SRINU FOUNDATION

Share:
నేస్తమా ...!
             నేనెవరో మీకు తెలియదు .. ఒకవేళ పరిచయం ఉన్నా నా భావాలేంటో మీకు తెలియకపోవచ్చు. ఇలా మీతో మాట్లాడుతున్నందుకు సంతోషంగా ఉంది. సంవత్సరాలుగా నా గుండెల్లో మండుతున్న ఆవేదన .. మీతో పంచుకుంటే తీరుతుందన్న చిన్న ఆశతో నా అంతరంగాన్ని మీ ముందు పెడుతున్నాను. అత్యంత ధనిక కుటుంభంలో జన్మించాను. ఊహ తెలిసేనాటికి కట్టుకోవడానికి ఒక జత బట్టలు, ఉండటానికి ఇల్లు, ఓదార్చటానికి తోబుట్టువులు తప్ప ఏవి నాతో లేవు. ఆరోగ్యం క్షీణించింది .. అడుక్కునే పరిస్థితి దాపురించింది .. హాస్పిటాల్ వెళ్లి చూయించుకోవటానికి పైసలు లేవు .. ధాన్యం కొనుక్కోవటానికి డబ్బులు లేవు .. చివరకు అమ్మ రెక్కల కష్టమే ఆధారమై పూత గడవడమే కష్టమైంది. క్రమంగా ఒక్క పూటతో గడిపిన రోజులు, కంటికి కునుకు లేని రాత్రులు ఎన్నో నా జీవితంలో చోటు చేసుకున్నాయి. గుండెకు గాయమైంది .. మనస్సు ముక్కలైంది .. సహాయం చేసేవారు లేక .. ఏమి చేయాలో తోచక .. నిస్సహాయస్థితిలో కాలాన్ని గడిపేసాను.
                              మనిషి పుడుతున్నాడు .. గొప్ప చదువులు చదివి ఉద్యోగం సంపాదిస్తున్నాడు లేదా వ్యాపారమో, వ్యవసాయమో చేస్తూ ఆస్తులు కూడబెడుతున్నాడు .. అంతస్తులు నిర్మించి ఆడంబరంగా బతుకుతున్నాడు .. పెళ్లి చేసుకొని, పిల్లలను కని, వారికి పెళ్లిళ్లు చేసి, సంపాదించినదంతా వారి చేతుల్లో పెట్టి వృద్ధాప్యంలో కళ్ళు మూస్తున్నాడు. బ్రతికినంతకాలం నేను, నా కుటుంబము, బంధువులు అంటూ బ్రతుకును ఈడుస్తూ చుట్టూ ఉన్నవారి గూర్చిన ఊసే మాటల్లోకి రానివ్వడం లేదు. అందుకే జీవితమంటే ఇంతేనా ..? అనే ప్రశ్న ఈనాటికి నన్ను వేధిస్తూనే ఉంది. భారత దేశం అనేక రంగాలలో అభివృద్ధి సాదిస్తున్నప్పటికీ అంతర్జాతీయంగా మాత్రం పేద దేశంగా, వెనుకబడిన రాజ్యంగా గుర్తింపును కలిగి ఉంది. ఎంతో ధనవంతులున్న ఈ దేశంలో .. అనేకులు కూటికి గతిలేక చచ్చిపోతున్నారు .. కట్టుకునేందుకు బట్టలు లేక అవమానాలకు గురవుతున్నారు .. బతికేందుకు నివాసం లేక బజారు పాలవుతున్నారు .. చదివేందుకు స్తోమత లేక కృంగిపోతున్నారు .. మనుగడకోసం పోరాటంలో, బ్రతకాలనే ఆరాటంలో అసువులు బాస్తున్నారు .. మొగ్గ దశలోనే మురికి కుంటలలో, చెత్త కుప్పలలో విసిరివేయబడుతున్నారు .. ఇలాంటి సంఘటనలను అవకాశంగా భావిస్తున్న స్వార్థపరులు బజారులో అమ్మకానికి సిద్ధమవుతున్నారు. సాటి మనిషిని ఆదుకోవాల్సిన ఈ యుగ పురుషులు మానవత్వాన్ని మర్చిపోయి మృగాలుగా ప్రవర్తిస్తున్నారు .. దేవుని పేరట కోట్లు ఖర్చు పెడుతున్న దైవ మానవులు సైతం తమకేమి తెలియనట్లు ప్రవర్తిస్తున్నారు.
                 సేవ .. దివ్యమైనది, దైవికమైనది .. దానికి మించిన సార్థకత ప్రపంచంలో దేనికి లేదనే సంగతి అనేకులకు తెలుసు. సేవ చేయాలనే ఆశ కలిగిన మహానుభావులు ఉన్నారు .. సేవను అవకాశంగా తీసుకొని ఆడంబరంగా బతికే మూర్ఖులు ఉన్నారు. మీరు మాత్రం మొదటి వర్గంలో ఉండాలన్నదే నా బలమైన ఆకాంక్ష. సేవ సంస్థల యొక్క పనులను, ప్రభుత్వ విధానాలను పరిశీలించినపుడు కఠినమైన సత్యాలు నా మనసుని కలిచివేసాయి. మంచి మనసుతో ఆరంభిస్తున్నారు .. మనుషులను ఏకం చేస్తున్నారు .. ఆస్తులు సమకూరగానే స్వార్థంగా ఆలోచిస్తున్నారు .. అధికారం కనిపించగానే అజమాయిషి చూయిస్తున్నారు .. సేవ పేరుతో మోసాలకు పాల్పడుతున్నారు .. దేవున్ని సహితం కీలు బొమ్మగా వాడుకుంటున్నారు. అందుకే సేవ పేరుతో డబ్బులు పోగుచేయడం, సంస్థ పేరుతో మనుషులను ఏకం చేయడం సరైంది కాదని అర్థమైంది .. వ్యక్తి నుంచి వ్యక్తికే సహాయం చేయడం ఉత్తమమైంది.
                          ఎదుటివారి సమస్యను మన సమస్యగా భావించినపుడే హృదయం ద్రవిస్తుంది .. వారి స్థానంలో ఉండి ఆలోచించినపుడే బాదేంటో అర్థం అవుతుంది. చుట్టూ ఎందరో మన సహాయం కొరకు వేచి ఉంటారు .. మన చల్లని చూపు వారిపై పడుతుందన్న ఆశతో నిలబడి ఉంటారు. అవేవి మనకు పట్టవు .. ఎవరు ఎటు పోతే నాకేంటి అనే ధోరణి ఈ తరం మనుషుల్లో ఎక్కువగా కన్పిస్తుంది. భారతీయుడిగా అడుగుతున్నా .. చేతనైతే సహాయం చేయండి .. వీలైతే సలహా ఇవ్వండి .. లేదంటే మౌనంగా ఉండండి .. కానీ సమస్యలను మీరే సృష్టిస్తూ నిస్సహాయకులను మాత్రం తయారు చేయకండి. తెలివిని బట్టి మనుషులను మూడు వర్గాలుగా చెప్పవచ్చు. తెలియక తప్పులు చేసే అమాయకులు (Innocents) ఉన్నారు .. తెలిసి తప్పులు చేస్తూ ఇతరులను ఇబ్బంది పెట్టె మూర్కులు(Illiterates) ఉన్నారు .. పెద్ద చదువులు చదివి కొంపలు ముంచే చదువుకున్న మూర్కులు (Intellectuals) లేకపోలేదు. అనేకసార్లు దేవుడే కారణమని తప్పించుకుంటున్నాం .. మనిషి సమస్యలకు మూల కారణం మనిషే అనే సంగతి మరిచిపోతున్నాం. 
                       సమాజాన్ని ఉద్దరించాలనో .. నన్ను సన్మానించాలనో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టలేదు, అందరిని ఆదుకోవటం నా ఒక్కడి వల్ల అయ్యే పని కాదని తెలిసి .. ఈ రోజు నేను బ్రతికినా, రేపు చచ్చినా తరతరాలకు విలువైన భాద్యతను అందించాలనే ఉద్దేశంతో 2001 లో ఫౌండేషన్ ప్రారంభించాను. నా వంతుగా ఈ తరానికి కొంతైనా మేలు చేయాలనే సంకల్పంతో, ప్రతి ఒక్కరిని భాగస్వాములను చేయాలనే తపనతో మీతో పంచుకుంటున్నాను. సహాయం చేయటానికి సంస్థ అక్కరలేదు, సమూహంతో పనే లేదు .. సహాయం చేయాలనే మంచి మనసు ఉంటే చాలు. ఆదుకోవటానికి ఆస్తులే ఉండనక్కరలేదు, అధికారంతో ఒరిగేది ఏమిలేదు .. ఉన్నదాంట్లో నుండి కొంత పంచిస్తే చాలు. ఇతరులకు సహాయం చేయండని అనేకులను అడిగినపుడు మేమెందుకు చేయాలి .. ? అనే ప్రశ్నను ఎక్కువగా ఎదుర్కొన్నాను. ఆ ఆశే మాలో లేదు .. అనే సమాధానం నేటికీ నన్ను తీవ్రంగా భాదిస్తుంది. ఎదుటి వారి నుండి సహాయం పొందేటపుడు రాణి ప్రశ్న .. చేయమని చెప్పినపుడు ఎందుకు వస్తుంది ? నీకు సహాయం చేసేవాడు నాకెందుకులే అనుకుంటే ఈరోజు ఈ స్థితిలో ఉండేవాడివా ఒక్కసారి ఆలోచించు ! నీకైనా .. నాకైనా ఎంతటి వాడికైనా .. ఏదో ఒక సమయంలో సహాయం అవసరం అవుతుంది. ఈ లోకంలోకి ఏమి తీసుకొని రాలేం .. ఈలోకం నుండి ఏమి తీసుకొని పోలేం కనుక కనీసం మనవంతు కర్తవ్యంగా ఏదో ఒక మేలు చేసి జీవితాన్ని ముగించటానికి ప్రయత్నం చేద్దాం. ఈ ఆలోచనను మీ రక్త సంబందికులతో, స్నేహితులతో, సహచరులతో పంచుకొని నా పనిలో భాగస్వాములవుతారని ఆశిస్తూ .. నా ఆశయాన్ని మీ ఆశయంగా భావించి ఆచరిస్తారన్న నమ్మకంతో కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. 
మీ సహాయం కోరిన వారిలో ఒకరికైనా ... 
1. మంచి సలహా ఇవ్వండి. 
2. పూట భోజనం పెట్టండి. 
3. జత బట్టలు కొనివ్వండి. 
4. ఉచితంగా విద్యను అందించండి. 
5. ఉచితంగా వైద్యం చేయండి. 
6. మీ ఇంట్లో ఆశ్రయం కల్పించండి. (లేదా)
7. మీ చేతనైన సహాయం చేయండి.
"Do not wait for leaders .. Do it alone .. Person to Person" .. Mother Teresa

Address :
Srinivas Bopparam
s/o Gangaram
H.No. 2-44/3 
(post) pachala Nadukuda 
(mandal) velpoor
(District) nizamabad 
TELANGANA
Cell : 9951522188
srinu.foundation@gmail.com
Face book : Srinu Foundation

What about logo :



I for .. Iam
Base for the foundation
Book for knowledge
Round for the world
Hands for help
"నేను జ్ఞానం చేత సమాజాన్ని శాషించి, నిస్సహాయులకు సహాయం చేయాలనే సంకల్పంతో 2001  ఆరంభించిన వ్యవస్థ ఇది" 
                                                                

SELF INTRODUCTION :
1980 - My name Bopparam Srinivas. I was born and brought up in a rural village pachala nadukuda, mandal velpoor, Nizamabad district, Telangana. As a lecturer, I have been working since 2001. I have a big family(two elder sisters, one elder brother and one younger sister). My hobbies are reading books and writing articles, discussing contemporary issues and debating on communal struggles, used to helping the poor and hostile audiences. I laid a foundation with my name to serve the society.  I have been running a what's app blood group called as a `Blood Donors Forum` since 2017.I like science, philosophy and religion. I will lecture as a learning  man, preaching as a perfect man, counsel as a common man, serving as a spiritual man and writing as a relevant man.

As a philosopher, I have a deep desire to understand around the world to reach the goal of life.

As a counsellor, personally do counselings, conducting teaching and training programs for rural youth.

As a social worker, I use to help the needy people in their essential needs like.. health, education, food, cloths and shelter.  

As a speaker, I was addressed school/college/university students on various topics(especially personality development). I have been engaged in dialogues/debates with students and scholars regarding faith and facts..

As a writer, I have been writing articles on personality development and books on Science and religion.

As a preacher, I have been sharing the word of god in different type of dais and many Christian organisations.

As a human rights activist, I have been solving the problems of humanity where failing of human rights, arises by different types of community.

As a reporter delivering accurate and engaging content across print and multimedia platforms

As a skilled builder with more experience in residential construction, proven expertise in site preparation, interpreting blue prints, managing material and delivering high quality workmanship with collaboration of mesthri.      
  

ELIGIBILITY :
1985 - 1995 studied secondary school at ZPPSS, Pachala nadukuda
1996 - 1998 studied intermediate at CSI junior college, Nizamabad
1998 - 2001 studied bachelor of science degree at Govt Giriraj college, Nizamabad
2003 - 2004 studied bachelor of education at DVM college, Nalgonda
2009 - 2011 studied master of science in zoology at Nagarjuna university, Guntur
2012 - 2014 studied master of arts in English at Telangana university,Dichpally
2016 - 2018 studied master of arts in social work at Nagarjun auniversity, Guntur   

EXPERIENCE :
2001 -2003 worked as a biology teacher at Sri bharathi vidyalayam, Bheemgal
2004 - 2009 worked as a biology teacher at Akrithi high school, Velpoor
2011 - 2016 worked as a zoology lecturer at CSI degree college, Nizamabad
2016 - 2018 worked as a assistant professor of zoology and head of the department in Narendra degree and PG college, Armoor
2018 - 2022 worked as a zoology lecturer in Sai siddartha degree college, Bheemgal
2022 - 2024 worked as a lecturer at Mahatma jyothibha phule residential college, (yedapally) Bodhan
2024 - 2025 worked as a teacher at Narayana e-techno school at, Armoor
2025 - I have joined as a reporter in Chandra News daily paper
2025 - I have started a SADANA consultancy on my birthday in a different fields
 

 
AWARDS :
Indian ICON award given by national s.c cell chairman ramulu garu and koppula vijay kumar garu for my social service of society on world human rights day(10.12.2021)



PUBLICATIONS :

If you want any copy of my articles and books, please click on blue title which was given below 

personality:2001-2005



philosophy :2006-2010










persuation :2011-2015






perception:2016-2020



 NOTE : If you enjoyed or enlightened, benefited or blessed with my writings, why don't you become a part of my passion ? kindly introduce about my mission. Share my PDF files to your soulmates and send your contribution for upcoming writings with gratitude. you can send your contribution to this bank account : 
Bopparam Srinivas
Ac no..33316055335 
State Bank of India, 
branch Chengal, ifsc code SBIN 0021901

Phone pay : 9951522188


1 కామెంట్‌: