుభవిస్తున్న వారి సంఖ్య అనేక రేట్లు అధికంగా ఉంటే, భవిషత్తులో మరెన్ని ఇబ్బందులు ఏరుకోవాల్సి ఉంటుందో అనే భయంతో ఫిర్యాదు చేయకుండా బతుకు చాలించేవారు ఎందరో. తెలుగు రాష్ట్రాల్లో ఏటా నమోదవుతున్న కేసుల్లో 40% సైబర్ నేరాలు అమ్మాయిల వేధింపులకు సంబంధించినవే కావటం ఆశ్చర్యం. ఇవి ప్రస్తుత పోలీసు రికార్డులు చెప్పే సత్యం. ఇలాంటి సమయంలో సైబర్ లా చదివి, అనేక కేసులను పరిష్కరించిన ఓ వ్యక్తి గురించిన కథనం ఆకట్టుకుంది.
"నేను సైబర్ లా ఎంచుకోవడానికి కేవలం రెండేళ్ల క్రితమే సైబర్ చట్టాన్ని ప్రభుత్వంతీసుకొచ్చింది. దాంతో ఆ కోర్సుకి సంబంధించి పెద్దగా పుస్తకాలూ కాని పాఠాలు చెప్పే అధ్యాపకులు గాని లేరు. పూణే లోని ఏషియన్ స్కూల్ ఆఫ్ సైబర్ లా లో చదువుకున్నా. ఏడాది కోర్సు .. ఒకే ఒక్క బోధకురాలు. మూడు నెలలు అయ్యేటప్పటికి నా జూనియర్లకి నేనే పాఠాలు చెప్పేదాన్ని. మా మేడం దగ్గర నేను నేర్చుకోవడం .. మరుసటి రోజు వాటినే పాఠాలుగా చెప్పడం .. ఇలా నేను ఏషియన్ స్కూల్లో చదువుకుంటూనే టీచర్ గా మారిపోయా. పోలీసులు న్యాయవాదులతో పాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సైబర్ చట్టాల గురించి అవగాహన కల్పించేదాన్ని. పోలీసులు న్యాయవాదులు నేర పరిశోధనలో నా సాయం తీసుకునేవారు. అప్పుడే నేనెంచుకోవాల్సిన రంగం ఇదేనని అన్పించింది. అలా 2010 లో "అవేంజో సైబర్ సెక్యూరిటీ సొల్యూషన్స్" పేరుతో ఓ సంస్థని ప్రారంభించా. అప్పటికే ఎన్నో కేసులు శోధించిన అనుభవం ఉండటంతో ఎక్కడా వెనుతిరిగి చూడాల్సిన అవసరం లేదు. దీన్ని ప్రారంభించిన కొత్తలో .. వ్యక్తిగతంగా ఎదుర్కొనే సైబర్ అవమానాలు, బెదిరింపులు, నేరాలే ఎక్కువగా వచ్చేవి. చెప్పాలంటే నెలకు ఎనిమిది కేసులు ఉండేవి. ఇప్పుడు వారానికి రెండు వందల కేసుల్ని పరిశోధిస్తున్నాం. ఈ బెదిరింపులు భరించలేక ఆత్మ హత్య చేసుకున్న అమ్మాయిలూ కూడా కొందరు ఉన్నారు. అలాంటివి విన్నపుడు మొదట్లో నిద్ర పట్టేది కాదు. అన్నం కూడా తినేదాన్ని కాదు. ఇక సంస్థలు ఎదుర్కొనే సమస్యలు మరో రకంగా ఉంటాయి. వాటిలో ఎక్కువగా డాటా కోల్పోవడం గురించి ఫిర్యాదులుంటాయి. అయితే మేము పోలీసుల పని చేయం. పోలీసులకు కావాల్సిన సాక్షాలు పోకుండా సహాయ సహకారాలు మాత్రమే అందిస్తాం. దేశవ్యాప్తంగానే కాదు ఆసియా దేశాల్లో అనేక కేసులను పరిష్కరించాను. ప్రస్తుతం కేరళలో మాత్రమే నా ఆఫీసు ఉంది. కానీ సమస్యను బట్టి వివిధ ప్రాంతాలకు వెళ్లి సాంకేతిక సహాయం అందించి వస్తుంటా" (ధన్యా మీనన్ .. ఫౌండర్ అఫ్ అవేంజో సైబర్ సెక్యూరిటీ)
(1) ఒకావిడ ఓ ఇంట్లో పనికి కుదిరింది. ఆ ఇంటి యజమాని ఆమెని లైంగికంగా వేధించడం మొదలుపెట్టాడు. దాంతో ఆమెతిరగబడింది . దానికి ఆ యజమాని చెప్పిన సమాధానం విని ఆమె భయపడింది. "నటించకు .. నీ గురించి నాకు తెలియదా ? నెట్ లో ఎక్కడ చూసినా నీ ఫొటోలే! చూస్తావా అంటూ నెట్ లో చూపించాడు. నిజంగా ఆమె ఫొటోలే. చివరికి ఆమె స్నానం చేస్తున్న దృశ్యాలు కూడా! పోలీసులకు ఫిర్యాదు ఇస్తే అందరికి తెలిసిపోతుందేమోనని భయం. మరో వైపు పరువు గురించిన బాధ. ఎక్కడో రేడియోలో నా గురించి విని, వాళ్ళను వీళ్ళను అడిగి చివరికి నా ఫోన్ నంబర్ తెలుసుకుని కలిసింది. నేను ఓదార్చి .. ఆ విషయం నేను వచ్చేంత వరకు ఎవ్వరికీ చెప్పొద్దని చెప్పి వాళ్ళ ఊరు బయలుదేరా. ఆ వీడియోలు పరిసరాలు, ఇంటి చుట్టు పక్కల వాళ్ళే ఆ పని చేశారని అర్థమయింది. ఆమె భర్త గుమస్తా. అతను పెద్దగా చదువుకోలేదు. ఫోన్ వాడతాడు కానీ వీడియోలు అప్ లోడ్ చేసే పరిజ్ఞానం లేదు. కొడుక్కి 13 సంవత్సరాలు. వాడిని చూస్తే నాకు అనుమానం వచ్చింది. ఎందుకంటే వాడి చేతిలో కొత్త మోడల్ ఫోన్. ఖరీదయైన బట్టలు, కొత్త బండీ. ఏం చదువుతున్నాడని అడిగాను. చదువుతూనే నెట్ లో పనిచేస్తాడు ! అంది బాధితురాలు. నా అనుమానం బలపడింది కానీ వాడి ఫోన్ చూస్తే అందులో ఎలాంటి వీడియోలు లేవు. అంటే నేను రావడానికి ముందే జాగ్రత్త పడ్డాడన్నమాట. బ్యాంకు ఖాతాను పరిశీలిస్తే ... అరవై వేల రూపాయల వరకు ఉంది. ఆ వయసుకు అంత డబ్బు ఏ ఖాతా నుంచి వచ్చిందో పరిశీలించా ? ఓ వీడియో పార్లర్ నుంచి వచ్చింది. ఆ పార్లర్ ఈ పిల్లవాడు చదివే స్కూల్ పక్కనే ఉంటుంది. అంటే వీడియోలు తీసి అమ్మడం ద్వారా సంపాదిస్తున్నాడు. పోలీసులకు వివరాలు అందించా ! పిల్లాడిని ప్రశ్నించే సరికి నిజం చెప్పాడు. వాళ్ళ నాన్న ఫోన్ లో అశ్లీల చిత్రాలను చూడ్డం చూసి అతను ఇలా చేశాడు. చివరికి కన్న తల్లి ఫొటోలే తీసి అమ్మాడు. అలా నేను ఇంటి దొంగను గుర్తించా! (తల్లి ఫొటోలనే నెట్ లో పెట్టాడు .. ఈనాడు దినపత్రిక వసుందర ఏప్రిల్ 1,2017)
(2) అతను ఓ ఇంజనీరింగ్ విద్యార్థి. తల్లిదండ్రులు అక్క డాక్టర్లే. వాళ్ళ అక్కకు సంబందించిన వ్యక్తిగత వీడియో ఒకటి నెట్లో కన్పించింది. ఆ వివరాలు నా దగ్గరకు వచ్చినపుడు .. నేను దాన్ని చూశా ! ఇంటి వాతావరణం స్పష్టంగా కన్పించింది. అంటే ఇంట్లో వాళ్ళే ఎవరో చేసి ఉంటారని అర్థమైంది. ఇంట్లో ఎక్కడైనా కెమెరా పెట్టారేమో గమనించా .. చివరకు బాత్ రూమ్ లో కన్పించింది. పోలీసుల ద్వారా ఆరా తీయిస్తే .. ఆ పని ఆ తమ్ముడిదేనని అర్థమైంది. (తల్లి ఫొటోలనే నెట్ లో పెట్టాడు .. ఈనాడు దినపత్రిక వసుందర ఏప్రిల్ 1,2017)
(3) భార్య మాన ప్రాణాల రక్షణ కోసం తన ప్రాణాలను అడ్డేయాల్సిన భర్త .. ఆమె పట్ల పైశాచికంగా వ్యవహరించాడు. పడక గదిలో భార్యతో ఏకాంతంగా గడిపిన దృశ్యాలను ప్రత్యక్ష ప్రసారం ద్వారా అమ్మకానికి పెట్టాడు. దర్యాప్తు అధికారులనే విస్తుపోయేలా చేసిన ఆ రాక్షషుడి నిర్వాకం సైబారా బాడ్ కమిషనరేట్ పరిధిలో వెలుగు చూసింది. హైదరాబాద్ కు చెందిన వివాహిత నగ్న దృశ్యాలు గత ఏడాది నవంబరులో అంతర్జాలం లో వెలుగు చూశాయి. ఆమె సన్నిహితులు ఆ దృశ్యాల్ని చూసి ఆమెకు సమాచారం అందించడంతో బాదితురాలు సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులని ఆశ్రయించింది. కేసు నమోదు చేసిన పోలీసులు లోతుగా దర్యాప్తు చేయడంతో శాడిస్టు మొగుడి నిర్వాకం వెలుగు చూసింది. ఆ ప్రబుద్దుడు (33) జీడిమెట్ల చింతల్లో ఉంటూ నగరంలోని ఓ సంస్థలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నాడు. అతడి భార్య ఓ ప్రయివేటు సంస్థలో ఉద్యోగం చేస్తుంది. అతడు కొంత కాలంగా అశ్లీల సైట్ల వీక్షణ బానిసగా మారాడు. ఈ క్రమంలో ఆర్ధిక ఇబ్బందులను అధిగమించేందుకు కొన్ని సైట్లలో మేల్ ఎస్కార్ట్ (మగ వ్యభిచారి) గా తన మొబైల్ నంబరును రిజిస్టర్ చేసుకున్నాడు. విషయం తెలిసిన భార్య గొడవ పెట్టుకుంది. బుద్దిగా ఉంటానని చెప్పి భార్యను నమ్మించిన ఆ ఇంజనీర్ మరింతగా బరితెగించాడు. ఏకంగా భార్యనే లక్షంగా చేసుకొని ఈ నిర్వాకానికి తెర లేపాడు. ఓ రోజు రాత్రి పడక గదిలో భార్యకు తెలియకుండా ల్యాప్ టాప్ లో ఏదో సినిమా వస్తుండటంతో బాధితురాలికి ఏ మాత్రం అనుమానం రాలేదు. ఆ వెబ్ క్యామ్ ను ఒక లైవ్ స్ట్రీమ్ వీడియో చాటింగ్ పోర్న్ సైట్ కు అనుసంధానం చేశాడు. ఆ దృశ్యాల్లో ఎక్కువగా భార్య కనపడేలా చిత్రీకరించాడు. ఈ సైట్ లో సుమారు మూడు వేల మంది సభ్యులున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ వీడియోల్ని ప్రత్యక్షంగా చూసే వీక్షకులు తమకు ఆ దృశ్యాలు నచ్చితే టోకెన్లు కొనుగోలు చేస్తుంటారు. ఆ టోకెన్ల సొమ్మును నిర్వాహకులు వీడియోని అప్లోడ్ చేసిన వారికి పంపిస్తుంటారు. ఇలా డబ్బులు సంపాదించాలనే దుర్బుద్ధితో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ఈ ఘాతుకానికి ఒడిగట్టాడు. (పైశాచిక పతి .. ఈనాడు దినపత్రిక ఏప్రిల్ 13,2017పేజీ 5)
(4) కట్టుకున్న వాడు కంటికి రెప్పలా కాపాడుకోవాల్సింది పోయి భార్యను బజారు పాలు చేశాడు. సర్వ సమాజం సిగ్గు పడేలా .. ఆమె నగ్న చిత్రాలు చిత్రీకరించీ ఆ వీడియోలను స్నేహితులకు షేర్ చేశాడు. అప్పటికి అతడిలోని పైశాచికం చల్లారక భార్యకు మత్తు మందు ఇచ్చి .. వేరొకరితో అత్యాచారం చేయించాడు. విదేశాల్లో విద్యను అభ్యశిస్తున్నా .. విలువలను వదిలిన కన్న కొడుకును మందలించాల్సిన తల్లి, సోదరి అతడికి వంత పాడారు. చెప్పుకునే దిక్కులేక .. ఆ అభాగ్యురాలు చివరకు పోలీసుల్ని ఆశ్రయించింది. ఆమె ఫిర్యాదుతో పోలీసులు భర్త అత్తలను సోమవారం అరెస్టు చేశారు. హైదరాబాద్ కంచన్ బాగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ కీచక పర్వం వివరాలను దక్షిణ మండల డీ.సీ.పీ సత్యనారాయణ వెల్లడించారు.
పాత బస్తీ హఫీజ్, బాబా నగర్ కు చెందిన సనా ఫాతిమా(26), మాదన్న పేట సాలార్ నగర్ కు చెందిన మహమ్మద్ సలీమొద్దీన్(28) లకు గత ఏడాది ఏప్రిల్ లో వివాహమైంది. ఎమ్ టెక్ చదివేందుకు సలీమొద్దీన్ ఆస్ట్రేలియా వెళ్ళాడు. అక్కడే పార్ట్ టైం ఉద్యోగం చేస్తున్నాడు. పాశ్చాత్య పోకడలకు అలవాటు పడ్డ సలీమొద్దీన్ తరచుగా మాదన్న పేటలో ఉంటున్న భార్యకు వీడియో కాలింగ్ చేసేవాడు. తనతో నగ్నంగా మాట్లాడాలని ఒత్తిడి తెచ్చేవాడు. ఈ వీడియో కాల్స్ ను రికార్డ్ చేసిన సలీమొద్దీన్ .. వాటిని వాట్స్ అప్ ద్వారా స్నేహితులకు షేర్ చేశాడు.
సనా ఉండే ఇంట్లోనే కింది భాగంలో ఆమె అత్త నూర్జహా బేగం నివశిస్తోంది. సలీమొద్దీన్ స్నేహితుడైన పెట్టెపల్లె వాసి చాంద్ తరచూ నూర్జహా ఇంటికి వచ్చి పోతుంటాడు. అతడు సనాతో అభ్యంతర కరంగా ప్రవర్తించేవాడు. ఇది తెలిసిన పట్టించుకోని నూర్జహా .. చాంద్ ను ప్రోత్సహిస్తూ వచ్చింది. గత నెలలో ఆస్ట్రేలియా నుంచి తిరిగి వచ్చిన సలీమొద్దీన్ .. తన సెల్ ఫోన్ లో ఉన్న భార్య దృశ్యాలను చాంద్ కు చూపించాడు. అదే సందర్భంలో ఆమె పై మోజు ఉన్న విషయాన్ని చాంద్ చెప్పాడు. మందలించాల్సిన సలీమొద్దీన్ .. తన భార్యపై అత్యాచారానికి సహకరిస్తానంటూ ప్రోత్సహించాడు. ఈ నెల 4 న పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పట్టు బడ్డాడు. (కీచక భర్త .. సాక్షి దినపత్రిక మార్చ్ 14,2017 )
(5) హైదరాబాద్ లోని సఫిల్ గూడాకు చెందిన 32 ఏళ్ల నిజాముద్దీన్ హైదర్ ఒక సైబర్ నేరానికి పాల్పడ్డాడు. అయిదేళ్ల క్రితం ఉద్యోగం కోసం ఓ ఇంటర్వ్యూ కు వచ్చిన అమ్మాయితో పరిచయం చేసుకున్నాడు. ఎం బి ఏ చదివిన ఆ అమ్మాయితో స్నేహం చేశాడు. అనాధనంటూ సినిమా కష్టాలన్నీ చెప్పుకొని సానుభూతి చూరగొన్నాడు. రోజులు గడిచే కొద్ది వారి పరిచయం కాస్త స్నేహం పరిధి దాటి, చాలా ముందుకు వెళ్ళింది. త్వరలోనే పెళ్లి చేసుకుంటానని ఆ మనోడు మాయ మాటలు చెప్పాడు. అలా రెండేళ్లు గడిచి పోయాయి. ఆ సమయంలో ఆ అమాయకురాలు ఈ మేకవన్నె పులితో సన్నిహితంగా మెలుగుతూ, అతని ఫోన్ లో చాలా సెల్ఫీలు దిగింది. తీరా నిజాముద్దీన్ కు పెళ్ళి అయిపోయిందని ఆమెకు ఆలస్యంగా అర్థమైంది. దాంతో అతడిని దూరం పెట్టింది. కాని కలిసి తీసుకున్న సెల్ఫీలను అడ్డం పెట్టుకుని బ్లాక్ మెయిల్ చేయడం మొదలు పెట్టాడు నిజాముద్దీన్. ఇంటర్ నెట్ లో పెడతానంటూ బెదిరించసాగాడు. చివరకు బాధితురాలు సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది.(సాక్షి దిన పత్రిక జూన్ 7,2016)
(6) సైబర్ నేరాల్లో మరో వికృత కోణం .. సోషల్ మీడియాలో తప్పుడు ఐడెంటిటీ తో చేస్తున్న మోసపూరిత స్నేహాలు. హైదరాబాద్ లోని బోలా నగర్ కు చెందిన అబ్దుల్ మాజిద్ చేసింది అదే. 21 ఏళ్ళ ఈ ఇంజనీరింగ్ విద్యార్థి ఫెస్ బుక్ ద్వారా ఏకంగా కొన్ని వందల మంది అమ్మాయిలతో స్నేహం చేశాడు. తాను కూడా అమ్మాయినే అని ఫెక్ ఐడెంటిటీ తో నమ్మించాడు. తోటి కాలేజీ స్టూడెంట్ అనుకున్న అమ్మాయిలందరూ అతని వలలో పడ్డారు. ఎంతగా మోసపోయారంటే .. చివరకు తమ తలితండ్రులకు చెప్పని విషయాలు కూడా 'ఆమేనని మోసం చేసిన అతనితో' పంచుకున్నారు. మద్యపానం, పొగ తాగడం దగ్గర నుంచి చివరకు తమ బాయ్ ఫ్రెండ్స్ లైంగిక ప్రాధాన్యాల దాకా అన్నీ చెప్పుకున్నారు. అలా వాళ్ళ దగ్గర చనువు సంపాదించిన మజీద్ వాళ్ళ నుంచి అర్ద నగ్న సెల్ఫీలు కూడా తెప్పించుకున్నాడు. ఆ తర్వాత ఆ సెల్ఫీల బూచి చూపెట్టి భయపెట్టసాగాడు. ఆన్ లైన్లో పెట్టేస్తానంటూ బెదిరించసాగాడు. ఈ వ్యవహారం చివరకు సైబర్ పోలీసులకు చేరింది. కొన్ని వందల మంది టీనేజ్ అమ్మాయిల అర్ద నగ్న సెల్ఫీలు, ఫోటోలను ఈ ప్రబుద్దుడు సేకరించినట్లు తేలింది.(సాక్షి దిన పత్రిక జూన్ 7,2016)
(7) నాతో పాటే కళాశాలలో చదివేవాడు. ప్రేమించానంటూ వెంటపడేవాడు. ఎన్నోసార్లు సర్ది చెప్పాలని ప్రయత్నించా వినలేదు. ప్రేమను నిరాకరించానని నా పేరుతో ఫెస్ బుక్ లో నకిలీ ఖాతా ప్రారంభించాడు. నా చిత్రాలను అసభ్యకరంగా మార్ఫింగ్ చేసి పోస్టు చేసేవాడు. కొన్ని నెలలపాటు నరకయాతన అనుభవించా. చివరకు ధైర్యం చేసి పోలీసులకు ఫిర్యాదు చేసి పట్టించా (ఈనాడు దిన పత్రిక జూన్ 18,2017)
(8) హైదరాబాద్ నల్గొండ క్రాస్ రోడ్డులో నివసించే యువతి జానకికి నాగోలు ప్రాంతానికి చెందిన యువకుడు యశ్వనాథ్ కుమార్ ఫిష్ బుక్ లో పరిచయమయ్యాడు. ఇద్దరు చాటింగ్ చేసుకునేవాళ్ళు. ప్రేమించానంటూ ఆమెను అతడు బుట్టలో వేసుకున్నాడు. తీరా పెళ్లి చేసుకోమనేసరికి అడ్డు తొలగించు కోవాలనుకున్నాడు. తన గదికే పిలిపించుకుని గొంతు నులిమి హత్య చేసాడు. శవాన్ని గోనె సంచిలో కట్టి మూసి నదిలో పడేశాడు. యువతి కుటుంబ సభ్యులు ఎంత గాలించినా ఫలితం లేక పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫోన్ కాల్స్ ఆధారంగా విచారించగా యాశ్వంత్ కుమారే దారుణానికి పాల్పడినట్టు తేలింది ... సైబర్ వేధింపుల బాధితురాలు, విశాఖ పట్నం (ఈనాడు దిన పత్రిక జూన్ 18,2017)
(9) నా చరవానికి వాట్సాఫ్ లో కొన్ని రోజులుగా ఎవరో తెలియని వ్యక్తి అశ్లీల దృశ్యాలు, వీడియోలను పంపుతున్నాడు. వాటిని ఎప్పటికప్పుడు తొలగిస్తున్నా. సెల్ నంబర్ ను బ్లాక్ లిస్ట్ లో పెడుతున్నా. అయినా రోజుకో నంబరు నుంచి మళ్ళీ మళ్ళీ పంపుతున్నాడు. ఎన్ని నంబర్లు బ్లాక్ లిస్టులో పెట్టినా ఈ దృశ్యాలు పంపుతూనే ఉంటానంటూ మెసేజ్ లు పంపిస్తున్నాడు. నా చిత్రాలను మార్ఫింగ్ చేసి అశ్లీల దృశ్యాల్లా చిత్రీకరిస్తానంటూ నన్ను బెదిరిస్తున్నాడు. అతని బారి నుంచి మీరే కాపాడాలి ... కొన్నేళ్ల కిందట విజయవాడ పోలీసులను ఆశ్రయించిన ఓ బాధితురాలి ఆవేదన (ఈనాడు దిన పత్రిక జూన్ 18,2017)
(10) చిత్తురూలో బీటెక్ చదువుతున్న నవీన్ ప్రసాద్ కు హైదరాబాద్ లో ఓ యువతీ పరిచయమైంది. కొన్నేళ్ళకు వారి మధ్య సాన్నిహిత్యంఏర్పడింది . దాన్నే అలుసుగా చేసుకొని ఇద్దరు ఏకాంతంగా ఉన్న దృశ్యాలను సెల్ ఫోన్ లో చిత్రీకరించాడు. వాటిని యువతికి పంపిస్తూ బెదిరింపులకు దిగాడు. అసభ్యకర చిత్రాలను స్నేహితులకు పంపేవాడు. బాధితురాలు ఫిర్యాదు చేయడంతో ఇటీవల హైదరాబాద్ సైబర్ నేరాల పోలీసులు చిత్తూరులో అతన్ని అరెస్టు చేశారు. (ఈనాడు దిన పత్రిక జూన్ 18,2017)
(11) ఆమె పేరు రేవతి (పేరు మార్చాము) గచ్చి బౌలీలోని ఓ సాఫ్ట్ వేర్ సంస్థలో ఉద్యోగిని. ఓ రోజు "నువ్వు నగ్ననంగాఉన్న ఫోటోలు నా దగ్గర ఉన్నాయి. నాలుగు లక్షల రూపాయాలు ఇస్తేనే వాటిని డిలిట్ చేస్తా .." అంటూ ఓ అజ్ఞాత వ్యక్తి నుండి రేవతి ఫెస్ బుక్ ఐడికి ఓ మెసేజ్ వచ్చింది.రేవతి దాన్ని పెద్దగా పట్టించుకోలేదు. రెండు రోజులు పోయాక ఓ ఫొటో పంపించాడు. ఆ ఫొటో తనదే. అతను చెప్పినట్లు నగనంగా ఉన్న ఫోటోనే. దాన్ని చూసే సరికి ఒక్కసారి ఉలిక్కిపడింది. అజ్ఞాత వ్యక్తి నెంబరు కనుక్కునే ప్రయత్నం చేసినా సాధ్యం కాలేదు. మాజీ ప్రియుడే బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని ఊహించి అతనికే ఫోన్ చేసింది. మాట్లాడక అతను కాదని అర్థమైంది. కానీ డబ్బు కావాలంటూ అతని నుంచి బెదిరింపులు పెరగడంతో చివరకు దైర్యం చేసి సైబరాబాద్ పోలీసుల్ని సంప్రదించింది.
"రేవతి ఫిర్యాదు చేసిన వెంటనే మా పోలిసు బృందం రంగంలోకి దిగింది. మొదట ఆమె ఫెస్ బుక్ ఖాతను పరిశీలించాం. అదొక్కటే మాకు ఆధారం. అతను ఈ బెదిరింపుల్లో భాగంగా ఫోను ఎక్కడా వాడలేదు. ఫెస్ బుక్ ద్వారానే సందేశాలు పంపాడని అర్థమైంది. దాంతో ఆ ఖాతాను ఎవరు క్రియేట్ చేశారో తెలుసుకునేందుకు ఫెస్ బుక్ సంస్థకు మెయిల్ పంపించాం. ముందుగా ఆ ఖాతాను బ్లాక్ చేయమని కోరాం. ఆ ఖాతా బ్లాక్ అయింది. కానీ నిందితుడు మరో ఖాతా సృష్టించుకున్నాడు. అయితే మాకు ఆ వివరాలు రావడానికి కనీసం పదిహేను రోజుల సమయం పడుతుంది. ఈలోగా ఇతర మార్గాల ద్వారా అతడెవరో తెలుసుకునే ప్రయత్నం చేశాం. రేవతితోనే అతడికి డబ్బులు ఇప్పిస్తామని చెప్పించాం. అతడిని నమ్మించాలనే ఉద్దేశంతో ఒకేసారి కాకుండా విడతల వారిగా డబ్బు ఇస్తామని చెప్పించాం. కానీ అతను చాలా తెలివిగా తానే వచ్చి తీసుకుంటానని చెప్పాడు. అలా అని అతడు కూడా ఆమెని పూర్తిగా నమ్మలేదు. ఒకసారి ఖాతా, మరోసారి నేరుగా వస్తాను .. అంటూ రకరకాలుగా చెప్పాడు. చివరకు ఓ రోజు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కి వచ్చి తీసుకుంటానని, ఓ బెంచి గురించి చెప్పి అక్కడ డబ్బు పెట్టి వెళ్ళి పొమ్మని ఆ అమ్మాయికి సూచించాడు. మేము కూడా ఆ అమ్మాయితో పాటు వెళ్ళాం. కొంతసేపటికి ఒకతను అక్కడ అనుమానాస్పదంగా తిరగడం గమనించిన మా పోలీసులు అతడిని పట్టుకున్నారు. ఫోను తీసుకుని పరీశీలిస్తే .. అతడే నిందితుడని అర్థమైంది. ఇంతకీ .. అతడెవరు .. తనకెలా రేవతి వివరాలు వచ్చాయో తెలుసా ? అతడు రేవతి మాజీ ప్రేమికుడు. రఘు ఇంటికి దగ్గర్లోనే ఉంటాడు, పేరు అన్వర్. ఊరు గుంటూరు. వ్యాపారంలో అప్పటికే బోలెడు డబ్బు పెట్టుబడిగా పెట్టి నష్టపోయాడు. రఘుతో స్నేహం చేసి అతడి ల్యాప్ టాప్ తీసుకుంటూ ఉండేవాడు. అలా తీసుకున్నపుడే ఓ రోజు ఈ ఫోటోలు చూసాడు. వాటిని వెంటనే తన ఫోనులో కాపీ చేసుకున్నాడు. వాటిని అడ్డుపెట్టుకుని డబ్బు సంపాదించి అప్పులు తీర్చాలని అనుకున్నాడు. అలా ఒక ఫెస్ బుక్ ద్వారా దాన్నుంచి రేవతిని బెదిరించాడు. చివరకు కట కటాల పాలయ్యాడు.. అని ఎలా పరిష్కరించారో వివరించారు సైబరాబాద్ డీ.సి. పి జానకీ షర్మిల గారు ..అంతే కాకుండా సైబర్ క్రైమ్ ఫిర్యాదుల కొరకు sho_cybercrimes@cyb.tspolice.gov.in సంప్రదించవచ్చని మీడియాతో చెప్పారు.(ఈనాడు దినపత్రిక మే 30,2018)
(12) రత్నమాల (పేరు మార్చమ్) మహారాష్ట్రలోని ఓ వెనుకబడిన ప్రాంతం.పెళ్లి చేసుకొని కొత్త జీవితం ఆరంభించింది. ముందంతా మంచి కాలమేనని ఎన్నో కళలు కన్నది. బాలీవుడ్ సినిమాలో చూపినట్లు .. తన భర్త తనను ప్రేమించాలని కోరుకొంది. కొన్ని రోజులు అనుకున్నట్లుగానే సాగింది. ఆమె భర్త బాగా చదువుకున్నవాడు. ఆమె అవసరాలు తీర్చేవాడు. కానీ ఒకే ఒక సమస్య. శృంగారం బాధాకరంగా .. ఒక్కోసారి హింసాత్మకంగా ఉండేది. ఆమె భర్తకు పోర్న్ వ్యసనం ఉంది. ఆ వీడియోల్లో చూసే పనులు చేయాలంటూ ఆమెను రోజు బలవంతం చేసేవాడు. రోజులు గడిస్తే తన భర్త ప్రవర్తనలో మార్పు వస్తుందని ఆమె ఆశించింది. కానీ అలా జరుగలేదు. నిజానికి అతడు ఇంకా హింసాత్మకంగా మారాడు. రాత్రంతా నీలి చిత్రాలు చూడటం మొదలు పెట్టాడు. ఉత్ప్రేరకాలు వాడేవాడు. భార్యతో బలవంతంగా సెక్స్ చేసేవాడు. తన కోరికలు తీర్చకపోతే ఆమెను తీవ్రంగా కొట్టేవాడు. ఒకరోజు .. ఒక పోర్న్ వీడియోలో చూపిన విధంగా ఆమె కాళ్ళను సీలింగ్ ఫ్యాన్ కు కట్టి ఆమెను తలకిందులుగా వేలాడ దీసి .. ఆమెతో సెక్స్ చేశాడు. దీంతో ఆమె గుండె బద్దలయింది. తీవ్రంగా కుంగిపోయింది. ఇక భరించలేని స్థితిలో అయిష్టంగానే విడాకుల కోసం దరకాస్తు చేసింది.( బిబిసి న్యూస్ అక్టోబర్ 23, 2017)
"పోర్న్ ప్రభావంతో భర్తలు లైంగికంగా దాడులకు పాల్పడుతున్న కేసులు మా దగ్గరకు రావడం అంతకంతకు పెరుగుతుంది. భర్తలు నీలి చిత్రాలు చూసి తమతో అసహజమైన సెక్స్ చేయాలని తమ భార్యల మీద ఒత్తిడి తెస్తున్నారు. వారు ఒప్పుకోకపోతే వారిని హించించడం మాములుగా మారిపోయింది. గ్రామీణ ప్రాంతమైనా, పట్టణ ప్రాంతమైనా, అన్నీ సామాజిక ఆర్థిక తరగతుల కుటుంబాల్లో సైతం ఇదే పరిస్థితి ఉంది. మగవాళ్ళు మద్యం మత్తులో ఉన్నపుడు ఇటువంటి దాడులు ఎక్కువగా జరుగుతున్నాయని మా పరిశీలనలో తేలింది".. రాధ సోషల్ వర్కర్(women and children cell,T.A.T.A trust of Maharashtra)
➤ చేయాల్సినవి ..!
1. పరిచయం ఉన్న వ్యక్తుల నుంచి వచ్చే ఫ్రెండ్ రిక్వెస్టులను మాత్రమే అంగీకరించాలి. లేదంటే సమస్యల సుడిగుండంలో పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
2. అపరిచితులతో అనవసరమైన చాటింగులు చేయటం మానివేయాలి. లేదంటే ఆకర్షణ వలలో పడి బతుకు అయోమయంగా మారే అవకాశం ఉంది.
3. స్నేహితులకు తమ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయాలనుకుంటున్నపుడు, అనుమతి తీసున్నాకే అప్లోడ్ చేయమని చెప్పాలి. లేదంటే మీ వ్యక్తిగత ఫోటోలను, వీడియోలు ప్రజలకు పరిచయమై పరువు పోయే ప్రమాదం పొంచి ఉంది.
4. కుటుంభ సభ్యులకు సంబందించిన ఏ సమాచారాన్ని అయినా షేర్ చేసే ముందు వారికి చెప్పిన తర్వాతే చేయాలి. లేదంటే కుటుంభం అంతా అల్లకల్లోలంగా మారే ప్రమాదం ఉంది.
5. మనం ఇంట్లో వాడే కంప్యూటర్ కు ఉండే వెబ్ కామ్ ని అవసరమైతే తప్ప మూసే ఉంచాలి. లేదంటే హ్యాకర్లు మనకు తెలియకుండానే, మనకు సంబందించిన వ్యక్తిగత కార్య కలాపాలను తస్కరించే ప్రమాదం ఉంది
➤ చేయకూడనివి .. !
1. పరిచయం లేని వ్యక్తుల నుండి వచ్చే ఫ్రెండ్ రిక్వెస్టులను అంగీకరించవద్దు.
2. పరిచయం లేని వ్యక్తులతో ఎట్టి పరిస్థితులలోను ఎటువంటి సమాచారాన్ని పంచుకోకూడదు.
3. ప్రేమ పేరుతో అవతలి వ్యక్తుల్ని అతిగా నమ్మి, వాళ్ళతో చనువుగా ఉంటూ సెల్ఫీలు దిగటం చేయవద్దు.
4. మీ గూర్చి మీ కుటుంభం సభ్యుల గూర్చిన వ్యక్తిగత సమాచారాన్ని సోషల్ మీడియాలో పెట్టకూడదు.
5. అంతర్జాలంలో కనిపించే అనవసరమైన యాడ్స్ కి వ్యక్తిగత సమాచారాలను ఇవ్వవద్దు.
➤ అశ్లీలత వల్ల కలిగే అనర్థాలు ...?
1. మనిషి యొక్క శీలాన్ని వేలం వేస్తుంది.
2. మనసుని ముక్కలు చేసి ఫాంటసీ వైపు మళ్ళిస్తుంది.
3. మద్యానికి మాదక ద్రవ్యాలకు బానిసగా మారుస్తుంది.
4. బుద్దిని క్రమేపి క్షీణింప జేస్తుంది.
5. అత్యాచారాలు ఎక్కువ జరగటానికి కారణమవుతుంది. .
6. ఆత్మ హత్య చేసుకోవటానికి ప్రేరేపిస్తుంది.
7. హత్యలు చేయటానికి పురికొల్పుతుంది.
8. పెళ్లికి ముందు లైంగిక సంబంధాలకు దారి తీస్తుంది.
9. పెళ్లి తర్వాత కూడా అక్రమ సంబంధాలకు బాటలు వేస్తుంది.
10. భార్య భర్తల మధ్య చిచ్చు పెడుతుంది.
11. కుటుంబాన్ని పక్క దారి పట్టిస్తుంది.
12. సమాజాన్ని చెద పురుగులా తినేస్తుంది.
➤ తల్లిదండ్రులు తప్పక చేయాల్సిన పనులు ... ?
1. దిన పత్రికలోని ఏ విషయాలపై ఆసక్తి చూపుతున్నారో పసిగట్టాలి.
2. ఏ రకమైన పుస్తకాలను తరచుగా చదువుతున్నారో దృష్టి ఉంచాలి.
3. స్మార్ట్ ఫోన్ వాడుతున్నపుడు ఏ సైట్లు తరచుగా వెతుకుతున్నారో పరిశీలించాలి.
4. కంప్యూటర్ ఉపయోగిస్తున్నప్పుడు ఎటువంటి సైట్లను ఎక్కువగా చూస్తున్నారో తెలుసుకోవాలి.
5. ఒంటరిగా ఉన్నపుడు టీవీలో ఏ చానల్స్ చూస్తున్నారో గమనించాలి.
6. నైతిక విలువలను పాడుచేసే నెట్ లోని సైట్లను చూడకూడదని నెమ్మదిగా నచ్చజెప్పాలి.
7. మద్యం మాదక ద్రవ్యం వంటి నిషేధాల లాగే నెట్ వినియోగం విషయంలో పరిమితులతో కూడిన ఆరోగ్యకరమైన అలవాట్లను కుటుంభంలో ఏర్పరచాలి.
8. సాంప్రదాయాల పేరుతో చాందసత్వాన్ని ప్రదర్శించక .. తెలిసి తెలియక పిల్లలు లైంగిక విషయాలు మాట్లాడినా, అడిగినా నోరుమూయించకుండా నేర్పుగా వారితో వ్యవహరించాలి.
9. అసభ్యకరమైన దృశ్యాలను చూడకుండా, అశ్లీల చిత్రాలను వీక్షించకుండా అడ్డుకునే సాఫ్ట్ వేర్లను మనం వాడే ఎలక్ట్రానిక్ పరికరాలలో ముందుగానే వేయాలి.
"వేదాలు మనుషుల చేత రచించబడలేదని ఒక విశ్వాసం. వేటూరి మాత్రం తన ఆరవ వేదాన్ని, మరో మహా భారతాన్ని బాధితురాలి చేత పాడించారు. ప్రతిఘటన సినిమాలో లెక్చరర్ జాన్సీనీ విద్యార్థులు అల్లరి పెడతారు. బ్లాక్ బోర్డ్ మీద అసభ్యంగా బొమ్మలు గీస్తారు. విద్యార్థుల మెదళ్ళకు పట్టిన తుప్పు తీసివేయడానికి జాన్సీ పాత పాడుతుంది. దాన్ని రాసిన వారు వేటూరి. కల్లోల సామాజిక చిత్రానికి వేటూరి చేసిన లోతైన విశ్లేషణను పాత అనే పరిధిలో చేర్చడం తక్కువ చేసినట్లుగా అన్పిస్తుంది గానీ .. ఈ దుర్యోధన దుశ్శాశన గీతం కేవలం పాట అనుకోవడానికి లేదు. అదొక సామాజిక చిత్రం. సంక్షోభ చిత్రం. వర్తమాన చరిత్రపై ఎగసిన అగ్ని గీతం.
స్త్రీలను రకరకాలుగా వేదించే నానా రకాల నరరూప రాక్షసులను చూసి 'ఏమై పోతుంది సభ్య సమాజం' అని అడుగుతారు. అర్ధ రాత్రి సరే, పట్ట పగలు కూడా స్త్రీ ఎందుకు దైర్యంగా నడవలేక పోతుందో చెప్పండని నిల దీస్తారు. సభ్యతకి, సంస్కృతికి ఉన్న చోట నైతిక విలువలు ఉంటాయి. అవి ధర్మాన్ని నిర్దేశిస్తాయి. స్త్రీలు ఉన్న చోట దేవతలు ఉంటారని చెబుతాయి. స్త్రీలకు చేతులెత్తి మొక్కే విధానాన్ని నేర్పుతాయి. ఎక్కడైతే సభ్యత, సంస్కృతి ఉండదో అక్కడ మగవాడు వికృత రూపిగా మారుతాడు అంటాడు వేటూరి. శిశువులుగా పుట్టి పశువులుగా మారే వాళ్ళను ఉద్దేశించి .. 'మర్మ స్థానం కాదది నీ జన్మ స్థానం, మానవతకు మోక్షమిచ్చు పుణ్య క్షేత్రం' అంటారు తీవ్రంగా, కామంతో కళ్ళు మూసుకు పోయిన వాళ్ళ కళ్ళు తెరిపించే బలమైన వాక్యాలు ఇవి. స్త్రీ అంటే శరీర కొలతలు కాదు, ఆడుకునే అందమైన బొమ్మలు కాదు, బలహీనులు కాదు, పరాధీనులు కాదు .. వాళ్లకు ఒక హృదయం ఉంది. ఆ హృదయానికి ఆలోచన ఉంది, ఆగ్రహం ఉంది. ఆయుదమయ్యే శక్తి ఉందంటారు ఆయన. ఆ హృదయాన్ని గుర్తించమంటారు. ఆ ఆలోచన సారాన్ని గ్రహించమంటారు. ఆమె అందమైన కళ్ళను కాదు, ఆగ్రహపు అగ్ని పర్వతాలను చూడండి, చేతుల్లో కనిపించని పదునైన ఆయుధాలను చూడండి అంటారు ఆయన". (ప్రతి ఘటన సినిమాపై సాక్షి దినపత్రికలో వచ్చిన సమీక్ష)
What about pornography..?

- ప్రోనియా, గ్రాఫో అనే రెండు పదాల కలయిక వలన పుట్టిన పదం ఫోనోగ్రఫీ
- శీలాన్ని లేదా సహజత్వాన్ని చెరపడం అని లాటిన్ మూలంలో
- నగ్నమైన చిత్రాలు లేదా నైతికతను పాడు చేసే రచనలు అని గ్రీకులో
- కామ కోరికల్ని రగిల్చే సాహిత్యం మరియు సినిమాలా యొక్క లైంగిక ఘటనల నిలువెత్తు రూపమే అశ్లీలం అని ఆక్స్ ఫర్డ్ నిఘంటువులో
- తప్పు చేయుటకు ప్రేరణ అని వెబ్ స్టర్ నిఘంటువులో
- ప్రవర్తనను పెడ దోవ పట్టించే ప్రేరేణ అని ట్రాన్స్ ఫరెన్సీ ఇంటర్ నేషనల్ సంస్థ ఇచ్చిన నిర్వచనం

ఒక సర్వే ... ?
అందరికి అందుబాటులోకి వస్తున్న సాంకేతిక పరిజ్ఞానముతో అశ్లీల చిత్రాలు చూసే వారి సంఖ్య భారీగాపెరుగుతుంది . ఇదో వ్యసనంగా మారి కొత్త సామాజిక సమస్యలకు కారణమవుతుంది. వీటిని చూసేందుకు అలవాటు పడ్డవారిలో క్రమంగా హింసాత్మక ప్రవృత్తి పెచ్చు మీరుతుంది. అత్యాచారాలు పెరగడానికి ఇదో ప్రధాన కారణం. హైదరాబాద్ కళాశాల విద్యార్థులకు ఇదొక మూకుమ్మడి వ్యసనంగా పరిణమిస్తోందని రెస్క్యూ అనే స్వచ్చంద సంస్థ తన అభిప్రాయ సేకరణ నివేదికలో పేర్కొంది. ఈ నివేదికలో మరెన్నో భయంకరమైన వాస్తవాలు వెలుగు చూశాయి.- 21 శాతం మంది కళాశాల విద్యార్థులు అశ్లీల చిత్రాలు, అత్యాచారాలు, మూకుమ్మడి అత్యాచారాల వంటివి చూస్తున్నారు. వీరు సఘటున వారానికి 14 అత్యాచారాలను చూస్తున్నారు.
- తొమ్మిదేళ్ల వయసు నుంచే కొందరు అశ్లీల చిత్రాలను చూడటం ప్రారంభిస్తున్నారు
- సగటున వారానికి నాలుగు గంటల చొప్పున చూస్తున్నారు
- గ్రామీణ ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి
- అశ్లీల చిత్రాల వీక్షణ అనేది మాదక ద్రవ్యాల వ్యసనం లాంటిదే. మొదట సాధారణ అశ్లీల చిత్రాలు చూస్తారు. అనంతరం అత్యాచారాల వంటి హింసాత్మక అశ్లీల చిత్రాలు, చిన్న పిల్లల అశ్లీల చిత్రాలు చూడటం మొదలు పెడతారు.
- అత్యాచారాల చిత్రాలు చూసిన విద్యార్థుల్లో 58 శాతం మంది తాము చూపినట్లు నిజ జీవితంలో కూడా చేయాలనే కాంక్షను వ్యక్తం చేస్తారు. వీరిలో 10 శాతం మంది అత్యాచారానికి పాల్పడితే .. హైదరాబాద్ లోనే భారీ రేపిస్టులు తయారయ్యే అవకాశముంది.
- అత్యాచారాలు అత్యంత హింసాత్మకంగా మారడానికి, అత్యాచారాలు చేసే నిందితుల సగటు వయసు క్రమంగా తగ్గడానికి ఇది ఒక కారణం.
- టీవీల్లో వ్యాపార ప్రకటనలు చూసిన తర్వాత మార్కెట్ లో అదే వస్తువును కొనేందుకు ఇష్టం చూపుతారన్నది వ్యాపార సూత్రం. అశ్లీల చిత్రాల విషయంలోనూ ఇదే సూత్రం వర్తిస్తుంది.
- అశ్లీల చూసే విద్యార్థుల్లో 53 శాతం మంది పిల్లల అశ్లీల చిత్రాలు చూస్తున్నారు.
- ఈ చిత్రాలు చూడటానికి అలవాటు పడ్డ డిగ్రీ విద్యార్థుల్లో 16 శాతం మంది నెలకు ఒక్కసారైనా వ్యభిచారుల వద్దకు వెలుతున్నారు.(ఈనాడు దినపత్రిక నవంబర్ 21, 2014)
- ఇవాళ ఇంటర్ నెట్ వాడకం దార్ల సంఖ్యలో ప్రపంచం మొత్తం మీద చైనా తర్వాత రెండో స్థానం మన ఇండియాదే. ఆ మాటకొస్తే, నెట్ యూజర్ల సంఖ్యలో మనం అమెరికాను కూడా అధిగమించేసాం.
- ప్రపంచంలో కెల్లా శరవేగంతో ఇంటర్నెట్ వాడకం దార్లు పెరుగుతున్న ప్రధాన మార్కెట్ మన దేశమే.
- వెంచర్ క్యాపిటలిస్ట్ మేరీ మీకర్ సిద్ధం చేసిన 'ఇంటర్నెట్ ట్రెండ్స్' ప్రకారం ఒక్క గడిచిన 2015 లోనే మన దేశంలో ఇంటర్నెట్ యూజర్ల సంఖ్య 40 శాతం పెరిగింది. యూజర్ల సంఖ్య 27. 7 కోట్ల మందికి చేరింది.
- 2014 కన్నా 2015 లో నెట్ వాడకం దార్లు పెరిగిన ఏకైక దేశం మనదే. 2014 లో పెరిగిన వాడకం దార్లు 33 శాతం మందే.
- మన దేశంలో రోజు 6. 8 కోట్ల మంది తమ మొబైల్ ఫోన్లలో ఇంటర్నెట్ చూస్తున్నారు. (ఈనాడు దినపత్రిక ఆగస్ట్ 8,2016)
➤ చేయాల్సినవి ..!
1. పరిచయం ఉన్న వ్యక్తుల నుంచి వచ్చే ఫ్రెండ్ రిక్వెస్టులను మాత్రమే అంగీకరించాలి. లేదంటే సమస్యల సుడిగుండంలో పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
2. అపరిచితులతో అనవసరమైన చాటింగులు చేయటం మానివేయాలి. లేదంటే ఆకర్షణ వలలో పడి బతుకు అయోమయంగా మారే అవకాశం ఉంది.
3. స్నేహితులకు తమ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయాలనుకుంటున్నపుడు, అనుమతి తీసున్నాకే అప్లోడ్ చేయమని చెప్పాలి. లేదంటే మీ వ్యక్తిగత ఫోటోలను, వీడియోలు ప్రజలకు పరిచయమై పరువు పోయే ప్రమాదం పొంచి ఉంది.
4. కుటుంభ సభ్యులకు సంబందించిన ఏ సమాచారాన్ని అయినా షేర్ చేసే ముందు వారికి చెప్పిన తర్వాతే చేయాలి. లేదంటే కుటుంభం అంతా అల్లకల్లోలంగా మారే ప్రమాదం ఉంది.
5. మనం ఇంట్లో వాడే కంప్యూటర్ కు ఉండే వెబ్ కామ్ ని అవసరమైతే తప్ప మూసే ఉంచాలి. లేదంటే హ్యాకర్లు మనకు తెలియకుండానే, మనకు సంబందించిన వ్యక్తిగత కార్య కలాపాలను తస్కరించే ప్రమాదం ఉంది
➤ చేయకూడనివి .. !
1. పరిచయం లేని వ్యక్తుల నుండి వచ్చే ఫ్రెండ్ రిక్వెస్టులను అంగీకరించవద్దు.
2. పరిచయం లేని వ్యక్తులతో ఎట్టి పరిస్థితులలోను ఎటువంటి సమాచారాన్ని పంచుకోకూడదు.
3. ప్రేమ పేరుతో అవతలి వ్యక్తుల్ని అతిగా నమ్మి, వాళ్ళతో చనువుగా ఉంటూ సెల్ఫీలు దిగటం చేయవద్దు.
4. మీ గూర్చి మీ కుటుంభం సభ్యుల గూర్చిన వ్యక్తిగత సమాచారాన్ని సోషల్ మీడియాలో పెట్టకూడదు.
5. అంతర్జాలంలో కనిపించే అనవసరమైన యాడ్స్ కి వ్యక్తిగత సమాచారాలను ఇవ్వవద్దు.
➤ అశ్లీలత వల్ల కలిగే అనర్థాలు ...?
1. మనిషి యొక్క శీలాన్ని వేలం వేస్తుంది.
2. మనసుని ముక్కలు చేసి ఫాంటసీ వైపు మళ్ళిస్తుంది.
3. మద్యానికి మాదక ద్రవ్యాలకు బానిసగా మారుస్తుంది.
4. బుద్దిని క్రమేపి క్షీణింప జేస్తుంది.
5. అత్యాచారాలు ఎక్కువ జరగటానికి కారణమవుతుంది. .
6. ఆత్మ హత్య చేసుకోవటానికి ప్రేరేపిస్తుంది.
7. హత్యలు చేయటానికి పురికొల్పుతుంది.
8. పెళ్లికి ముందు లైంగిక సంబంధాలకు దారి తీస్తుంది.
9. పెళ్లి తర్వాత కూడా అక్రమ సంబంధాలకు బాటలు వేస్తుంది.
10. భార్య భర్తల మధ్య చిచ్చు పెడుతుంది.
11. కుటుంబాన్ని పక్క దారి పట్టిస్తుంది.
12. సమాజాన్ని చెద పురుగులా తినేస్తుంది.
➤ తల్లిదండ్రులు తప్పక చేయాల్సిన పనులు ... ?
1. దిన పత్రికలోని ఏ విషయాలపై ఆసక్తి చూపుతున్నారో పసిగట్టాలి.
2. ఏ రకమైన పుస్తకాలను తరచుగా చదువుతున్నారో దృష్టి ఉంచాలి.
3. స్మార్ట్ ఫోన్ వాడుతున్నపుడు ఏ సైట్లు తరచుగా వెతుకుతున్నారో పరిశీలించాలి.
4. కంప్యూటర్ ఉపయోగిస్తున్నప్పుడు ఎటువంటి సైట్లను ఎక్కువగా చూస్తున్నారో తెలుసుకోవాలి.
5. ఒంటరిగా ఉన్నపుడు టీవీలో ఏ చానల్స్ చూస్తున్నారో గమనించాలి.
6. నైతిక విలువలను పాడుచేసే నెట్ లోని సైట్లను చూడకూడదని నెమ్మదిగా నచ్చజెప్పాలి.
7. మద్యం మాదక ద్రవ్యం వంటి నిషేధాల లాగే నెట్ వినియోగం విషయంలో పరిమితులతో కూడిన ఆరోగ్యకరమైన అలవాట్లను కుటుంభంలో ఏర్పరచాలి.
8. సాంప్రదాయాల పేరుతో చాందసత్వాన్ని ప్రదర్శించక .. తెలిసి తెలియక పిల్లలు లైంగిక విషయాలు మాట్లాడినా, అడిగినా నోరుమూయించకుండా నేర్పుగా వారితో వ్యవహరించాలి.
9. అసభ్యకరమైన దృశ్యాలను చూడకుండా, అశ్లీల చిత్రాలను వీక్షించకుండా అడ్డుకునే సాఫ్ట్ వేర్లను మనం వాడే ఎలక్ట్రానిక్ పరికరాలలో ముందుగానే వేయాలి.
"వేదాలు మనుషుల చేత రచించబడలేదని ఒక విశ్వాసం. వేటూరి మాత్రం తన ఆరవ వేదాన్ని, మరో మహా భారతాన్ని బాధితురాలి చేత పాడించారు. ప్రతిఘటన సినిమాలో లెక్చరర్ జాన్సీనీ విద్యార్థులు అల్లరి పెడతారు. బ్లాక్ బోర్డ్ మీద అసభ్యంగా బొమ్మలు గీస్తారు. విద్యార్థుల మెదళ్ళకు పట్టిన తుప్పు తీసివేయడానికి జాన్సీ పాత పాడుతుంది. దాన్ని రాసిన వారు వేటూరి. కల్లోల సామాజిక చిత్రానికి వేటూరి చేసిన లోతైన విశ్లేషణను పాత అనే పరిధిలో చేర్చడం తక్కువ చేసినట్లుగా అన్పిస్తుంది గానీ .. ఈ దుర్యోధన దుశ్శాశన గీతం కేవలం పాట అనుకోవడానికి లేదు. అదొక సామాజిక చిత్రం. సంక్షోభ చిత్రం. వర్తమాన చరిత్రపై ఎగసిన అగ్ని గీతం.
స్త్రీలను రకరకాలుగా వేదించే నానా రకాల నరరూప రాక్షసులను చూసి 'ఏమై పోతుంది సభ్య సమాజం' అని అడుగుతారు. అర్ధ రాత్రి సరే, పట్ట పగలు కూడా స్త్రీ ఎందుకు దైర్యంగా నడవలేక పోతుందో చెప్పండని నిల దీస్తారు. సభ్యతకి, సంస్కృతికి ఉన్న చోట నైతిక విలువలు ఉంటాయి. అవి ధర్మాన్ని నిర్దేశిస్తాయి. స్త్రీలు ఉన్న చోట దేవతలు ఉంటారని చెబుతాయి. స్త్రీలకు చేతులెత్తి మొక్కే విధానాన్ని నేర్పుతాయి. ఎక్కడైతే సభ్యత, సంస్కృతి ఉండదో అక్కడ మగవాడు వికృత రూపిగా మారుతాడు అంటాడు వేటూరి. శిశువులుగా పుట్టి పశువులుగా మారే వాళ్ళను ఉద్దేశించి .. 'మర్మ స్థానం కాదది నీ జన్మ స్థానం, మానవతకు మోక్షమిచ్చు పుణ్య క్షేత్రం' అంటారు తీవ్రంగా, కామంతో కళ్ళు మూసుకు పోయిన వాళ్ళ కళ్ళు తెరిపించే బలమైన వాక్యాలు ఇవి. స్త్రీ అంటే శరీర కొలతలు కాదు, ఆడుకునే అందమైన బొమ్మలు కాదు, బలహీనులు కాదు, పరాధీనులు కాదు .. వాళ్లకు ఒక హృదయం ఉంది. ఆ హృదయానికి ఆలోచన ఉంది, ఆగ్రహం ఉంది. ఆయుదమయ్యే శక్తి ఉందంటారు ఆయన. ఆ హృదయాన్ని గుర్తించమంటారు. ఆ ఆలోచన సారాన్ని గ్రహించమంటారు. ఆమె అందమైన కళ్ళను కాదు, ఆగ్రహపు అగ్ని పర్వతాలను చూడండి, చేతుల్లో కనిపించని పదునైన ఆయుధాలను చూడండి అంటారు ఆయన". (ప్రతి ఘటన సినిమాపై సాక్షి దినపత్రికలో వచ్చిన సమీక్ష)
అశ్లీలత
అంగడి సరుకుగా మారి
అమ్మాయిల బతుకును బుగ్గిపాలు చేసింది.
సెల్ ఫోన్ రాకతో ..
సోషల్ మీడియా పేరుతొ ..
సమస్యల వలయంలోకి నెట్టేసింది.
విలువల ఊసే ఎత్తకుండా
వావి వరుసల ధ్యాసే లేకుండా
నడిబజారులో నగ్నత్వాన్ని ఊరేగిస్తుంది.
@2010 Fundamental And Christian Ethics - 5 http//:srinufoundation.blogspot.in cell..9951522188
your icon for social human being
రిప్లయితొలగించండిit's great part life
రిప్లయితొలగించండిgreat author. i humble heartful thanks for motivation to people. your legendry in human being sir.
రిప్లయితొలగించండిI appreciate the interest taken by you. The presentation is really good. continue your work. My only suggestion is don't go deep into religion-that is a sensitive subject
రిప్లయితొలగించండి